Applications for KGBV Admissions : కేజీబీవీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ఇదే చివరి తేది

జిల్లాలో ఇలా..
జిల్లా వ్యాప్తంగా కుప్పం, రామకుప్పం, గుడుపల్లి, శాంతిపురం, బైరెడ్డిపల్లి, గంగవరం, పుంగనూరు, రొంపిచెర్లలలో కేజీబీవీలు ఉన్నాయి. సీట్ల భర్తీలో నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారీగా ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం సీట్లను భర్తీ చేస్తారు. 7,8,9,10,12 తరగతుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు ఉంటాయి. ఒక్కో తరగతికి 40 సీట్ల చొప్పున కేటాయించారు. దరఖాస్తులను హెచ్‌టీటీపీఎస్://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఐఎన్‌వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్‌న్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
ప్రత్యేకత ఇదీ....
ఈ విద్యాలయాల్లో చేరిన బాలికలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, యూనిఫారం అందిస్తారు. మెరుగైన వైద్య సదుపాయం, వృత్తి విద్యలో శిక్షణ అందిస్తారు. చదువుతోపాటు టైలరింగ్, ఎంబ్రాయిడరీ, నృత్యం, సంగీతం వంటివాటిని నేర్పిస్తారు. తరగతి గదుల్లో ఎల్‌సీడీ ప్రాజెక్టర్లు, డీవీడీ ప్లేయర్ల ద్వారా బోధన ఉంటుంది. ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తారు.
నిరంతర పర్యవేక్షణ
కేజీబీవీ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యా బోధన సాగు తుంది. మౌలి కసదుపాయాలు, విద్యార్థు లకు స్మార్ట్ డిజిటల్ తరగతులు ద్వారా బోధన ఉంటుంది. బాలికలకు భరోసాగా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం.
– వెంకటరమణ, జిల్లా సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, చిత్తూరు
పురోగతికి సోపానం
జిల్లాలోని కేజీబీవీలు పేద విద్యార్థినుల పు రోగతికి సోపానాలు, కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థినులు అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆన్‌న్‌లైనన్‌లో దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
– వరలక్ష్మి, డీఈఓ, చిత్తూరు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- KGBV Admissions
- Admissions 2025
- KGBV
- Kasturba Gandhi Balika Vidyalaya
- KGBV Online Application
- KGBV Class 6 and 11 Admission
- KGBVSchools
- KGBVAdmissions2025
- 6th to 9th admissions
- applications for kgbv admissions
- Admissions 2025
- Kasturba Gandhi Girls' Schools
- applications for kgbv
- APSchoolAdmissions
- entrance process for kgbv
- registrations dates for kgbv admissions