Skip to main content

TSPSC Group 2 Exam Preparation Tips: గ్రూప్‌–2.. సక్సెస్‌ ప్లాన్‌

గ్రూప్‌–2 సర్వీసెస్‌ పరీక్ష..! తహశీల్దార్, ఎక్సైజ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్, ఏసీటీఓ.. వంటి క్రేజీ పోస్ట్‌లు ఉండే సర్వీసు! గెజిటెడ్‌ ర్యాంకుతో కొలువు ఖరారు చేసే పరీక్ష! అన్నింటికీ మించి సర్కారీ కొలువు సొంతం చేసుకునే అవకాశం! అందుకే గ్రూప్‌ 2కు లక్షల మంది పోటీపడుతుంటారు. తెలంగాణలో గ్రూప్‌–2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను మరింత పదును పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. కారణం.. పరీక్ష తేదీలు సమీపిస్తుండడమే! ఆగస్ట్‌ 29, 30 తేదీల్లో గ్రూప్‌–2 పరీక్ష నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ సన్నాహకాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. గ్రూప్‌ 2లో విజయానికి ప్రిపరేషన్‌ ప్లాన్‌..
tspsc group 2 exam success plan in telugu
  • ఆగస్ట్‌ 29, 30 తేదీల్లో గ్రూప్‌–2 పరీక్షలు
  • పోటీలో అయిదున్నర లక్షల మంది అభ్యర్థులు
  • నిర్దిష్ట వ్యూహంతో అడుగులు వేస్తే విజయం

మొత్తం 783 పోస్ట్‌లకు 5,51,943 మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. అంటే.. ఒక్కో పోస్ట్‌కు 705 మంది పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఈ స్థాయి పోటీలో నెగ్గాలంటే.. అభ్యర్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్‌ సాగించాలి.

సిలబస్‌కు సరితూగే

గ్రూప్‌–2 అభ్యర్థులు ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో..ఇప్పటివరకు చదివిన అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇప్పుడు కొత్త పుస్తకాల జోలికి వెళ్లకుండా.. సిలబస్‌కు సరితూగే పరిమిత పుస్తకాలను మాత్రమే చదవాలి. ప్రధానంగా తెలంగాణ ఉద్యమ దశలకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అన్ని ముఖ్యమైన ఘట్టాలున్న ఒకట్రెండు పుస్తకాలను ఎంచుకోవడం మేలు. అదే విధంగా అకాడమీ పుస్తకాలను చదవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.

చ‌ద‌వండి: TSPSC Group 2&3 Preparation Tips: లక్షల సంఖ్యలో దరఖాస్తులు ... రెండు పరీక్షలకు ఉమ్మడి వ్యూహంతోనే సక్సెస్‌

విశ్లేషణాత్మక అధ్యయనం

గ్రూప్‌2లో విజయానికి విశ్లేషణాత్మక అధ్యయనం ముఖ్యం. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. కాని అన్ని కోణాల్లో అవగాహన ఉంటేనే సమాధానాలు గుర్తించగలిగేలా ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి ప్రస్తుత సమయంలో డిస్క్రిప్టివ్‌ విధానంలో చదువుతూ.. ఆయా అంశాలపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ పాలన పాటించాలి.

కామన్‌ టాపిక్స్‌

అభ్యర్థులు కామన్‌ టాపిక్స్‌ను ఒకే సమయంలో చదివేలా ప్లాన్‌ చేసుకోవాలి. పరీక్ష సిలబస్‌కు అనుగుణంగా ఆయా సబ్జెక్ట్‌లలోని ఉమ్మడి అంశాలను గుర్తించి.. వాటిని అనుసంధానం చేసుకుంటూ చదవాలి. జనరల్‌ స్టడీస్, కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; భారత రాజ్యాంగం, పరిపాలన, ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌.. ఇలా అన్ని అంశాలను అనుసంధానం చేసుకుంటూ చదివే వీలుంది. ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్‌ టేబుల్‌ రూపొందించుకోవాలి.

చ‌ద‌వండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు

ఏదీ వదలకుండా

ఇప్పటి వరకు ప్రిపరేషన్‌ను పూర్తి చేసే క్రమంలో ఏమైనా టాపిక్స్‌ వదిలేస్తే వాటిపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ దశలు, తెలంగాణ ఆవిర్భావ దశ, మలి ఉద్యమంలో ముఖ్యమైన ఘట్టాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే టాపిక్స్‌ను లోతుగా చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు.. ఇలా అన్ని అంశాలపై దృష్టి పెట్టాలి.

