Skip to main content

Two Lac Government Jobs 2024 Details in TS : 2 లక్షల ఉద్యోగాలను వెంట‌నే భర్తీ చేయాల్సిందే.. గ్రూప్‌-1లో 1,600, గ్రూప్‌-2లో 2,200, గ్రూప్‌-3లో 3000 పోస్టుల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన ఏడాదే.. 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని మేనిఫెస్టోలో తెలిపిన విష‌యం తెల్సిందే.
Telangana Congress manifesto promise of 2 lakh government jobs  TS Jobs Notification 2024  R. Krishnaiah, President of National BC Welfare Association

అయితే గ‌త ప్ర‌భుత్వ ఇచ్చిన పెండింగ్‌లో ఉన్న పోస్టుల ఫ‌లితాల మాత్ర‌మే విడుద‌ల చేసింది కానీ.. కొత్త‌గా ఇంత వ‌ర‌కు ఏ నోటిఫిష‌న్ ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. 

☛ TSPSC Group 2 & 3 Posts 2024 Increase : గ్రూప్–2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య భారీగా పెంపు..? ఇంకా గ్రూప్‌-1కు 1:100 నిష్ప‌త్తిలో..

అలాగే గ్రూప్‌-1 పోస్టులు 1,600 ఉంటే 503 ప్రకటించారని, గ్రూప్‌-2 సర్వీస్‌ కింద 2,200ల పోస్టులకు 783, గ్రూప్‌-3లో 3వేలకు పైగా ఉంటే 1,383, గ్రూప్‌-4లో 25 వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటే 8,500 మాత్రమే ప్రకటించారని ఆరోపించారు.

r krishaniah

నిరుద్యోగ ఐకాస ఛైర్మన్‌ నీల వెంకటేశ్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద గ్రూప్‌ 1, 2, 3, 4 పోస్టులను పెంచాలని ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.  పీఆర్‌సీ నివేదిక ప్రకారం 25 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు కూడా ఖాళీగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ మండలాలు, రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, పోలీస్‌ కమిషనరేట్లు, గ్రామపంచాయతీల్లో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

☛ Telangana 2 Lakh Government Jobs 2024 : ఈ ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలను భ‌ర్తీ చేస్తామిలా..

Published date : 22 Jun 2024 03:55PM

Photo Stories