Skip to main content

JEE Mains 2025 Expected Cutoff: జేఈఈ మెయిన్స్‌ కటాఫ్‌ ఈసారి పెరిగే ఛాన్స్‌.. ఎన్ని మార్కులు రావాలంటే..

దేశంలోని ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు అర్హత కోసం  జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ పరీక్షలను నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెషన్‌-1 పరీక్షలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఎనిమిదో తేదీ వరకు రెండో సెషన్‌ పరీక్షలు జరగనున్నాయి. జేఈఈ అడ్వాన్డ్స్‌ పరీక్షకు అర్హత సాధించాలంటే, జేఈఈ మెయిన్స్‌లో సాధించిన ఉత్తీర్ణతనే పరిగణనలోకి తీసుకుంటారు
JEE Advanced qualification criteria    JEE Mains 2025  exam updates  JEE Mains 2025 Expected Cutoff   JEE Mains exam schedule announcement
JEE Mains 2025 Expected Cutoff

జేఈఈ మెయిన్స్‌ పేపర్ 1లో పొందిన స్కోర్ ఆధారంగానే దేశవ్యాప్తంగా ఉన్న నిట్, ట్రిపుల్ ఐటీ, ఇతర కేంద్ర విద్యా సంస్థల్లో బీఈ లేదా బీటెక్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు అవ‌కాశం లభిస్తుంది. అలాగే, పేపర్ 2 ద్వారా బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో అడ్మిషన్ పొందొచ్చు. 


జేఈఈ మెయిన్స్‌- 2025 కటాఫ్‌ ఈసారి ఎలా  ఉండబోతోందనే అంశాన్ని నిపుణలు ఇలా అంచనా వేస్తున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి కటాఫ్‌ పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.జేఈఈ మెయిన్ కటాఫ్ జనరల్ కేటగిరీకి 90-130 ఉండనుంది. ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి 45-75, ఈడబ్ల్యూఎస్ 55-80, ఎస్సీలకు 35-45, ఎస్టీలకు 28-38 వరకు ఉంటుందని అంచనా. 

 

Category 2023 Percentile 2024 Percentile 2025 Expected Marks
OPEN (General) 90.77 93.25 90-130
EWS 76.62 81.32 55-80
OBC-NCL 72.41 79.67 45-75
SC 51.97 60.00 35-45
ST 37.33 46.60 28-38

Expected JEE Mains Marks for NIT Admission 

Category Good NITs (Top-Ranked NITs) Moderate NITs
OPEN (General) 170-220 150-170
EWS 160-175 135-160
OBC-NCL 150-170 130-150
SC 100-110 85-100
ST 80-90 60-80

JEE Main 2023 cutoff

టాప్‌ NITల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే..

  • టాప్‌  NITల్లో అడ్మిషన్స్‌ పొందాలంటే..జనరల్ (General) కేటగిరికి చెందిన విద్యార్థులకు  170+ మార్కులు రావాల్సి ఉంది. 150-170 మార్కులతో మోస్తారు  NITల్లో అవకాశం ఉంది.
  • EWS కేటగిరికి చెందిన విద్యార్థులు  160+ మార్కులు వస్తే టాప్‌ NITల్లో అడ్మిషన్స్‌ పొందొచ్చు. 135-160 మార్కులతో మోస్తరు NITల్లో అడ్మిషన్ పొందవచ్చు
  • OBC-NCL విద్యార్థులు 150+ మార్కులు సాధిస్తే టాప్ NITల్లో ప్రవేశం పొందవచ్చు, 130+ మార్కులతో మోస్తరు NITల్లో అవకాశం ఉంటుంది.
  • SC కేటగిరికి చెందిన విద్యార్థులు 100+ మార్కులు సాధిస్తే టాప్ NITల్లో ప్రవేశం పొందవచ్చు, 85-100 మార్కులతో మోస్తరు NITల్లో అవకాశం ఉంటుంది.
  • ST కేటగిరికి చెందిన విద్యార్థులు 80-90 మార్కులు ఉంటే టాప్ NITల్లో ప్రవేశం పొందే అవకాశం, 60-80 మార్కులతో మోస్తరు NITల్లో అడ్మిషన్ పొందవచ్చు.

JEE Mains 2025: Expected Percentiles 

Expected Percentile For Easy Paper Moderate Tough
99 216 185 160
98 192 161 140
97 176 144 126
96 164 133 115
95 155 123 107
90 120 90 77
80 77 60 50
70 60 45 35
60 50 35 30
50 40 30 25

JEE Mains 2025: expected marks in Physics, Chemistry, and Mathematics for various percentiles

Percentile Physics Chemistry Mathematics
100 95 90 70
99 90 75 60
98 80 65 55
97 76 60 50
96 73 55 45
95 70 50 40

Published date : 04 Feb 2025 08:26AM

Photo Stories