Skip to main content

Finance Bill: ద్రవ్యబిల్లుతో పన్ను చెల్లింపుదారులకు భారీ ఉపశమనం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 ఆర్థిక బిల్లుపై లోక్‌సభలో మార్చి 25వ తేదీ ప్రసంగించారు.
Finance Minister Nirmala Sitharaman Reply on Finance Bill

ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పన్ను చెల్లింపుదారులకు సొంత ఆదాయంపై ఉపశమనం ఇచ్చే నిర్ణయాలను వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఉపశమనం అందించేందుకు పన్ను రిబేట్ పరిమితి పెంచడం, కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణ వంటి మార్పులపై మంత్రగారు వివరించారు.

ముఖ్యాంశాలు..
పన్ను రిబేట్ పెంపు: కొత్త పన్ను విధానం ప్రకారం, వ్యక్తిగత ఆదాయ పన్ను రిబేట్ పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచడం. శాలరీ తరగతుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ కూడా లెక్కలోకి తీసుకుంటే, ఏటా రూ.12.75 లక్షల వరకు పన్ను రిబేట్ అందించనున్నారు.

ఆదాయపన్ను వృద్ధి అంచనాలు: 2025–26 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయపన్ను వసూళ్లు రూ.13.6 లక్షల కోట్ల వరకు చేరుకునే అవకాశముంది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అంచనాలు రూ.12.2 లక్షల కోట్ల వరకు ఉన్నాయి.

Groundwater Level: ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా పెరిగిన భూగర్భజలాలు

కస్టమ్స్ సుంకాల తగ్గింపు: పారిశ్రామిక ఉత్పత్తులపై విధించే 7% కస్టమ్స్ సుంకాలను తొలగించడం. 21 రకాల టారిఫ్ రేట్లను 8కి తగ్గించడం. ముడిసరుకులపై దిగుమతి సుంకాలు తగ్గించడం వలన ఉత్పత్తి వ్యయాలు తగ్గి, భారత దేశం నుంచి ఎగుమతులు పెరగడం.

ఆన్‌లైన్ ప్రకటన పన్ను (డిజిటల్ పన్ను): 6% ఈక్వలైజేషన్ లెవీ లేదా డిజిటల్ పన్ను రద్దు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా గూగుల్, మెటా, 'ఎక్స్' వంటి సంస్థలు లబ్ధి పొందే అవకాశం ఉంది.

వర్షాకాల సమావేశంలో కొత్త ఆదాయపన్ను బిల్లు: 2025–26 ఆర్థిక బిల్లు లో కొత్త ఆదాయపన్ను బిల్లు కూడా చర్చకు రానుంది. ఈ బిల్లు ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది. సెలక్ట్ కమిటీ పరిశీలనలో ఉంది, మరియు వర్షాకాల సమావేశాల్లో దీని పై చర్చించబడుతుంది.

35 సవరణలతో ఆర్థిక బిల్లు: సెర్చ్ కేసుల్లో బ్లాక్ అసెస్‌మెంట్ కోసం, మొత్తం ఆదాయం కాకుండా వెసటబడని ఆదాయాన్నే గుర్తించడంపై సవరణ చేయబడింది. ఈ సవరణలు 2024 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 35 సవరణలతో కూడిన ఆర్థిక బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది.

అంచనా వ్యయంతో బడ్జెట్: రూ. 50.65 లక్షల కోట్ల అంచనా వ్యయంతో మోదీ సర్కార్ 2025–26 ఆర్థిక బడ్జెట్ ను రూపొందించింది.

PM-AASHA Schem: రైతులకు గుడ్‌న్యూస్.. పీఎం-ఆశా పథకం పొడిగింపు

Published date : 26 Mar 2025 05:32PM

Photo Stories