Skip to main content

JEE Main 2024 Exam Instructions : నేటి నుంచి.. జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ప‌రీక్ష‌లు.. విద్యార్థులు ఈ జాగ్ర‌త్త‌లు పాటించాల్సిందే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే పరీక్షల్లో జేఈఈ మెయిన్ ఒక‌టి. జేఈఈ మెయిన్‌ సెషన్‌-2కు ప‌రీక్ష‌లు ఏప్రిల్ 4వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి.
JEE Main Session 2 Exams Instructions 2024     JEE Main Session-2 exam schedule

దేశవ్యాప్తంగా 291 నగరాల్లో, 544 సెంటర్లలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు.

ప‌రీక్ష‌ల టైమింగ్స్ ఇవే..
ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో పేపర్-2 (బీఈ/బీటెక్) పరీక్ష నిర్వహిస్తారు. ఆయా తేదీల్లో  ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండోసెషన్‌లో పరీక్ష నిర్వహిచనున్నారు. ఇక ఏప్రిల్ 12న పేపర్-2ఎ (బీఆర్క్), పేపర్-2బి (బీప్లానింగ్) లేదా పేపర్-2ఎ, 2బి రెండూ రాసే అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒకే సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 

ఇప్పటికే ఏప్రిల్ 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల‌కు..
బీఈ, బీటెక్‌ పరీక్షను జనరల్‌ విద్యార్థులకు 3 గంటలు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు 4 గంటల పాటు జరుగుతుంది. బీఆర్క్‌, బీప్లానింగ్‌ పరీక్షను సాధారణ విద్యార్థులకు మూడున్నర గంటల పాటు నిర్వహించనుండగా, దివ్యాంగ అభ్యర్థులకు నాలుగు గంటల 10 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే ఏప్రిల్ 4, 5, 6న పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల అడ్మిట్‌కార్డులను ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మిగతా వారి అడ్మిట్‌కార్డులను త్వరలోనే విడుదల చేయనుంది.

జేఈఈ మెయిన్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్‌ఐటీలు, ఐఐటీలు, ఇతర జాతీయ విద్యాసంస్థల్లో యూజీ కోర్సు్లో (బీఈ/బీటెక్) ప్రవేశాల కోసం పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌‌డ్ కోసం కూడా దీన్నే అర్హత పరీక్షగా పరిగణిస్తారు. ఇక బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పేపర్-2 పరీక్ష నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్-2024 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మలయాళం, కన్నడ, మరాఠి, ఒడియా, తమిళం, తెలుగు, ఉర్దూ, పంజాబీ భాషల్లో పరీక్ష ఉంటుంది. బీఈ, బీటెక్‌, బీఆర్క్‌, ఇతర కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. వీరిలో మంచి స్కోర్‌ సాధించిన 2.5 లక్షల మంది విద్యార్థులకు ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

జేఈఈ మెయిన్ పరీక్షలకు ఈ ఏడాది 12 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 2.4 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తెలంగాణలో 11 కేంద్రాల్లో పరీక్షలు నిర్వ హించనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్‌లో పరీక్షలు జరుగనున్నాయి. ఇక ఏపీలోని ప్రధాన నగరాల్లో 30 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. 

జేఈఈ మెయిన్ పరీక్షకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులకు సూచ‌న‌లు ఇవే..

☛  జేఈఈ మెయిన్ పరీక్షకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు.. చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్‌ బాక్స్‌, హ్యాండ్‌ బ్యాగ్‌, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్‌ మెటీరియల్‌, వాటర్‌ బాటిళ్లు, మొబైల్‌ఫోన్‌/ఇయర్‌ ఫోన్‌/మైక్రోఫోన్‌/పేజర్‌, కాలిక్యులేటర్‌‌, కెమెరా, టేప్‌ రికార్డర్‌ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్‌ ఉన్న దుస్తులు వేసుకోరాదు. వీటితో పాటు హ్యాండ్‌ బ్యాగ్‌లు, పర్సులు, నగలు, మెటాలిక్‌ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం. చాక్లెట్లు/క్యాండీ/శాండ్‌విచ్‌ వంటి ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించరు.

☛  విద్యార్థులు పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డుతోపాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ ఐడీ కార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అడ్మిట్‌ కార్డుతోపాటు అవసరమైన పత్రాలన్నీ (సెల్ఫ్‌ డిక్లరేషన్, అండర్‌ టేకింగ్‌ ఫాం) దగ్గర ఉంచుకోవాలని ఎన్‌టీఏ సూచించింది. 

పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను తెలిపే ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసుపుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
పరీక్ష కేంద్రానికి పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. 
☛ మీరు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్‌ చేసిన ఫొటోను ఎగ్జామ్‌ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఎందుకంటే దాన్ని అటెండెన్స్‌ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది. విద్యార్థులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్‌ పెన్‌ను తీసుకెళ్లాలి.
☛ దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమవెంట మెడికల్‌ ఆఫీసర్‌ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లాలి. 
☛ పైవాటితో పాటు ట్రాన్స్‌పరెంట్‌ వాటర్‌ బాటిల్‌ను తీసుకెళ్లొచ్చు. మధుమేహంతో బాధపడే విద్యార్థులైతే షుగర్‌ టాబ్లెట్స్‌/పండ్లు (అరటిపండు/యాపిల్‌/ఆరంజ్‌) వంటివి తీసుకెళ్లే అవకాశం కల్పించారు.
☛ పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొనేలా ప్లాన్‌ చేసుకోండి. అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి. పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని అన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.

☛ పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్‌ షీట్లపైనే కాలిక్యులేషన్లు /రైటింగ్‌ వర్కు చేయాల్సి ఉంటుంది. 
ఆ తర్వాత రఫ్‌ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
 ☛  వాటర్‌ బాటిల్స్, హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులు, బాల్‌ పాయింట్‌ పెన్నులను అనుమతిస్తారు.
 

Published date : 04 Apr 2024 12:11PM

Photo Stories