TSPSC Group-1,2, 3 Exams Dates 2024 : TSPSC Group-1,2, 3 పరీక్షల షెడ్యూల్ ఇదే.. ఈ సారి ఈ పరీక్షలను..
TSPSC గ్రూప్–1, 2, 3 పరీక్షల షెడ్యూల్ ఇదే..
TSPSC గ్రూప్–1 ప్రిలిమ్స్ : జూన్ 09, 2024
TSPSC గ్రూప్–1 మెయిన్స్ : అక్టోబర్ 21 నుంచి..
TSPSC గ్రూప్–2 పరీక్షలను ఆగస్టు 7, 8 తేదీలలో నిర్వహించనున్నారు.
TSPSC గ్రూప్–3 పరీక్ష : నవంబర్ 17, 18 తేదీలలో నిర్వహించనున్నారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 సమాచారం :
మొత్తం గ్రూప్-1 పోస్టులు : 563
గ్రూప్-1 ఎంపిక విధానం :
గ్రూప్-1 ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల ద్వారా ఎంపిక ప్రక్రియ చేపడతారు. ప్రాథమిక (ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. ఇందులో అర్హత పొందిన వారికి మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు.
Group 1 & 2 : సిలబస్ దాదాపు ఒక్కటే.. ఈ చిన్న మార్పులను గమనిస్తే..: కె.సురేశ్ కుమార్ గ్రూప్–1 విజేత
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష:
ఈ పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. జనరల్ ఇంగ్లిష్ 150 మార్కులు, పేపర్–1 సమకాలీన అంశాలపై సాధారణ వ్యాసం (జనరల్ ఎస్సే)–150 మార్కులు, పేపర్–2 చరిత్ర, సంస్కృతి, భౌగోళిక శాస్త్రం–150 మార్కులు, పేపర్–3 భారతీయ సమాజం, రాజ్యాంగం, పాలన–150, పేపర్–4 ఆర్థిక శాస్త్రం, అభివృద్ధి–150 మార్కులు, పేపర్–5 సైన్స్, టెక్నాలజీ అండ్ డెటా ఇంటర్‌ప్రిటేషన్–150, పేపర్–6 తెలంగాణ ఆలోచన(1948–70), సమీకరణ దశ(1971–90), తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వైపు(1991–2014)–150 మార్కులు.
గ్రూప్-1 ముఖ్య సమాచారం :
దరఖాస్తులకు చివరితేది: 14.03.2024.
దరఖాస్తుల్లో సవరణలకు అవకాశం: 23.03.2024 ఉదయం 10 గంటల నుంచి 27.03.2024 సాయంత్రం 5 గంటల వరకు;
ప్రాథమిక పరీక్ష: 2024, జూన్ 9
మెయిన్స్: అక్టోబర్ 21 నుంచి..
గ్రూప్-1 స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ 2024 :
మొత్తం మార్కులు: 900
సబ్జెక్ట్ | సమయం (గంటలు) | గరిష్ట మార్కులు |
ప్రిలిమినరీ టెస్ట్ (జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ) | 2 1/2 | 150 |
రాత పరీక్ష (మెయిన్ ) (జనరల్ ఇంగ్లిష్)(అర్హత పరీక్ష) | 3 | 150 |
మెయిన్ పేపర్–1 జనరల్ ఎస్సే
|
3 | 150 |
పేపర్–2 హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ
|
3 | 150 |
పేపర్–3 ఇండియన్ సొసైటీ, కానిస్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్
|
3 | 150 |
పేపర్–4 ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
3 | 150 |
పేపర్–5 సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్
|
3 | 150 |
పేపర్–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం
|
3 | 150 |
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 ముఖ్యమైన సమాచారం ఇదే.. :
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 మొత్తం పోస్టులు : 783
గ్రూప్–2 పరీక్ష ఇలా..
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | మార్కులు |
1 | జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 |
2 |
హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ 1) సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా, తెలంగాణ |
150 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ 1) ఇండియన్ ఎకానమీ: సమస్యలు, సవాళ్లు 2) ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ తెలంగాణ 3) అభివృద్ధి సమస్యలు, మార్పు |
150 | 150 |
4 | తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 1) ఐడియా ఆఫ్ తెలంగాణ(1948–1970) 2) మొబిలైజేషన్ దశ (1971–1990) 3) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991–2004) |
150 | 150 |
మొత్తం | 600 | 600 |
గ్రూప్-2 సొంత నోట్స్..
