Skip to main content

TGPSC Group 1 Mains Exam Dates: టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో గ్రూప్‌–1 మెయిన్స్‌ హాల్‌టికెట్లు.. పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు అక్టోబర్ 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయ ని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ తెలిపింది. పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్‌ అక్టోబర్ 9న ఓ ప్రకటన విడుదల చేసింది.
Group 1 Mains Hall Tickets on TGPSC website  Telangana Public Service Commission announcement about Group-1 Mains exam hall tickets  Hall tickets for selected candidates available on TGPSC website from October 14  TGPSC notification on October 9 regarding hall ticket availability for Group-1 Mains exams   Group-1 Mains examination hall ticket release date announcement

ఈ హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని కమిషన్‌ సూచించింది. మెయిన్స్‌ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరని కమిషన్‌ స్పష్టం చేసింది. 

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

అభ్యర్థి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలని డూప్లికేట్‌ హాల్‌టికెట్‌ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంది. సమయం తెలుసుకు నేందుకు వీలుగా పరీక్ష హాల్‌లో గడియారాలను ఏర్పాటు చేస్తామని కమిషన్‌ వివరించింది. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సమస్యలుంటే కమిషన్‌ కార్యాలయం పనిదినాల్లో 040– 23542185 లేదా 040–23542187 ఫోన్‌ నంబర్ల లో, లేదా హెల్ప్‌డెస్క్‌కు ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌ తెలిపారు. 

Published date : 10 Oct 2024 12:01PM

Photo Stories