Skip to main content

IIT Graduates : ఐఐటీ గ్రాడ్యుయేట్స్‌ .. విభిన్న కెరీర్ అవ‌కాశాల‌పై అన్వేష‌ణ‌.. ఈ స‌ర్వే ప్ర‌కారం..!

ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్‌లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు.
IIT graduates focus on various career opportunities  14 percent of IIT graduates focusing on the industrial sector - Global University Entrepreneurial Spirit Survey 2023  Survey results showing 14 percent IIT graduates targeting the industrial sector

అమరావతి: మన దేశంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)లకు ఎంతో క్రేజ్‌ ఉంది. ఏటా లక్షలాదిమంది విద్యార్థులు ఐఐటీల్లో ప్రవేశాల కోసం పోటీ పడుతుంటారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక రూ.కోట్లలో 
ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్‌ సాధిస్తుంటారు. 

Collector Pamela : క‌లెక్ట‌ర్ క్రియేటివిటి.. చిన్నారుల్లో మ‌రింత ఉత్సాహం.. ఈ పాట‌తో!

అయితే.. ఐఐటీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారిలో సగం మంది కెరీర్‌లో విభిన్న అవకాశాలను అన్వేషించడంపై మొగ్గు చూపుతున్నారు. ఈ అంశం ఇటీవల ఢిల్లీ ఐఐటీ ఎగ్జిట్‌ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో డిగ్రీ పట్టా అందుకున్న 2,656 మంది విద్యార్థులపై ఎగ్జిట్‌ సర్వే నిర్వహించారు.

పారిశ్రామిక రంగంపై 14 శాతం మంది దృష్టి

ఇదిలావుండగా.. దేశంలో ఐఐటీలతోపాటు ఇతర సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారిలో 14 శాతం మంది పారిశ్రామిక రంగంపై దృష్టి సారిస్తున్నట్టుగ్లోబల్‌ యూనివర్సిటీ ఎంట్రప్రెన్యూరియల్‌ స్పిరిట్‌ స్టూడెంట్స్‌ సర్వే–2023 వెల్లడించింది. 

National Championship: జార్ఖండ్‌.. జాతీయ సబ్‌ జూనియర్‌ మహిళల హాకీ విజేత

57 దేశాల్లో చేపట్టిన సర్వే ఫలితాలు ఈ ఏడాది అక్టోబర్‌లో వెలువడ్డాయి. భారత గ్రాడ్యుయేట్లలో అత్యధికులు పారిశ్రామిక రంగంపై దృష్టి సారించినట్టు సర్వే పేర్కొంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత విద్యార్థులు అత్యధిక ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఆలోచనలు కలిగి ఉన్నారని ఈ సర్వే తేల్చింది. 

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

ఎగ్జిట్‌ సర్వే ఏం తేల్చిందంటే..

»  53.1 శాతం అంటే 1,411 మంది వచ్చిన ఉద్యోగ అవకాశాల్లో కొనసాగుతామని వెల్లడించారు.
»   8.4 శాతం అంటే 224 మంది స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపారు. 1.7 శాతం అంటే 45 మంది స్టార్టప్స్‌ కోసం పనిచేస్తామని వెల్లడించారు. 2.5 శాతం అంటే 66 మంది ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణించాలని నిర్ణయించుకున్నారు.
Gurukul Admissions: గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌
»
   13.5 శాతం అంటే 359 మంది ఉన్నత చదువుల్లో రాణించాలని నిర్ణయించుకున్నారు. 1.8 శాతం  అంటే 47 మంది పీహెచ్‌డీ, పరిశోధన రంగాల్లో అవకాశాల కోసం అన్వేషిస్తామన్నారు.
»   321 మంది (12.1) శాతం మంది సివిల్స్, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో రాణించేందుకు సన్నద్ధం అవుతామన్నారు. 
»  134 మంది విద్యార్థులు (5 శాతం మంది) మాత్రమే ఇంకా కెరీర్‌లో ఏం చేయాలో నిర్ణయించుకోలేదని వెల్లడించారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Dec 2024 03:40PM

Photo Stories