గ్రూప్-2 అభ్యర్థులు ప్రిపరేషన్ ప్రారంభం నుంచే ఆయా సబ్జెక్ట్‌లలోని ముఖ్యమైన అంశాలతో సొంత నోట్స్ రాసుకుంటారు. ప్రస్తుత సమయంలో దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆయా విభాగాలకు సంబంధించి ముఖ్యమైన పాయింట్లతో రాసుకున్న నోట్స్‌ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ అధ్యయనం చేయాలి.
ఉమ్మడి టాపిక్స్‌కు..
ప్రస్తుత సమయంలో..ఆయా పేపర్లలో ఉన్న కామన్ టాపిక్స్‌ను ఏకకాలంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. ఫలితంగా ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది. జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ప్రతి రోజు సగటున కనీసం 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
కష్టమైన వాటి కోసం..
ప్రిపరేషన్ సమయంలో అభ్యర్థులు కష్టంగా భావించి కొన్ని టాపిక్స్‌ను చదవకుండా పక్కనపెట్టేస్తారు. వాటిలో ముఖ్యమైనవి కూడా ఉండొచ్చు. ఇలాంటి టాపిక్స్ కోసం ఇప్పుడు కొంత సమయం కేటాయించాలి. దీంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, ఇంగ్లిష్,రీజనింగ్‌లకు సంబంధించి ఎక్కవ ప్రాక్టీస్ చేయాలి.
ప్రభుత్వ విధానాలు..
అభ్యర్థులు కేంద్ర, రాష్ట్ర పభుత్వాల తాజా విధానాలు, పథకాలపై దృష్టి పెట్టడం మేలు చేస్తుంది. రాష్ట్ర స్థాయిలో ఆర్థిక, సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు రూపొందించిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఉదాహరణకు మహిళా సాధికారత వంటివి. మైనారిటీలు, వెనుకబడిన తరగతులు, మహిళలు, ఎస్సీలు, గిరిజనులు, వికలాంగుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఎన్నో పథకాలు తెచ్చారు. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి.ముఖ్యంగా తెలంగాణ పాలసీలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా తెలంగాణ ఏర్పాటు, దానికి సంబంధించి ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి.
పేపర్–4 స్కోరింగ్..
గ్రూప్–2 అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పేపర్..పేపర్–4. ఇది గరిష్టంగా స్కోర్ చేసేందుకు అవకాశమున్న పేపర్. ఈ పేపర్‌ను ‘తెలంగాణ ఆలోచన(1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014)) దశగా పేర్కొన్నారు. ముఖ్యంగా 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ.. జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు–వాటి సిఫార్సులు వంటి వాటిపై అవగాహన ఏర్పరచుకోవాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్ వ్యవస్థీకరణ బిల్లులో పొందుపరచిన అంశాలనూ ఒకసారి చూసుకోవడం మేలు.
‘స్పెషల్’ ఫోకస్..
తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు.. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీపై గట్టి పట్టు సాధించాలి. తెలంగాణ చరిత్రకు సంబంధించి ఆయా రాజ వంశాలు,శాసనాలు, గ్రంథాలు, ముఖ్యమైన యుద్ధాలు,కవులు–రచనలు;కళలు;ముఖ్య కట్టడాలపై అవగాహన పెంచుకోవాలి.అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయం లో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనల గురించి తెలుసుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యం ఉన్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం–విస్తీర్ణం, జనాభా వంటి వాటిపైనా అవగాహన అవసరం. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు– ఉత్పత్తిదాయకత, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై పట్టు సాధించాలి. తాజా బడ్జెట్ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులపై అవగాహన ఏర్పరచుకోవాలి.
చదవండి: TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్–2.. సక్సెస్ ప్లాన్
ప్రాక్టీస్ టెస్ట్‌లు..
