Skip to main content

TSPSC Group 2 & 3 Posts Increasing 2024 : కేబినెట్ కీల‌క‌ నిర్ణయం.. గ్రూప్–2, గ్రూప్- 3 పోస్టుల సంఖ్య భారీగా పెంపు ఇలా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లోని గ్రూప్ 2 & 3 అభ్య‌ర్థుల‌కు ప్రభుత్వం రేపు గుడ్‌న్యూస్ చెప్పే అవ‌కాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఇప్పటికే గ్రూప్‌-2, 3 ప‌రీక్ష తేదీల‌ను వెల్ల‌డించిన విష‌యం తెల్సిందే.
TSPSC Notification Update   Increased posts in Group 2 and 3 notifications  telangana cm revanth reddy   Government Announcement Tomorrow  Group 2 and 3 Examination Announcement

అయితే ప్ర‌భుత్వం గ్రూప్-2, గ్రూప్–3 నోటిఫికేష‌న్‌ల్లోని పోస్టుల సంఖ్యను పెంచే ప్రతిపాదనపై.. మార్చి 12వ తేదీన జరిగే తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

☛ TSPSC Group 1 Guidance: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–1 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ విశ్లేషణ, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

ఇప్ప‌టికే ఆర్థిక శాఖ..
తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ గ్రూపు–2, గ్రూప్–3 ఖాళీ పోస్టుల వివరాలను అందించాలని వివిధ శాఖల వారీగా ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సమాచారాన్ని అన్ని శాఖలు ఆర్థిక శాఖకు అందించాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ 2,గ్రూప్–3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం.

☛ TSPSC Group 2 and group 3 exam dates, syllabus, exam type 2024 

గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టుల పెంపు ఇలా..?
ఇప్పటికే గ్రూప్–1, టీచర్ పోస్టులను పెంచి నూతన నోటిఫికేషన్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే గ్రూప్–2, గ్రూప్–3 నోటిఫికేషన్‌ల‌లో అనుబంధ నోటిఫికేషన్లు జారీ చేసి పోస్టుల సంఖ్య పెంచే అవకాశం ఉంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2లో దాదాపు 783 పోస్టుల‌ నుంచి 800 పోస్టుల వ‌ర‌కు, గ్రూప్‌-3లో 1388 పోస్టుల నుంచి దాదాపు 1500 పోస్టుల‌కు పెరిగే అవ‌కాశం ఉంది. ఇటీవ‌లే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను ఆగ‌స్టు 7, 8 తేదీల్లో నిర్వ‌హింస్తామ‌ని తెలిపింది. అలాగే గ్రూప్‌-3 ఉద్యోగాల‌కు రాత‌ప‌రీక్ష‌ను న‌వంబ‌ర్ 17, 18 తేదీల్లో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తామ‌ని టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

☛ TSPSC Group-2 Exams Dates 2024 : 783 పైగా గ్రూప్‌-2 ఉద్యోగాలు.. ప‌క్కాగా జాబ్ కొట్టాలంటే.. ప్రిప‌రేష‌న్ వ్యూహాం ఇలా..!

☛ TSPSC Group-3 Exam Pattern and Syllabus 2024 : 1388 పైగా గ్రూప్‌-3 ఉద్యోగాలు.. సిల‌బ‌స్ & ప‌రీక్షావిధానం ఇలా..

Published date : 11 Mar 2024 04:46PM

Photo Stories