TGPSC Group-1 ఫలితాల్లో 482.5 మార్కులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచారు వినయ్. ఓవైపు ఫ్యాకల్టీగా విద్యార్థులను గైడ్ చేస్తూనే ఆయన సొంతంగా గ్రూప్స్‌కి సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో పరీక్షలకు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఆయన సక్సెస్ ఫార్ములా ఏంటి? వంటి మొదలైన అంశాలపై వినయ్ గారితో సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేక ఇంటర్వ్యూ..
TGPSC Group 1 Topper Vinay Interview in Telugu
🔹ముందుగా రిజల్ట్స్ తెలియగానే ఎలా ఫీలయ్యారు? వినయ్: నాకు 482.5 మార్కులు వచ్చాయి. ఇది మంచి స్కోర్ అయినా, ఇంకా బెటర్ స్కోర్ రావాల్సింది. నేను గైడ్ చేసిన చాలా మంది విద్యార్థులు మెరిట్ లిస్ట్‌లో ఉండటం, మంచి మార్కులు సాధించడం నాకు ఆనందంగా ఉంది.
🔹ఓవైపు విద్యార్థులకు గైడ్ చేస్తూ, మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? వి: నేను నేర్చుకుంటూనే, వాళ్లకు నేర్పించగలిగాను. నాతో పాటు ఎంతోమంది విద్యార్థులు మంచి స్కోర్ సాధించడం డబుల్ హ్యాపీనెస్‌ని ఇస్తుంది.
🔹 గ్రూప్స్‌కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మీరిచ్చే సూచనలు ఏంటి? వి: ప్రతిరోజూ స్టడీ ప్లాన్, స్ట్రాటజీతో చదవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా అవసరం. కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం కూడా ముఖ్యమే.