ప్రస్తుతం సమయంలో గ్రూప్–2 అభ్యర్థులు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం కూడా మేలు చేస్తుంది. దీనివల్ల ఆయా సబ్జెక్ట్‌లలో తమకు ఇప్పటి వరకు లభించిన పరిజ్ఞాన స్థాయిపై అవగాహన లభిస్తుంది. ఇంకా చదవాల్సిన అంశాల విషయంలో స్పష్టత వస్తుంది. అదే విధంగా తాము చేస్తున్న పొరపాట్లను విశ్లేషించుకుని.. వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది.
చదవండి: TSPPC Groups-2 Practice Test
పరీక్షకు ముందు రోజు..
పరీక్షకు ఒకరోజు ముందు అభ్యర్థులు సబ్జెక్ట్ ప్రిపరేషన్ కంటే మరుసటి రోజు ఎగ్జామ్ సెంటర్‌కు వెళ్లేందుకు అవసరమైన వాటిని సిద్ధం చేసుకోవాలి. తీవ్ర పోటీ నేపథ్యంలో చివరి నిమిషం వరకు చదవాలనే తపన ఉండటం సహజం. కాని అతిగా చదవడం వల్ల మానసిక ఒత్తిడి, అలసటకు గురయ్యే ప్రమాదం ఉందని గుర్తించాలి.
ఆరోగ్యం జాగ్రత్తగా..
గ్రూప్ 2కు హాజరయ్యే అభ్యర్థులు.. రేయింబవళ్లు శ్రమిస్తేనే మంచి మార్కులు వస్తాయని భావిస్తుంటారు. దీంతో ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రిపరేషన్ సాగిస్తుంటారు. పరీక్షకు ముందు రోజు కూడా ఇలా అర్థరాత్రి వరకూ చదవుతూ ఉంటారు. ఇది మరుసటి రోజు పరీక్ష హాల్లో ప్రదర్శన తీరుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఎలాంటి ఆందోళన లేకుండా కంటి నిండా నిద్రకు సమయం కేటాయించాలి. ప్రశాంతంగా పరీక్షకు హాజరవడం మేలు.
పరీక్ష రోజు ఇలా..
- ఎంత కష్టపడి చదివినా పరీక్ష రోజున రెండున్నర గంటల వ్యవధిలో చూపే ప్రతిభే విజయాన్ని నిర్దేశిస్తుంది. కాబట్టి పరీక్ష రోజు అప్రమత్తత చాలా అవసరం.
- పరీక్షకు సమాధానాలు గుర్తించేందుకు ఉద్దేశించిన ఓఎంఆర్ షీట్ నింపడంలోనూ అభ్యర్థులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఓఎంఆర్ షీట్‌ను తప్పులు లేకుండా నింపడంతోపాటు సమాధానాలు బబ్లింగ్ చేసే క్రమంలో ప్రశ్న సంఖ్య.. ఆప్షన్‌ను క్షుణ్నంగా గుర్తించాలి.
- ప్రతి ప్రశ్నకు సమాధానం గుర్తించాలనే తపనను వీడి.. ముందుగా ప్రశ్న పత్రాన్ని చదివేందుకు కొంత సమయం కేటాయించాలి. కనీసం పది నిమిషాలపాటు ప్రశ్న పత్రం ఆశాంతం పరిశీలించాలి. ఫలితంగా ప్రశ్న పత్రం క్టిష్లత స్థాయిపై ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత తమకు సులభంగా భావించిన ప్రశ్నలకు ముందుగా సమాధానం ఇవ్వాలి. అనంతరం ఓ మోస్తరు క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం గుర్తించాలి. చివరగా అత్యంత క్లిష్టంగా భావించిన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి.
- ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమ్స్ పరీక్షలో చాలా మంది అభ్యర్థులు చేసే పని.. ఎలిమినేషన్ టెక్నిక్‌ను అనుసరించడం. అంటే.. నాలుగు సమాధానాల్లో ప్రశ్నకు సరితూగని వాటిని ఒక్కొ క్కటిగా తొలగించుకుంటూ.. చివరగా మిగిలిన ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించడం. ఈ టెక్నిక్‌ను కూడా పరీక్ష చివరి దశలోనే అమలు చేయాలి. అప్పటికే తమకు సమాధానాలు తెలిసిన అన్ని ప్రశ్నలను పూర్తి చేసుకున్నామని భావించాకే ఎలిమినేషన్ లేదా గెస్సింగ్‌పై దృష్టి పెట్టాలి.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 ముఖ్యమైన సమాచారం ఇదే.. :
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 మొత్తం పోస్టులు : 1388
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 పరీక్షావిధానం ఇదే..