సొంత నోట్స్‌

అభ్యర్థులు ఇంతకాలం రాసుకున్న సొంత నోట్స్‌­ను సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన అంశాలు, పాయింట్లతో రాసుకున్న నోట్స్‌ను పదే పదే చదువుతూ ముందుకు సాగాలి. మతాలు,సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నింటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

ప్రభుత్వ విధానాలు

  • రాష్ట్ర స్థాయిలో సామాజిక సమస్యలు, వాటిపై ప్రభుత్వాలు చేసిన విధానాలపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం ప్రభుత్వ విధానాలపై ప్రచురితమైన అధికారిక డాక్యుమెంట్లను పరిశీలించాలి. ఇందు­లో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం విధానాలు రూపొందించారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. 
  • తెలంగాణ ఏర్పాటుకు ప్రధాన డిమాండ్లుగా పేర్కొన్న నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి వాటిపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన పాలసీలపై అవగాహన పెంచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించి తెచ్చిన పథకాలను అధ్యయనం చేయాలి.

పేపర్‌–4కు ప్రత్యేకంగా

గ్రూప్‌–2 అభ్యర్థులు పేపర్‌–4పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఇందులో ‘తెలంగాణ ఆలోచన (1948–1970), ఉద్యమ దశ(1971–1990), తెలంగాణ ఏర్పాటు దశ, ఆవిర్భావం(1991–2014)).. అని మూడు దశలను పేర్కొన్నారు. ముఖ్యంగా సిలబస్‌లో నిర్దేశించిన ప్రకారం– 1948 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకూ జరిగిన ముఖ్య ఉద్యమాలు, ఒప్పందాలు, ముల్కీ నిబంధనలు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీలు –వాటి సిఫార్సులపై పట్టు సాధించాలి. దీంతోపాటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రూపొందించిన పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు సంబంధించి ప్రత్యేకంగా పొందుపరచిన అంశాలు; తెలంగాణకు కల్పించిన హక్కులపై దృష్టి సారించాలి.

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

‘స్పెషల్‌’ ఫోకస్‌

తెలంగాణ ప్రత్యేక అంశాలను చదివేటప్పుడు.. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ పేరుతో ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్‌ను మరింత లోతుగా అధ్యయనం చేయాలి. చరిత్రలో తెలంగాణలో రాజులు, ముఖ్య యుద్ధాలు, ఒప్పందాలు, తెలంగాణలోని కవులు–రచనలు; కళలు; ముఖ్య కట్టడాలు–వాటిని నిర్మించిన రాజులు తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అదే విధంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రమేయం ఉన్న సంఘటనలపై అవగాహన ఏర్పరచుకోవాలి. తెలంగాణలోని ముఖ్యమైన నదులు–పరీవాహక ప్రాంతాలు; ముఖ్యమైన పంటలు; భౌగోళిక ప్రాధాన్యమున్న ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. దీంతోపాటు తెలంగాణ భౌగోళిక స్వరూపం–విస్తీర్ణం, జనాభా వంటి అంశాలపైనా అవగాహన అవసరం. ఎకానమీలో తెలంగాణ స్థూల రాష్ట్రీయోత్పత్తి, ముఖ్యమైన పథకాలు, 2011 జనాభా గణాంకాలు; ముఖ్యమైన పరిశ్రమలు–ఉత్పాదకతతోపాటు, రాష్ట్ర ప్రధాన ఆదాయ వనరులపై అవగాహన పెంచుకోవాలి. తాజా బడ్జెట్‌ గణాంకాలు, ఆయా శాఖలు, పథకాలకు కేటాయింపులపై పట్టు సాధించాలి.

రివిజన్‌.. రివిజన్‌

గ్రూప్‌–2 అభ్యర్థులు పునశ్చరణకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని గ్రహించాలి. పరీక్ష తేదీలకు కనీసం పది రోజుల ముందు నుంచి పూర్తిగా రివిజన్‌కు సమయం కేటాయించుకోవాలి. రివిజన్‌ సమయంలో షార్ట్‌ నోట్స్, సొంత నోట్స్‌లను అనుసరించాలి. దీంతోపాటు ప్రీవియస్‌ పేపర్స్, ప్రాక్టీస్‌ పేపర్స్‌ సా«ధన కూడా గ్రూప్‌2 పరీక్షలో విజయానికి దోహదం చేస్తుంది.

గ్రూప్‌–2 పరీక్ష ఇలా.. 

పేపర్‌ సబ్జెక్ట్‌ ప్రశ్నలు మార్కులు
1 జనరల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ ఎబిలిటీస్‌ 150 150
2

హిస్టరీ, పాలిటీ అండ్‌ సొసైటీ

1) సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా, తెలంగాణ
2) భారత రాజ్యాంగ సమీక్ష, రాజకీయాలు
3) సామాజిక స్వరూపం, సమస్యలు, పబ్లిక్‌ పాలసీలు

150 150
3 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌
1) ఇండియన్‌ ఎకానమీ: సమస్యలు, సవాళ్లు
2) ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ తెలంగాణ
3) అభివృద్ధి సమస్యలు, మార్పు
150 150
4 తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
1) ఐడియా ఆఫ్‌ తెలంగాణ(1948–1970)
2) మొబిలైజేషన్‌ దశ (1971–1990)
3) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ (1991–2004)
150 150
మొత్తం   600 600​​​​​​​
Published date : 17 Jul 2023 04:59PM

Photo Stories