CPT Exam : రెండు రోజులు.. మూడు సెషన్లలో సీపీటీ పరీక్ష
తిరుపతి అర్బన్: ఏపీపీఎస్సీకి చెందిన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్(సీపీటీ)కు సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. పరీక్షల నిర్వహణపై సోమవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పుత్తూరు మండలం చిన్నరాజకుప్పంలోని శ్రీవెంకట పెరుమాళ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.
NAS Exam : విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాలకు నాస్.. పరీక్ష విధానం ఇలా!
మంగళ, బుధవారాల్లో రెండు రోజుల పాటు సీపీటీ పరీక్ష మూడు సెషన్స్‌లో జరుగుతుందని స్పష్టం చేశారు. ఉదయం 9.30 నుంచి 10.30 వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు సాయంత్రం 4.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఉంటుందన్నారు. 677 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల్లోకి విద్యుత్ పరికరాలు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో ఏపీపీఎస్సీ నుంచి అసిస్టెంట్ సెక్రటరీ సురేష్‌బాబు,సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)