JEE Mains 2025 Session-2 Application Process: జేఈఈ మెయిన్స్ సెషన్-కు అప్లై చేశారా? ఇదే చివరి తేది
Sakshi Education
జేఈఈ మెయిన్స్ 2025కు అప్లై చేయారా? రిజిస్ట్రేషన్ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు జేఈఈ-మెయిన్స్ సెషన్-2కు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని NTA తెలిపింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in.లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దేశ వ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రన్స్ టెస్ట్‌ను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.
JEE Mains 2025 Session-2 Application Process
జేఈఈ మెయిన్స్ సెషన్-2: ఏప్రిల్ 1 నుంచి 8, 2025 వరకు జరగనుంది.
అవసరమైన డాక్యుమెంట్స్:
👉 ఇమెయిల్ & మొబైల్ నంబర్
👉 10వ తరగతి సర్టిఫికేట్
👉 ఆధార్ కార్డు వివరాలు
👉 స్కాన్ చేసిన ఫోటో & సంతకం
👉 OBC-NCL/EWS సర్టిఫికేట్ వివరాలు
జేఈఈ మెయిన్ సెషన్ 2 2025కు దరఖాస్తు ఎలా చేయాలి?
ఎలా అప్లై చేసుకోవాలంటే (How to register for JEE Mains 2025):
అధికారిక వెబ్‌సైట్ www.jeemain.nta.nic.in సందర్శించండి.
రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
లాగిన్ అయి, సంబంధిత వివరాలతో అప్లికేషన్ ఫారం నింపండి.
ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయండి.
అప్లికేషన్ ఫీజు చెల్లించి, కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేసుకోండి.
విష్యత్ అవసరాల కోసం రిజిస్ట్రేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ లేదా ప్రింట్ అవుట్ తీసుకోండి.
NEET UG 2025 Registration Last Date Last date to register for NEET UG 2025 NEET UG 2025 Registration last date NEET UG 2025 registration deadline March 6 NEET UG 2025 apply online at neet.nta.nic.in