మొత్తం మార్కులు: 450
గ్రూప్-3 మొత్తం 3 పేపర్లు ఉండగా పేపర్-1 లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, పేపర్-2 లో హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ, పేపర్-3లో ఎకానమీ అండ్ డెవలప్ మెంట్ ఉన్నాయి. ఈ మూడు పేపర్లకు 450 మార్కులు ఉండనున్నాయి. ఆబ్జెక్టివ్ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్‌లైన్‌లోనా అనేది అధికారులు స్పష్టం చేయలేదు.
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 |
150
|
పేపర్-1 (మార్కులు 150) :
జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్ :
➤ ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన అంశాలు
➤ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
➤ జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశ విజయాలు
➤ పర్యావర ణ సమస్యలు, విపత్తు నిర్వహణ - నివారణ, తీవత్రను తగ్గించే వ్యూహాలు
➤ ప్రపంచ భూగోళశాస్త్రం, భారతదేశ భూగోళశాస్త్రం, తెలంగాణ భూగోళ శాస్త్రం
➤ భారతదేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం
➤ తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
➤ తెలంగాణ రాష్ట్ర విధానాలు
➤ సామాజిక వెనుకబాటు, హక్కులకు సంబంధించిన అంశాలు, సమీకృత విధానాలు
➤ లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్
➤ బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయి)
పేపర్-2 (మార్కులు 150) :
చరిత్ర, పాలిటీ, సమాజం :
☛ తెలంగాణ సాంస్కృతిక చరిత్ర, రాష్ట్ర ఏర్పాటు
☛ శాతవాహనులు; ఇక్ష్వాకులు; విష్ణుకుండినులు; ముదిగొండ, వేములవాడ చాళుక్యులు, వారి సాంస్కృతిక సేవ; సాంఘిక వ్యవస్థ; మత పరిస్థితులు; పురాతన తెలంగాణలో బుద్ధిజం, జైనిజం; భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం,కాకతీయ రాజ్య స్థాపన, సామాజిక, సాంస్కృతిక అభివృద్ధికి వారి సేవ; కాకతీయుల పాలనా కాలంలో తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కళలు, వాస్తు విజ్ఞానం, సృజనాత్మక కళలు; రాచకొండ, దేవరకొండ వెలమలు - సాంఘిక, మత పరిస్థితులు; తెలుగు భాషా, సాహిత్యాభివృద్ధి, కాకతీయులకు వ్యతిరేకంగా నిరసనోద్యమాలు: సమ్మక్క-సారక్క నిరసన; కుతుబ్‌షాహీల సామాజిక, సాంస్కృతిక సేవ, భాష, సాహిత్యం, వాస్తుశాస్త్రం, పండగలు, నాట్యం, సంగీతం, కళల అభివృద్ధి; మిశ్రమ సంస్కృతి ఆవిర్భావం.
☛ అసఫ్‌జాహీ రాజవంశం; నిజాం-బ్రిటిష్ సంబంధాలు: సాలార్‌జంగ్ సంస్కరణలు, వాటి ప్రభావం; నిజాంల పాలనాకాలంలో సాంఘిక, సాంస్కృతిక, మత పరిస్థితులు: విద్యా సంస్కరణలు, ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన, ఉన్నత విద్య; ఉపాధి వృద్ధి, మధ్య తరగతి వృద్ధి.
☛ తెలంగాణ - సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ పునర్జీవనం; ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభల పాత్ర; ఆంధ్రసారస్వత పరిషత్, అక్షరాస్యత, గ్రంథాలయ ఉద్యమాలు, ఆది-హిందూ ఉద్యమం, ఆంధ్ర మహిళా సభ, మహిళా ఉద్యమ ప్రగతి; గిరిజనోద్యమాలు, రామ్‌జీ గోండ్, కొమురం భీమ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం; కారణాలు, పరిణామాలు.
