Skip to main content

JEE Advanced 2025: ఈ సంవత్సరం తర్వాత పుట్టినవారికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌.. అర్హత నిబంధనలు విడుదల చేసిన ఐఐటీ కాన్పూర్‌ ..

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 పరీక్షకు 2000 సంవత్సరం తర్వాత పుట్టినవారే అర్హులని ఈసారి ఈ పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ కాన్పూర్‌ ప్రకటించింది.
JEE Advanced 2025 revises guidelines

ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 1995 సంవత్సరం తర్వాత జన్మించి ఉండాలని తెలిపింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2025 పరీక్షకు సంబంధించిన అర్హత నిబంధనలను ఐఐటీ కాన్పూర్‌ న‌వంబ‌ర్‌ 6న విడుదల చేసింది. కేటగిరీలవారీగా ఎంత మంది అభ్యర్థులను ఎంపికచేసే విషయాన్ని కూడా వెల్లడించింది. అయితే ఈ పరీక్ష తేదీలను ప్రకటించలేదు.

చదవండి: JEE Mains 2025 Schedule: జేఈఈ మెయిన్స్‌–2025 షెడ్యూల్‌ విడుదల.. సెక్షన్‌–బీలో చాయిస్‌ ఎత్తివేత
ఓపెన్‌ కేటగిరీలో ఈసారి 1,01,250 మందికి అర్హత కల్పించాలని నిర్ణయించింది. ఏటా జేఈఈ మెయిన్స్‌ 11 లక్షల మంది వరకు రాస్తుంటారు. వీరిలో మెరిట్‌ ఆధారంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌ డ్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు. ఇందులో సాధించే ర్యాంకుల ఆధారంగా ఐఐటీల్లో సీట్లు కేటాయిస్తారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

అడ్వాన్స్‌డ్‌ ద్వారా సీట్లు పొందని, జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులున్న వారికి ఎన్‌ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలు, ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు లభిస్తాయి. ఇప్పటికే జేఈఈ మెయిన్స్‌ తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించింది.

 

చదవండి: JEE Main 2025: NTA కీలక ప్రకటన.. జేఈఈ నోటిఫికేషన్‌!.. సిలబస్‌ కుదింపుపై తర్జనభర్జన!
వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 30 వరకు తొలి దశ, ఏప్రిల్‌ 1–8 వరకు రెండో దశ పరీక్షలు నిర్వహిస్తారు. రెండో విడత పరీక్ష తర్వాత వారం రోజుల్లో మెయిన్స్‌ ర్యాంకులు వెల్లడిస్తారు. దీన్నిబ ట్టి ఏప్రిల్‌ ఆఖరి వారం లేదా మే మొదటి వారంలో అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించే వీలుంది. 3 పర్యాయాలు అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అవకాశం కల్పించారు.  

కేటగిరీల వారీగా ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్య

కేటగిరీ

అభ్యర్థుల సంఖ్య

ఓపెన్‌ (96,187)

 

ఓపెన్‌ – పర్సన్‌ విత్‌ డిసేబుల్డ్‌ (పీడబ్ల్యూడీ) (5,063)

1,01,250

జనరల్‌ – ఎకనమికల్లీ వీకర్‌ సెక్షన్‌
(ఈడబ్ల్యూఎస్‌) (23,750)

 

జనరల్‌ – ఈడబ్ల్యూఎస్‌ – పీడబ్ల్యూడీ (1,250)

25,000

ఓబీసీ – నాన్‌ క్రీమీలేయర్‌ (ఎన్‌సీఎల్‌) (64,125)

 

ఓబీసీ – ఎన్‌సీఎల్‌ – పీడబ్ల్యూడీ (3,375)

67,500

ఎస్సీ (35,625), ఎస్సీ – పీడబ్ల్యూడీ (1,875)

37,500

ఎస్టీ (17,812), ఎస్టీ – పీడబ్ల్యూడీ (939)

18,750

Published date : 07 Nov 2024 11:42AM

Photo Stories