TGPSC Groups 1 Results 2025: బ్రేకింగ్ న్యూస్.. 10 రోజుల్లో గ్రూప్-1 ఫలితాలు
Sakshi Education
తెలంగాణలో గ్రూప్-1 ఫలితాలు మరో 10 రోజుల్లో విడుదల కానున్నాయి. ఇప్పటికే ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ముగిసింది. గ్రూప్ 1 పరీక్షలకు హాజరైన అభ్యర్థులు సాధించిన మార్కులను బట్టి 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా వెల్లడించేందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తుది పరిశీలన చేస్తోంది.వారం, పది రోజుల్లో ఫలితాలు వెల్లడించే అవకాశాలున్నాయి. అనంతరం ఆయా అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఉంటుంది.
TGPSC Groups 1 Results 2025
కాగా రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు 21,093 మంది హాజరైన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు దాదాపు 38 మంది పోటీపడుతున్నారు. ఈ పోస్టుల నియామకాలు పూర్తయ్యాకే గ్రూప్-2,గ్రూప్-3 ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. దీంతో ఆయా పోస్టుల్లో బ్యాక్‌లాగ్‌లు లేకుండా ఉండేందుకు ఇలా చర్యలు తీసుకుంటోంది.