DSC Free Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
అక్టోబర్ 21వ తేదీ వరకు జన్మభూమి.ఏపీ.జీవోవీ.ఇన్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వార్షిక ఆదాయం రూ.2.50 లక్షలు లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అర్హులుగా పేర్కొన్నారు.
మూడో సారి దరఖాస్తుల ఆహ్వానం
ఆగస్టులో బీసీ వెల్పేర్ జిల్లా అధికారి చంద్రశేఖర్ నేతృత్వంలో డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇస్తున్నామని దరఖాస్తులు చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు. ఆమేరకు పెద్ద సంఖ్యలో పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఆ దరఖాస్తులు ఏమైనాయో....శిక్షణ మాత్రం ఒక్కరికి ఇవ్వలేదు.
చదవండి: డీఎస్సీ - టెట్ | మోడల్ పేపర్స్ | సెకండరీ గ్రేడ్ టీచర్ బిట్ బ్యాంక్ | స్కూల్ అసిస్టెంట్ బిట్ బ్యాంక్
ఆ తర్వాత సెప్టెంబర్‌లో ఎస్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి సూర్యనారాయణ నేతృత్వంలో డీఎస్పీకి ఉచిత శిక్షణ ఇస్తున్నామని దరఖాస్తులు చేసుకోవాలని ఓ ప్రకటన విడుదల చేశారు. పలువురు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే ఆ తర్వాత ఉచిత శిక్షణ ఊసేలేదు.
తాజాగా అక్టోబర్‌లో డీఎస్పీకి ఉచిత శిక్షణ ఇస్తామని దరఖాస్తులు చేసుకోవాలంటూ ఎస్పీ వెల్ఫేర్ జిల్లా అధికారి యు. చెన్నయ్య నేతృత్వంలో ఓ ప్రకటన విడుదల చేశారు. నెలకొకసారి డీఎస్సీకి ఉచిత శిక్షణ ఇస్తామంటూ ఒక్కో అధికారితో ప్రకటనలు ఇప్పించడంపై డీఎస్పీ విద్యార్థులు తీవ్రంగా మండిపడుతున్నారు.
Tags
- DSC Free Coaching
- District SC Welfare Department
- District BC Welfare
- AP DSC Free Coaching
- Free Coaching For AP DSC 2024
- AP DSC Free Coaching News in Telugu
- ap government free coaching for dsc
- ap government dsc free coaching applications
- Jnanabhumi Web Portal
- Good news For Students Free DSC Coaching
- Teacher jobs
- Good News For Students
- AP State DSC Free Coaching news
- andhra pradesh news
- dsctraining
- FreeTraining
- TrainingAnnouncement
- IncomeEligibility
- SCSTCandidates
- OnlineApplication
- SakshiEducationUpdates