☛ ఇండియన్ యూనియన్‌లో హైదరాబాద్ విలీనం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందం; ముల్కీ ఉద్యమం (1952 -56); ప్రత్యేక రక్షణల ఉల్లంఘన, ప్రాంతీయ అసమానత, తెలంగాణ ఉనికి ప్రకటన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళన (1969-70)-వివక్షకు వ్యతిరేకంగా బలపడిన నిరసన, తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ఉద్యమాలు (1971- 2014).
భారత రాజ్యాంగం, రాజకీయాలు - పరిశీలన :
✦ భారత రాజ్యాంగం - పరిణామ క్రమం, స్వభావం, ఉన్నత లక్షణాలు, ప్రవేశిక
✦ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు
భారత సమాఖ్య వ్యవస్థ ప్రధాన లక్షణాలు, కేంద్రం, రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలనాపరమైన అధికారాల విభజన.
✦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు - రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి - అధికారాలు, విధులు.
✦ 73వ, 74వ రాజ్యాంగ సవరణలు - గ్రామీణ, పట్టణ పరిపాలన
✦ ఎన్నికల విధానం: స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికలు, అక్రమాలు, ఎన్నికల సంఘం, ఎన్నికల సంస్కరణలు, రాజకీయ పార్టీలు.
✦ భారత దేశంలో న్యాయ వ్యవస్థ - న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
✦ ఎ) షెడ్యూల్డ్ కులాలు, తరగతులు, వెనుకబడిన వర్గాలు, మహిళలు, మైనారిటీలకు ప్రత్యేక రక్షణలు
బి) సంక్షేమం అమలు విధానం - షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్, ✦షెడ్యూల్డ్ తరగతుల జాతీయ కమిషన్, వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్.
భారత రాజ్యాంగం: నూతన సవాళ్లు :
➤ సామాజిక నిర్మాణం, సమస్యలు, ప్రభుత్వ విధానాలు
భారత దేశ సామాజిక నిర్మాణం: భారతీయ సమాజం ప్రధాన లక్షణాలు: కులం, కుటుంబం, పెళ్లి, బంధుత్వం, మతం, తెగ, మహిళ, మధ్య తరగతి; తెలంగాణ సమాజం సామాజిక, సాంస్కృతిక లక్షణాలు.
➤ సామాజిక సమస్యలు: అసమానత్వం, బహిష్కరణ: కులతత్వం, కమ్యూనలిజం, ప్రాంతీయతత్వం, మహిళలపై హింసాత్మకత, బాలకార్మిక వ్యవస్థ, మనుషుల అక్రమ రవాణా, వైకల్యం, వృద్ధాప్యం.
➤ సామాజిక ఉద్యమాలు: రైతు ఉద్యమం, గిరిజన ఉద్యమాలు, వెనుకబడిన తరగతుల ఉద్యమాలు, దళితుల ఉద్యమాలు, పర్యావరణ ఉద్యమాలు, మహిళా ఉద్యమాలు, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి ఉద్యమాలు, మానవ హక్కుల ఉద్యమాలు.
➤ తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక సమస్యలు: వెట్టి, జోగినీ, దేవదాసి వ్యవస్థలు, బాలకార్మిక వ్యవస్థ, బాలికా సమస్యలు (గర్ల్ చైల్డ్), ఫ్లోరోసిస్, వలసలు, రైతులు, నేత కార్మికుల బాధలు.
➤ సామాజిక విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు: ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, మైనారిటీలు, కార్మికులు, వికలాంగులు, పిల్లలకు సంబంధించి ప్రత్యేక విధానాలు; సంక్షేమ కార్యక్రమాలు: ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు; గ్రామీణ, పట్టణ, మహిళా, పిల్లల సంక్షేమం, గిరిజన సంక్షేమం.
పేపర్-3 (మార్కులు 150) :
ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :
భారత ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్లు :
▶ ప్రగతి, అభివృద్ధి: భావనలు, పరస్పర సంబంధం.
