Delhi Elections: ఢిల్లీ ఎన్నికలు.. రెండో మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ

ఇందులో ప్రధానంగా విద్య, ఉపాధి, సంక్షేమ సేవలపై దృష్టి పెట్టారు.
బీజేపీ ప్రకటించిన ముఖ్యమైన హామీలు ఇవే..
ఉచిత విద్య: నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉచిత విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.
పోటీ పరీక్షల కోసం ఆర్థిక సహాయం: యుపీఎస్‌సీ(UPSC) సివిల్ సర్వీసెస్, రాష్ట్ర పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు రూపాయలు 15,000 ఆర్థిక సహాయం రెండో ప్రయత్నం వరకు అందించబడుతుంది.
అంబేడ్కర్ స్టైఫండ్ పథకం: ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రతి నెలా 1,000 రూపాయలు చెల్లించబడుతుంది.
ఆటో-ట్యాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు: డ్రైవర్లకు 10 లక్షల రూపాయల జీవిత బీమా, 5 లక్షల రూపాయల ప్రమాద బీమా. ఆటో, ట్యాక్సీ రాయితీ వాహనాల బీమా. ఆటో డ్రైవర్ల పిల్లల ఉన్నత చదువుల కోసం ఉపకార వేతనాలు.
సిట్ ఏర్పాటు: ఆప్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు, మోసాలపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయడం.
అదే విధంగా.. మహిళలకు 6 నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు. పీఎం స్వానిధి యోజన లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు. గృహ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసే ప్రణాళిక.
S-VYASA University: ఎస్-వ్యాస కొత్త క్యాంపస్ ప్రారంభం.. ఎక్కడంటే..
Tags
- Aam Aadmi Party
- AAP Manifesto
- Delhi Elections
- Delhi Assembly elections
- Delhi Polls
- Income Tax Relief
- free education
- UPSC
- Ambedkar Stipend Scheme
- Auto-Taxi Driver Welfare Board
- Delhi Assembly Elections 2025
- Sakshi Education News
- BJP second manifesto
- education reforms in Delhi
- employment opportunities BJP Delhi
- Delhi BJP education policies
- BJP electoral agenda
- SakshiEducationUpdates