Skip to main content

Naresh: గెజిటెడ్‌ హోదా కొలువు సాధించిన జీపీ కార్మికుడి కూమారుడు

కుల్కచర్ల: విజ్ఞానానికి పేదరికం అడ్డుకాదని నిరూపిస్తూ.. ఆత్మవిశ్వాంతో అత్యున్నతమైన కొలువు సాధించాడు పంచాయతీ కార్మికుడి కుమారుడు.
Son of a GP laborer who attained gazetted status scale

కుల్కచర్ల మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన దేవమ్మ వెంకటయ్య దంపతులకు ముగ్గురు సంతానం. అందులో చిన్నవాడు నరేష్‌. కటిక పేదరికాన్ని అనుభవిస్తూ చదువులో మేటిగా నిలిచాడు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఇరిగేషన్‌శాఖ రిక్రూట్‌మెంట్‌లో నరేష్‌ పరీక్ష రాశాడు.

చదవండి: Nikita Ketawat: హెడ్‌కానిస్టేబుల్‌ కుమార్తెకు ఆరు ఉద్యోగాలు

అనంతరం శుక్రవారం విడుదలైన ఫలితాల్లో నరేష్‌ ఏఈఈ(అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌)గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా యువకుడు మాట్లాడుతూ.. కష్టపడి చదివితే లక్ష్యం ఎంత పెద్దదైనా మనసొంతం అవుతుందనిసూచించాడు. తనకోసం కుటుంబ సభ్యులు ఎంతగానో శ్రమించారని, వారి ప్రేమానురాగాలతోనే ఈ ఉద్యోగం సాధించాను అని చెప్పారు.

Published date : 06 Aug 2024 03:47PM

Photo Stories