AP DSC Notification 2024 Problems : డీఎస్సీ నోటిఫికేషన్ ఇంకెప్పుడు...? సీఎం తొలి సంతకంకు విలువ లేదా..?
కారణం ఇదేనా..?
ఎస్సీ వర్గీకరణపై స్పష్టత వచ్చిన తర్వాతే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తుంది. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించి, రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇవన్నీ పూర్తి కావడానికి రెండు నుంచి మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంటుంది. అంటే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు దాదాపు రెండు నుంచి మూడు నెలల సమయం పట్టనున్నది.
మంత్రి నారా లోకేశ్ మాత్రం..
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై మంత్రి నారా లోకేశ్ ఇటీవల ఏపీ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమైన నెలలోగా డీఎస్సీ నియామకాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సభలో ప్రకటించారు. ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ జాప్యం కావడంపై సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఉపాధ్యాయ నియామకాల్లో వయో పరిమితి పెంపు డిమాండ్‌ను పరిగణలోకి తీసుకున్నామని దీనిపై అన్ని శాఖల మధ్య ఫైల్ సర్క్యూలేషన్‌లో ఉందని, ఎంత వయోపరిమితి పెంచుతామనేది స్పష్టత రాగానే ప్రకటిస్తామన్నారు.
ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) 6,371,స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)-7,725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీలు)-1,781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్స్ (పీజీటీలు)-286, ప్రిన్సిపాళ్లు 52, వ్యాయామ ఉపాధ్యాయులు (పీఈటీలు)-132 ఉద్యోగాలు ఉన్నాయి.
సీఎం తొలి సంతకంకు విలువ లేదా..?
16,347 టీచర్ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది.
7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు
గతేడాది డిసెంబర్ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్ కమిషన్ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
గత ప్రభుత్వం ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మా హయాంలో 11 నోటిఫికేషన్లు ఇచ్చాం. వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం. గతంలో నోటిఫికేషన్లపై కేసులు పడ్డాయి. వాటిపై అధ్యయనం చేసి డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులకు చెప్పాం.. అని శాసన సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆర్నెళ్లలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జూన్‌లో ఆయన హామీ ఇవ్వగా నవంబర్ 6న నోటిఫికేషన్ జారీ అవుతుందంటూ టీడీపీ అనుకూల మీడియాలో ప్రచారం జరిగింది. కేసులపై అధ్యయనం జరిపి న్యాయ వివాదాలను పరిష్కరించాక నోటిఫికేషన్ ఇవ్వాలంటే అది ఎప్పటికి సాధ్యమవుతుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
గత ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన డీఎస్సీని కూటమి సర్కారు మెగా డీఎస్సీ ఇస్తామంటూ రద్దు చేసింది. 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ అంటూ ప్రచారం చేసింది. తర్వాత నవంబర్ తొలివారంలో నోటిఫికేషన్ అంటూ రకరకాల తేదీలను తెరపైకి తెచ్చారు. తీరా గడువు దాటినా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అది కూడా గత వైఎస్సార్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన 6100 పోస్టులతో పాటు.. దానికి మరో 10 వేలకు పైగా పోస్టులు కలిపి ఈ నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేసిన ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు.. మొదటి సంతకంతోనే.. నిరుద్యోగులను దారుణంగా మోసం చేశాడు.
తాజాగా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా న్యాయ వివాదాలపై అధ్యయనం చేశాక త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తాపీగా ప్రకటించడంతో అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. ఏ తరహా న్యాయ వివాదాలు ఉన్నాయో.. అవి ఎప్పటికి పరిష్కారం అవుతాయో అంతుబట్టని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన తొలి హామీ డీఎస్సీ నోటిఫికేషన్‌పై ఐదు నెలలైనా స్పష్టత రాకపోవడంతో నిస్పృహకు గురవుతున్నారు. ఫిబ్రవరిలో డీఎస్సీ కోసం శిక్షణ తీసుకుంటే తీరా ఆ నోటిఫికేషన్ రద్దు చేశారని.. చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి ఏడాది కాలంగా ఆర్థికంగా నష్టపోయామని అభ్యర్థులు వాపోతున్నారు. నోటిఫికేషన్‌ను ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారని మంత్రి చెబుతున్న త్వరలో ఎప్పుడు వస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు.
Tags
- ap dsc 2024 notification
- AP DSC 2024
- AP DSC 2024 Schedule
- ap dsc 2024 notification news telugu
- ap dsc 2024 notification problems
- ap dsc 2024 notification problem
- ap dsc 2024 notification problem news in telugu
- AP CM Chandra Babu
- ap cm chandra babu to sign first file for mega recruitment of teachers
- ap cm chandra babu dsc 2024
- ap cm chandrababu first cabinet meeting discuss on ap mega dsc 2024
- ap cm chandrababu first cabinet meeting discuss on dsc 2024
- ap cm chandrababu first cabinet meeting discuss on dsc 2024 news telugu
- telugu news ap cm chandrababu first cabinet meeting discuss on dsc 2024
- AP CM Chandrababu
- ap cm chandra babu naidu nirudyoga bruthi 2024 news telugu
- ap cm chandrababu naidu
- ap dsc 2024 notification delay issue
- ap dsc 2024 notification delay issue news in telugu
- breaking news ap dsc notification 2024 notification release problems
- APDSCNotification
- AndhraPradeshEducation
- APTeacherJobs
- DSCNewsUpdates