Government Jobs Success Stories : ఈ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగాల పంట పండింది.. ఈ పల్లె నుంచి ఒకేసారి..
ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన... గ్రూప్-4 ఉద్యోగాల్లో ఎంతో మంది పెదింటి బిడ్దలు సత్తాచాటారు. ఇందులో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తికి చెందిన నలుగురు యువకులు పిల్లలమర్రి వినోద్, పిల్లలమర్రి అరవింద్, లైశెట్టి అఖిల్, అలువాల కమలాకర్ జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధించారు. ఇందులో పిల్లలమర్రి వినోద్, పిల్లలమర్రి అరవింద్ అన్నదమ్ములు.
తొలి ప్రయత్నంలోనే..
తొలి ప్రయత్నంలోనే ఒకే గ్రామానికి చెందిన యువకులు ఉద్యోగాలు సాధించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. దొంగతుర్తి గ్రామానికి చెందిన పిల్లలమర్రి కళావతి, తిరుపతి దంపతులు తమ ఇద్దరు కొడుకులైన వినోద్, అరవింద్‌ను కష్టపడి చదివించారు. వ్యవసాయం చేయడంతో పాటు పిండి గిర్ని నడుపుతూ కొడుకులను ప్రయోజకులను చేశారు. పెద్ద కొడుకు వినోద్ ఆరేళ్ల క్రితమే వరంగల్ కిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేయగా, చిన్న కొడుకు 2023లో హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు పూర్తి చేసి గ్రూప్స్‌కు ప్రిపేర్ అయ్యారు. వీళ్లిద్దరూ ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక కాగా, గ్రూప్-1లో ప్రిలిమినరీ అర్హత సాధించి గత నెలలో మెయిన్స్ రాశారు.
గ్రూప్-1 మెయిన్స్‌కు కూడా..
ఇదే గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందిన లైశెట్టి అనిత- భిక్షపతి పెద్ద కొడుకు అఖిల్ తమిళనాడులోని చెన్నైలో ఎస్‌ఆర్ యూనివర్సిటీలో 5 నెలల క్రితం బీటెక్ పూర్తి చేసి, తొలి ప్రయత్నంలో గ్రూప్-4 (జూనియర్ అసిస్టెంట్) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మరో వ్యవసాయ కుటుంబమైన అడువాల స్వరూప-తిరుపతి రెండో కొడుకు 2020లో హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసి, ఇంటి వద్దనే ప్రిపేరై గ్రూప్-4 (జూనియర్ అసిస్టెంట్) ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన బొడిగె వెంకటేశ్ గ్రూప్-4 ఫలితాల్లో 176 మారులు సాధించి జూనియర్ అసిస్టెంట్ జాబ్ కొట్టేశాడు. గ్రూప్-1 మెయిన్స్‌కూ ఎంపికయ్యాడు.
ఒకే వ్యక్తిని నాలుగు ఉద్యోగాలు..
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఐలాబాద్‌కు చెందిన పురంశెట్టి వెంకటేశ్ పటేల్ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. గ్రూప్-4 ఫలితాల్లో సత్తాచాటడంతో పాటు గతంలో ఏఈఈ గెజిటెడ్ ఆఫీసర్, ఏఈ మున్సిపల్, ఎస్సెస్సీలో జూనియర్ ఇంజినీర్‌లో ఉద్యోగం సాధించాడు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేస్తున్న వివిధ పోటీపరీక్షల ఫలితాల్లో ఎందరో మట్టిలోని మణిక్యాలు వెలుగులోకి వస్తున్నారు.
Tags
- tspsc group 4 rankers real life stories in telugu
- tspsc group 4 rankers
- TSPSC Group 4 Jobs
- tspsc group 4 jobs 2024 updates
- tspsc group 4 jobs 2024
- tspsc group 4 jobs 2023 cutoff marks details
- tspsc group 4 jobs selection list 2024
- tspsc group 4 jobs candidates
- Competitive Exams Success Stories
- Success Stroy
- success story in telugu
- inspirational success story in telugu
- government employee inspirational success story
- Inspirational Success Story
- inspirational success story of tspsc group 4 rankers
- sakshieducationsuccess stories