Cutting Trees: ఒక్క చెట్టు నరికితే రూ.లక్ష జరిమానా..!

ఒక చెట్టును నరికిన వ్యక్తికి లక్ష రూపాయలు జరిమానా విధించాలని ఆదేశించింది. పెద్ద సంఖ్యలో చెట్లను నరికివేయడం మనుషులను చంపడం కంటే దారుణమైనదని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణం విషయంలో కనికరం చూపొద్దని ప్రభుత్వాలను హెచ్చరించింది.
మధుర-బృందావన్‌ని దాల్మియా ఫామ్స్‌లో ప్రైవేట్ భూమిలో శివశంకర్ అగర్వాల్ 454 చెట్లను చట్టవిరుద్ధంగా నరికివేశారు. వాటిలో 32 చెట్లు రక్షిత అటవీ భూమిలోని రోడ్డు పక్కన ఉన్నవి. దీనిపై ప్రభుత్వం కోర్టును ఆశ్రయించింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ (సీఈసీ) కొన్ని సిఫార్సులు చేసింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. చెట్టుకు లక్ష రూపాయల చొప్పున రూ.4.54 కోట్ల జరిమానా విధించింది. 454 చెట్లు కూల్చేయడం వల్ల కోల్పోయిన పచ్చదనాన్ని తిరిగి తీసుకురావడానికి, అంత వృక్షజాలాన్ని పెంపొందించడానికి కనీసం వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించింది.
MPs Salary Hike: ఎంపీలకు జీతం, పెన్షన్‌ను పెంచిన ప్రభుత్వం.. ఎంతంటే..
అయితే.. తప్పు చేశానని అగర్వాల్ అంగీకరించారని, జరిమానాను తగ్గించాలని ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అంతేకాదు.. వ్యక్తిగత, అటవీయేతర భూముల్లో చెట్ల నరికివేతకు అను మతిని ప్రస్తావించింది. జరిమానాను తగ్గించడానికి ధర్మాససనం నిరాకరించింది.
అగర్వాల్‌ను సమీపంలోని స్థలంలో తోటలు వేసేందుకు అనుమతించాలని, ఆ తరువాతే అతనిపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిశీలిస్తామని తెలిపింది. అంతేకాదు.. తాజ్ ట్రాపెజియం జోన్‌లో అటవీయేతర, ప్రైవేటు భూముల్లో చెట్లను నరికివేయడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్న నిబంధనను తొలగిస్తూ 2019లో ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
Supreme Court Judge : సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు.. అందరినీ సమానంగా చూడాలి..