▶ ఆర్థికాభివృద్ధి గణన: జాతీయాదాయం, నిర్వచనం, జాతీయాదాయ గణనకు సంబంధించిన భావనలు, పద్ధతులు, నామమాత్ర, వాస్తవ ఆదాయం.
▶ పేదరికం, నిరుద్యోగం: పేదరికం భావనలు - ఆదాయ ఆధారిత పేదరికం, ఆదాయ రహిత పేదరికం, పేదరికాన్ని గణించే విధానం, నిరుద్యోగం- నిర్వచనం, నిరుద్యోగం రకాలు.
▶ భారత ఆర్థిక ప్రణాళిక: పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్యాలు, వ్యూహాలు, విజయాలు, 12వ పంచవర్ష ప్రణాళిక; సమ్మిళిత వృద్ధి, నీతి ఆయోగ్.
తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1954-2014)లో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, దుర్వినియోగం ▶ నీళ్లు (బచావత్ కమిటీ), నిధులు (లలిత్, భార్గవ, వాంచూ కమిటీలు), ఉపాధి కల్పన (జై భారత్ కమిటీ, గిర్‌గ్లాన్ కమిటీ).
▶ తెలంగాణలో భూ సంస్కరణలు: మధ్యవర్తిత్వ విధానాల నిర్మూలన - జమీందారీ, జాగిర్దారీ, ఇనాందారీ, టెనాన్సీ విధానాలు, భూ పరిమితి, షెడ్యూల్డ్ ఏరియాల్లో ల్యాండ్ ఎలియేషన్.
▶ వ్యవసాయం, సంబంధిత రంగాలు: జీఎస్‌డీపీలో వ్యవసాయం, సంబంధిత రంగాల పాత్ర, భూ పంపిణీ, వ్యవసాయంపై ఆధారం, నీటి పారుదల, జల వనరులు, మెట్ట భూముల్లో సాగు ఇబ్బందులు.
▶ పారిశ్రామిక, సేవా రంగాలు: పారిశ్రామిక అభివృద్ధి; పారిశ్రామిక ప్రగతి, నిర్మాణం - చిన్న, సూక్ష్మ తరహా, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ); పారిశ్రామిక అవస్థాపనా సౌకర్యాలు; తెలంగాణ పారిశ్రామిక విధానం, సేవా రంగం నిర్మాణం, ప్రగతి.
అభివృద్ధికి సంబంధించిన సవాళ్లు, పరిణామాలు :
☛ అభివృద్ధిలో గతిశీలత: భారతదేశంలో ప్రాంతీయ అసమానతలు, సాంఘిక అసమానతలు - కులం, తెగ, లింగ, మత ప్రాతిపదిక అసమానతలు; వలసలు, పట్టణీకరణ.
☛ అభివృద్ధి, స్థానచలనం: భూసేకరణ విధానం; పునరుద్ధరణ, పునరావాసం
☛ ఆర్థిక సంస్కరణలు: ప్రగతి, పేదరికం, అసమానతలు-సాంఘిక అభివృద్ధి (విద్య, ఆరోగ్యం), సామాజిక రూపాంతరత, సాంఘిక భద్రత.
☛ సుస్థిర అభివృద్ధి: భావనలు, గణన, లక్ష్యాలు.
TSPSC Group-1,2, 3 పరీక్షల షెడ్యూల్ ఇదే..
Tags
- TSPSC Group 1 Prelims Exam Date 2024
- tspsc group 1 mains exam date 2024
- tspsc group 2 prelims exam date 2024
- tspsc group 2 mains exam date 2024
- tspsc group 3 exam date 2024
- tspsc group 1 exam schedule 2024
- tspsc group 2 exam schedule 2024
- tspsc group 3 exam schedule 2024
- tspsc group 1 exam pattern 2024
- tspsc group 2 exam pattern 2024
- tspsc group 3 exam pattern 2024
- tspsc group 1 syllabus 2024 in telugu
- tspsc group 2 syllabus 2024 in telugu
- tspsc group 3 syllabus 2024 in telugu
- tspsc group 1 vacancies 2024 news telugu
- tspsc group 2 vacancies 2024 news telugu
- tspsc group 3 vacancies 2024 news telugu
- tspsc group 1 and 2 and 3 exam schedule 2024 released