IIT Delhi Graduation Exit Survey 2024: ఉద్యోగాలను మించి.. కెరీర్‌పై దృష్టి
అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్‌లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్ సర్వే నిర్వహించారు.
పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టి
ఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్ స్పిరిట్ స్టూడెంట్స్ సర్వే–2023 వెల్లడించింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్‌షిప్ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది.
ఎగ్జిట్ సర్వే ఏం తేల్చిందంటే..
- 53.1 శాతం అంటే 1,411 మంది అందివచి్చన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.
- 8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలని నిర్ణయించుకున్నారు.
- 13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం అంటే 47 మంది పీహెచ్‌డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.
- 321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు.
- 134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్‌లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు.