Skip to main content

TSPSC Group 2 & 3 Posts 2024 Increase : గ్రూప్–2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య భారీగా పెంపు..? ఇంకా గ్రూప్‌-1కు 1:100 నిష్ప‌త్తిలో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్–2, గ్రూప్-3 పోస్టుల సంఖ్య పెంచాల‌ని అభ్య‌ర్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే TSPSC గ్రూప్-2లో 2000 పోస్టుల వ‌ర‌కు పెంచాలన్న హరీష్ రావు ఇటీవ‌లే డిమాండ్ చేసిన విష‌యం తెల్సిందే.
TSPSC Group 2 and Group 3 Posts 2024 Increase

అలాగే గ్రూప్‌-3లో 1388 పోస్టుల నుంచి 3000 పోస్టుల‌కు పెంచాల‌ని, అలాగే గ్రూప్‌-2 పోస్టులు 783 నుంచి 2000 వ‌ర‌కు పోస్టుల వ‌రకు పెంచాల‌ని అభ్య‌ర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు.

గ్రూప్-2, గ్రూప్‌-3 ప‌రీక్ష‌లను డిసెంబ‌ర్‌కు..
అలాగే గ్రూప్-2, గ్రూప్‌-3 ప‌రీక్ష‌ల‌ను 2024 డిసెంబ‌ర్ వ‌ర‌కు వాయిదా వేయాల‌ని.. జీవో నెం 46ను ర‌ద్దు చేయాల‌ని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు మెగా డీఎస్సీ విడుద‌ల చేయాల‌ని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. అలాగే గ్రూప్‌-1 మెయిన్స్‌కు 1:100 నిష్ప‌త్తిలో ఎంపిక చేయాలిని ఇందిరాపార్క్ వ‌ద్ద వేల సంఖ్య‌లో నిరుద్యోగులు మ‌హాధ‌ర్నాకు దిగారు. ఇప్ప‌టికే చాలా మంది ఉద్యోగ సంఘం నాయ‌కులు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి TSPSC గ్రూప్-2, గ్రూప్‌-3 ఉద్యోగాల‌ను పెంచాలంటూ.. విన‌తి ప‌త్రం కూడా ఇచ్చారు.

TSPSC Group 2 & 3 Posts 2024 పోస్టుల పెంపుపై త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఒక స్ప‌ష్ట‌మైన‌ నిర్ణయం తీసుకోనే అవ‌కాశం ఉంది. దాదాపు గ్రూప్ 2,గ్రూప్–3 పోస్టుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

గ్రూప్‌-2, 3 ప‌రీక్ష తేదీలు ఇవే..?
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వ‌హింస్తామ‌ని తెలిపింది. గ్రూప్‌-3 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపిన విష‌యం తెల్సిందే.
 

Published date : 20 Jun 2024 06:35PM

Photo Stories