Skip to main content

AP DSC 2024 Notification Pending : ఆ త‌ర్వాతే.. 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేష‌న్‌..? మ‌రో సారి...

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఏపీ మెగా డీఎస్సీ పేరుతో... చంద్రబాబు కుట‌మి ప్ర­భు­త్వం డీఎస్సీ అభ్యర్థులకు చుక్కలు చూపిస్తోంది.
AP DSC 2024 Notification    andhrapradesh government delaying DSC notification

ఇదిగో డీఎస్సీ... అదిగో డీఎస్సీ నోటిఫికేష‌న్ అంటూ ఆరు నెలలుగా ఊరిస్తూ.. నోటిఫికేష‌న్ మాత్రం ఇవ్వ‌లేదు. ఇప్ప‌టికి డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడో స్ప­ష్ట­త ఇవ్వలేదు. 

➤☛ Inspire Success Story : ఇత‌ను సామాన్యూడు కాదు.. 1 కాదు.. 2 కాదు.. ఏకంగా 8 గ‌వ‌ర్నమెంట్ ఉద్యోగాల‌ను కొట్టాడిలా...

ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో...
ఎస్సీ(SC) వర్గీకరణపై RR మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

సీఎం తొలి సంత‌కంకు విలువ లేదా..?
16,347 టీచర్‌ పోస్టుల భర్తీ ఫైల్‌పై ముఖ్యమంత్రి చేసిన తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. నవంబర్‌ 6న మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామంటూ దాగుడుమూతలు ఆడుతూ వచ్చిన సర్కారు చివరకు చేతులెత్తేసింది. 

7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను..
గతేడాది డిసెంబర్‌ నుంచి నిద్రాహారాలు మాని శిక్షణకే అంకితమైన దాదాపు 7.50 లక్షల మంది ఉపాధ్యాయ అభ్యర్థులను తీవ్ర నిస్పృహకు గురి చేస్తూ త్వరలో నోటిఫికేషన్‌ ఇస్తామంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ శాసనసభలో ప్రకటించడంతో సర్కారు వాయిదాల వ్యూహం బయటపడింది. ఈ వాయిదాల పర్వాన్ని గమనిస్తున్న నిరుద్యోగులు, విద్యారంగ నిపుణులు 2019కి ముందు టీడీపీ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. గతంలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వీస్‌ కమిషన్‌ నుంచి విడుదలైన పలు నోటిఫికేషన్లు వాయిదా పడ్డాయని, ప్రభుత్వంలో ఉన్నవారే పోస్టుల భర్తీని ఆలస్యం చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

Published date : 07 Dec 2024 10:20AM

Photo Stories