Skip to main content

No Bag Day for School Students : ప్ర‌తీ శ‌నివారం నో బ్యాగ్ డే.. ఇక‌పై బ‌డుల్లోనూ సెమిస్ట‌ర్ విధానం.. కార‌ణం!!

ఏం చదువులోగానీ చిన్నారులకు మాత్రం బండెడు పుస్తకాల మోత తప్పడం లేదు.
Government key decisions for school students bag weight loss

పలమనేరు: ఆడుతూ.. పాడుతూ ఉండాల్సిన వయస్సులో పిల్లలకు బ్యాగుల భారం శరాఘాతంలా మారిందని తల్లిదండ్రులు ఎన్నాళ్లుగానో ఆవేదన చెందుతున్నారు. జాతీయ విద్యా విధానం అమలై నాలుగేళ్లైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ప్రతి శనివారం ‘నో బ్యాగ్‌డే’ను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనుంది. నో బ్యాగ్‌ డేన పిల్లలకు క్విజ్‌ పోటీలు, డిబేట్లు, క్రీడలు, క్షేత్రస్థాయి పర్యటనలు తదితర సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

Jawahar Navodaya Results : ఫ‌లితాలు విడుద‌ల‌.. న‌వోద‌య‌లో ప్ర‌వేశానికి 37 మందికి అర్హ‌త‌..!

పుస్తకాల భారం తగ్గించాలనే లక్ష్యం

చిన్నారుల బరువులో పది శాతానికి మించి బరువు మోయరాదనే నిపుణుల మాటలను ఇప్పటి దాకా అటు పాఠశాలల యాజమాన్యాలు, ఇటు తల్లిదండ్రులు అసలు పట్టించుకోలేదు. చిన్నారుల పుస్తకాల మోతపై గతంలో అధ్యయనం చేసిన యశ్‌పాల్‌ కమిటీ కొన్ని సూచనలు చేసింది. 1 నుంచి 5 తరగతులకు మూడు కిలోలకు మించి బరువు మోయించరాదని, పదో తరగతికి ఐదు కిలోల వరకే బరువు ఉండాలని సూచించారు.

TS Inter First and Second Year Results 2025 : ఇంట‌ర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల విడుద‌ల ఎప్పుడంటే...?

ఇకపై సెమిష్టర్‌ విధానం

పిల్లల భుజాలపై పుస్తకాల భారాన్ని తగ్గించేందకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బడుల్లో సెమిష్టర్‌ విధానాన్ని అమలు చేయనున్నారు. ఆ సెమిష్టర్‌కు సంబంధించిన రెండు పుస్తకాలు, నోట్స్‌లను మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మొదలు కానున్నట్లు అధికారులు తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 26 Mar 2025 12:40PM

Photo Stories