Skip to main content

TSPSC Group-1 Mains 2024 Selection Ratio : 1:50 నిష్పత్తిలోనే గ్రూప్-1 మెయిన్స్‌కి ఎంపిక‌.. ఫ‌లితాలు విడుద‌ల ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TGPSC) ఎట్ట‌కేల‌కు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
TSPSC Officials Preparing for Group-1 Results  TSPSC Group-1 Mains Exam Selection Ratio  TSPSC Group 1 Mains 2024  Selection  Ratio 1: 50  TSPSC Group-1 Mains Exam Announcement

గ్రూప్‌-1 మెయిన్స్‌కి  1:100 నిష్పత్తి ఎట్టిప‌రిస్థితిలో సాధ్యం కాదని తేల్చి చెప్పింది.

ఈ నిబంధనల ప్రకారం..
1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించిన విష‌యం తెల్సిందే. ఆ అభ్యర్థనలను పరిశీలించాలని టీఎస్‌పీఎస్సీకి కోర్టు సూచించింది. సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన GO.55లోని నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

చదవండి: టీఎస్‌పీఎస్సీ Group-1&2 - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఫ‌లితాల‌ విడుద‌ల ఎప్పుడంటే..?
టీఎస్‌పీఎస్సీ 563 గ్రూప్‌-1 పోస్టులకు జూన్ 9వ తేదీ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే. ఈ ఫ‌లితాలతో పాటు.. తుది 'కీ' కూడా విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. అలాగే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసిన విష‌యం తెల్సిందే. ఈ నేప‌థ్యంలో గ్రూప్‌-1 ఫ‌లితాలు కూడా ఈ వారంలో ఏక్ష‌ణంలోనైన విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

➤ Two Lac Government Jobs 2024 Details in TS : 2 లక్షల ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాల్సిందే.. గ్రూప్‌-1లో 1,600, గ్రూప్‌-2లో 2,200, గ్రూప్‌-3లో 3000 పోస్టుల‌ను..

గ్రూప్‌-1 మెయిన్స్‌-2024 ప‌రీక్ష తేదీలు ఇవే..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌-2024 ప‌రీక్ష‌లు అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నిర్వ‌హించ‌నున్నారు. ఈసారి గ్రూప్‌-1 పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 3.02 లక్షల మంది (74%) ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారు.

☛ Telangana 2 Lakh Government Jobs 2024 : ఈ ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామిలా..

Published date : 04 Jul 2024 02:37PM

Photo Stories