Skip to main content

TGPSC Hostel Welfare Officer Exams Results : హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫలితాలు విడుద‌ల‌... ఎంత మంది సెల‌క్ట్ అయ్యారంటే ...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ప‌రీక్ష ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు.
TSPSC Hostel Welfare Officer Exams Results Released

తెలంగాణ‌ సంక్షేమ వసతిగృహాల్లో.. 581 పోస్టులకు పరీక్షలు నిర్వహించగా 574 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ పోస్టులకు గతేడాది జూన్ 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. ఈ పరీక్షలకు మొత్తం 82,873 మంది హాజరయ్యారు. 

TGPSC Hostel Welfare Officer Exams Results కోసం క్లిక్ చేయండి

టీజీపీఎస్సీ 581 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విష‌యం తెల్సిందే. ఇప్పటికే జీఆర్‌ఎల్‌ విడుదల చేసి నాలుగు విడుతల్లో సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ పూర్తిచేసింది. ఇవాళ విడుదల చేసిన ఫలితాల్లో ఉద్యోగాలు పొందినవారికి శాఖల వారీగా కౌన్సెలింగ్‌ నిర్వహించి పోస్టింగ్‌లు ఇస్తారు.

Published date : 17 Mar 2025 05:04PM

Photo Stories