Skip to main content

AP Jobs Calendar 2024 : జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై కీల‌క నిర్ణ‌యం..! తేల్చి చెప్పిన ప్ర‌భుత్వం...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ జాబ్‌ క్యాలెండర్, నిరుద్యోగ భృతిపై గంపెడు ఆశలు పెట్టుకున్న యువతకు కుట‌మి ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఏపీ ముఖ్య‌మంతి చంద్రబాబు నిరుద్యోగుల జీవితాల‌తో దారుణంగా ఆడుకుంటున్నాడు.
AP CM Babu

ఇటు డీఎస్సీ, అటు గ్రూప్స్‌ పరీక్షలన్నింటినీ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ యువత భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నాడు బాబు ప్రభుత్వం. 

ఎన్నికల్లో ఇచ్చిన‌ నిరుద్యోగ భృతి హామీ అమలును సైతం గాలికి వదిలేసింది. నిరుద్యోగులకు భృతి అందించే ప్రతిపాదనే ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదని న‌వంబ‌ర్ 24వ తేదీన (శుక్రవారం) శాసన సభ సాక్షిగా ప్రభుత్వం రాతపూర్వకంగా తేల్చి చెప్పింది. పైగా రాష్ట్రంలో కేవలం 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు కాకి లెక్కలు చూపించింది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంపై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నారు. 

➤☛ AP Grama Ward Volunteers : గ్రామ‌/వార్డు వలంటీర్లను తక్షణమే విధుల్లోకి.. నెల‌కు రూ.10 వేలు... ?

నెలకు రూ.3 వేలు చొప్పున..
సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించే వరకూ నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. తీరా గద్దెనెక్కి ఆరు నెలలు గడుస్తున్నప్పటికీ ఆ హామీ అమలుపై ఒక్క అడుగూ ముందుకు పడలేదు. 

నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు.. 
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో సైతం నిరుద్యోగ భృతికి ఎటువంటి కేటాయింపులు చేయలేదు. కొత్త ఉద్యోగాల భర్తీపై స్పష్టతా ఇవ్వలేదు. వాస్తవానికి రాష్ట్రంలో 1.60 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇంటికొక్కరు చొప్పున వేసుకున్నా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతికి రూ.4,800 కోట్లు ఖర్చు చేయాలి. 

☛➤ AP DSC Notification 2024 Problems : డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకెప్పుడు...? సీఎం తొలి సంత‌కంకు విలువ లేదా..?

4.46 లక్షల మంది నిరుద్యోగులే...
అంటే ఏడాదికి సుమారు రూ.57,600 కోట్లు నిరుద్యోగుల సంక్షేమానికి ఖర్చవుతుంది. అయితే రాష్ట్రంలో 4.46 లక్షల మంది నిరుద్యోగులే ఉన్నట్టు బాబు ప్రభుత్వం వెల్లడించడం యువతను మోసగించడమేనని పలువురు చెబుతున్నారు.

Published date : 24 Nov 2024 02:26PM

Photo Stories