JEE Main ( Session 2 ) 2025 Rules :జేఈఈ మెయిన్స్ (సెషన్ 2) 2025 నిబంధనలు

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్–2025 రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్ట్‌లలో పేపర్–1 (బీఈ, బీటెక్) పరీక్షలు జరుగుతాయి. 9 వ తేదీ ఉదయం పేపర్–2 ఎ బీఆర్క్ పరీక్ష, పేపర్ – 2బి ప్లానింగ్ పరీక్షలు జరుగుతాయి.
జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ మాదిరిగానే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఈ ఆన్‌లైన్ పరీక్షలు జరుగుతాయి. అభ్యర్థుల పరీక్ష కేంద్రం వివరాలను (సిటీ ఇంటిమేషన్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంచింది. పరీక్షలకు మూడు రోజుల ముందు అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎన్‌టీఏ నిబంధనలను అనుసరించాల్సి ఉంటుంది. వీటిని అడ్మిట్ కార్డుల్లో ఎన్‌టీఏ పొందుపరిచింది. వాటిని విద్యార్థులు క్షుణ్ణంగా చదువుకొని, ఆ మేరకు ముందుగానే సిద్ధమవ్వాలి.
ఇదీ చదవండి: జేఈఈ మెయిన్ సెషన్ 2 సిటీ ఇన్టిమేషన్ స్లిప్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
మెయిన్స్–2 పరీక్ష రాసే విద్యార్థులకు ఇవీ సూచనలు
» పేపర్–1 ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండో షిఫ్ట్‌లో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు జరుగుతుంది. ఉదయం షిఫ్ట్‌లో పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు ఒంటి గంటకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని ఎన్‌టీఏ సూచించింది.
» పరీక్ష సమయానికి 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
» పరీక్ష సమయానికి అర గంట ముందు వరకే విద్యార్థులను అనుమతిస్తారు. ఆ తరువాత ప్రధాన గేట్లను మూసివేస్తారు.
» పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు సాధారణ వ్రస్తాలను మాత్రమే ధరించాలి.
» బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను తెచ్చుకోవాలి.
» ఆభరణాలు, వాచీలు ధరించ కూడదు. కాళ్లకు బూట్లకు బదులుగా సాధారణ చెప్పులనే ధరించాలి.
» ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్‌ను మాత్రమే అనుమతిస్తారు.
» దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఆధార్, పాన్ తదితర ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులను విధిగా తీసుకెళ్లాలి.
» ఎన్‌టీఏ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన ఒక బాక్సులో కలర్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేసిన ఫొటోనే ఇక్కడ అతికించాలి. పక్కన ఉండే మరొక బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలిముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్ష కేంద్రంలోకి వెళ్లిన తరువాత ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయాలి.
» విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్‌పై అతికించేందుకు మరొక పాస్‌పోర్ట్ సైజు ఫోటోను వెంట తెచ్చుకోవాలి.
» ప్రతి విద్యార్థికి బయోమెట్రిక్ హాజరు నమోదు చేస్తారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- JEE Main Session 2
- jee main session 2 exam 2025
- april 2025
- Sakshi Education News
- Education News
- jee main session 2 2025 alert
- JEE Main Session 2 2025 rules
- JEE Main 2025 guidelines
- JEE Main Session 2 exam pattern
- JEE Main 2025 eligibility criteria
- JEE Main 2025 registration process
- Important documents for JEE Main 2025
- JEE Main Session 2 exam day instructions
- JEE Main 2025 dos and don'ts
- JEEExamSchedule
- PlanningExam2025
- JEEAprilSession
- NTANotification