Skip to main content

JEE Advanced 2025-26: జేఈఈ(అడ్వాన్స్‌డ్‌)–2025 పరీక్ష షెడ్యూల్ విడుద‌ల‌.. వీరు మాత్ర‌మే అర్హులు!

దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జేఈఈ (అడ్వాన్స్‌డ్‌) పరీక్ష నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ పరీక్షను ఐఐటీ కాన్పూర్‌ నిర్వహిస్తుంది.
JEE Advanced 2025 Exam Schedule Released JEE Advanced Notification 2025   IIT Kanpur JEE Advanced Exam Details  Eligibility for JEE Advanced 2025  BTech and BArch Admissions 2025

అర్హత: జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు. అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి రెండుసార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుంది. అంటే ఇంటర్‌ పాసైన సంవత్సరంతో పాటు ఆ తర్వాత ఏడాది మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. మే నెలలో జరిగే అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు 2024 మార్చి, 2025 మార్చిలో జరిగే ఇంటర్‌ లేదా తత్సమానమైన పరీక్షల్లో పాసైనవారు మాత్రమే అర్హులు. అంతకంటే ముందు ఉత్తీర్ణులైనవారికి అవకాశం ఉండదు.
వయసు: అభ్యర్థులు 01.10.2000 లేదా తర్వాత జన్మించి ఉండాలి. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసు సడలింపు ఉంటుంది.
పరీక్ష విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అవి.. పేపర్‌–1, పేపర్‌–2. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్, హిందీ భాషల్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఒక్కో పేపర్‌కు పరీక్ష సమయం మూడు గంటలు. 

చదవండి: జేఈఈ (మెయిన్స్‌ & అడ్వాన్స్‌డ్‌) | గైడెన్స్ | వీడియోస్

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభతేది: 23.04.2025
  • ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 02.05.2025
  • ఫీజు చెల్లింపునకు చివరితేది: 05.05.2025.
  • అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేది: 18.05.2025.
  • వెబ్‌సైట్‌: https://jeeadv.ac.in
Published date : 26 Dec 2024 03:27PM

Photo Stories