JEE Mains Application Corrections Last date : జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తు సవరణలకు చివరి తేదీ ఇదే
Sakshi Education
జేఈఈ మెయిన్స్ అభ్యర్థులకు అలర్ట్. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఏవైనా సవరణలు ఉంటే సరిచేసుకోవచ్చవని ఎన్టీఏ తెలిపింది.
జేఈఈ మెయిన్స్- 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాము సమర్పించిన దరఖాస్తు వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే నవంబర్ 26 నుంచి 27వ తేదీ రాత్రి 11.50గంటల వరకు సరి చేసుకోవచ్చని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది.
National Scholarship: నేషనల్ స్కాలర్‌షిప్ అర్హత పరీక్ష..హాల్‌టికెట్స్ విడుదల
అయితే అభ్యర్థులు తమ మొబైల్ నంబర్, ఈమెయిల్, శాశ్వత / ప్రస్తుత చిరునామా, అత్యవసర సంప్రదింపు వివరాలు, ఫోటోలను మార్చడానికి మాత్రం అనుమతి లేదు. కేవలం తమ పేరు, తల్లి పేరు/తండ్రి పేరు, మార్కుల వివరాలు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో ఏమైనా తప్పులుంటే సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
- అప్లికేషన్ ప్రారంభ తేదీ: అక్టోబర్ 28, 2024
- అప్లికేషన్ చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 09:00 గంటల వరకు)
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: నవంబర్ 22, 2024 (రాత్రి 11:50 వరకు)
- పరీక్షా తేదీలు: జనవరి 22 నుండి జనవరి 31, 2025
- ఫలితాల విడుదల: ఫిబ్రవరి 12, 2025లోపు
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Published date : 25 Nov 2024 10:28AM
Tags
- JEE Mains
- jee mains correction
- JEE Main
- JEEMains2025
- JEE Main 2025 Notification
- JEE Mains application
- jee mains correction window
- JEE Mains Application Corrections Last date
- application corrections
- JEEExamSchedule
- JEE Main 2025 Notification Released
- NTA JEE Main 2025
- JEEApplicationForm
- JEEExams
- ApplicationCorrection
- OnlineApplication
- NTAUpdates