Skip to main content

Gurukul Admissions: గురుకుల ప్రవేశాలకు నోటిఫికేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల సొసైటీలో ప్రవేశాలకు డిసెంబర్ 18న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఎస్సీ గురుకుల విద్యాసంస్థల సొసై టీ కార్యదర్శి అలగు వర్షిణి వెల్లడించారు.
Notification for Gurukul admissions  Notification Announcement by Alagu Varshini SC Gurukul Educational Institutions Society Secretary Announcement

ముందుగా ఐదోతరగతి ప్రవేశాల ప్రకటన జారీ చేస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ నెలన్నరపాటు సాగుతుందని, ఫిబ్రవరి 23న రాతపరీక్ష నిర్వహించి జూన్‌ 12లోగా ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియలో భాగంగా విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను కూడా జతచేయాల్సి ఉంటుందని, 2024 సంవత్సరంలో తీసుకున్న ధ్రువపత్రాలు చెల్లుతాయన్నారు.

గురుకుల సొసైటీ కార్యక్రమాలపై డిసెంబర్ 6న సొసైటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు అర్హత పరీక్ష నిర్వహించడం లేదని, పదోతరగతి పాసైన విద్యార్థులకు నేరుగా ఇంటర్‌ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

చదవండి: BRAOU Degree and PG Courses Admissions 2024-25 : ఈ ఏడాది ఏపీ విద్యార్థుల‌కు నిరాశే..దూరవిద్య ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల్లేవ్‌.. ఎందుకంటే..?

సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీ(సీఓఈ)ల్లో ప్రవేశాలకు మాత్రం అత్యధిక మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని ఆమె వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గురుకులాలపై ఆరోపణలు చేస్తున్నారని, వారు మెరుగైన వసతుల కల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.

గురుకులాల్లోకి ఇతరుల అనుమతి ఉండదని, విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు ఉన్న చోట్ల మరింత కట్టదిట్టమైన భద్రత ఉంటుందని ఆమె వెల్లడించారు.   

Published date : 07 Dec 2024 03:14PM

Photo Stories