Skip to main content

Tips for JEE Main 2025 : జేఈఈ మెయిన్స్ విద్యార్థుల‌కు టాప్ 5 టిప్స్‌.. ఇవి పాటిస్తే ర్యాంక్ మీదే..

ఇంజినీరింగ్‌, ఐఐటీ ప్ర‌వేశాల‌కు ఏటా ఎన్‌టీఏ నిర్వ‌హించే ప‌రీక్ష‌ జేఈఈ మెయిన్స్‌.. అయితే, జ‌న‌వ‌రి 22 నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.
Top 5 tips for jee main exam 2025  JEE Mains exam tips for success  study tips for JEE Mains candidates     JEE Mains exam schedule for 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: ఇంజినీరింగ్‌, ఐఐటీ ప్ర‌వేశాల‌కు ఏటా ఎన్‌టీఏ నిర్వ‌హించే ప‌రీక్ష‌ జేఈఈ మెయిన్స్‌.. అయితే, జ‌న‌వ‌రి 22 నుంచి 31వ తేదీ వ‌ర‌కు జ‌రిగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప‌రీక్ష‌లు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ప‌రీక్ష‌కు సిద్ధ‌మ‌య్యే స‌మ‌యంలో ఎంత భ‌యం ఆందోళ‌న‌కు గుర‌వుతారో, ప‌రీక్ష‌ను రాసే స‌మ‌యంలో అంత‌క‌న్నా ఎక్క‌వే భ‌యం ఉంటుంది. అందుకే, విద్యార్థులు ఈ టిప్స్‌ను ప‌రీక్ష‌ను రాసే స‌మ‌యంలో త‌ప్పనిస‌రిగా పాటించాల్సిందే...

JEE 2025 Exams:ఈ నెల 22 నుంచి 30 వరకు జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌–2025 మొదటి సెషన్‌ పరీక్షలు

1. మాక్ టెస్ట్‌: ప‌రీక్ష‌కు ముందు ఉన్న గ‌డువును స‌రిగ్గా వినియోగించుకోవాలి. ఎంత ప్ర‌తీ రెండు రోజుల‌కు ఒక‌సారి మాక్ టెస్ట్‌లు రాస్తూ ఉండాలి. ఈ టెస్ట్‌ల‌తో మీరు ఎంత క‌రెక్ట్‌గా ఉన్నారో తెలుస్తుంది. మీరు చేసే త‌ప్పులు, ఒప్పులు, ఎక్క‌డ స‌రి చేసుకోవాలో అనే ఆలోచ‌న ఒస్తుంది. ప‌రీక్ష రాసే స‌మ‌యంలో మీ మాక్ టెస్ట్‌లో చేసే త‌ప్పులు చేయకుండా ఉంటారు. అంతేకాదు, ఈ టెస్ట్‌తో మీరు ఎంత స‌మ‌యం తీసుకుంటున్నారు అని కూడా తెలుస్తుంది. ప‌రీక్ష రాసేట‌ప్పుడు స‌మ‌యపాల‌న చాలా ముఖ్యం. ఇచ్చిన గ‌డువులో ఎంత త్వ‌ర‌గా రాస్తారో తెలుస్తుంది.

2. క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ప‌రిశీల‌న‌: ప‌రీక్ష స‌మ‌యంలో క్వ‌శ్చ‌న్ పేప‌ర్ ఇచ్చిన వెంట‌నే రాసేయోద్దు. మొద‌లు, పేప‌ర్‌ను ప‌రిశీలించండి. మీకు సులువుగా అనిపించిన ప్ర‌శ్న‌ల‌కు మొద‌లు స‌మాధానం రాయండి. ఎప్పుడూ క‌ష్ట‌మైన ప్ర‌శ్న‌ల‌తో ప్రారంభించొద్దు. సులువు ప్ర‌శ్న‌ల‌తో ప్రారంభిస్తే మీ ఆత్వ విశ్వాసం పెరుగుతుంది. ప్రశ్నకు సమాధానం డౌట్‌గా ఉంటే దాన్ని స్కిప్‌ చేయండి. కచ్చితంగా సమాధానం ఇవ్వాలని అనిపిస్తే ఎలిమినేషన్‌ ప్రాసెస్‌ చేపట్టండి. ఒక్కో ఆప్షన్‌ని తొలగిస్తూ రండి.

JEE Main Exam Centers : జేఈఈ ప‌రీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల ఆవేద‌న‌.. ప్ర‌భుత్వం స్పందించాల‌ని త‌ల్లిదండ్రుల విన్న‌పం.. కార‌ణం ఇదే..

3. పాత పేప‌ర్‌లు: ప్రిప‌రేష‌న్‌లో భాగంగా విద్యార్థులు మాక్ టెస్ట్‌లు చేప‌ట్టాలి. అంతేకాకుండా, పాత ప్ర‌శ్నా ప‌త్రాల‌ను కూడా ప‌రిశీలిస్తూ ఉండాలి. వాటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. అందులోంచి ప్ర‌శ్న‌లు రావ‌డం కాని, లేదా అంత‌కంటే ఎక్కువ మీకు పేప‌ర్ విధానం అర్థం అవుతుంది. మీరు పేప‌ర్ రాసే స‌మ‌యంలో సులువ అవుతుంది.

4. స‌మ‌య పాల‌న‌: ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలోనే విద్యార్థులు మాక్ టెస్టులు తీసుకోవాలి. ఇక్క‌డ వారు ప్రాక్టీస్ చేసే విధానం బట్టి ప‌రీక్ష స‌మ‌యంలో ఎలా ఉంటుందో ఒక అంచనా ఉంటుంది. ప‌రీక్షలో స‌మ‌య పాల‌న పాటించ‌డం త‌ప్ప‌నిస‌రి. అక్క‌డ ఒక్క నిమిషం ఆల‌స్య‌మైనా మీ ఫ‌లితాల‌పై ప్ర‌భావం ఉంటుంది. అందుకే, ప్ర‌తీ ప్ర‌శ్న‌కు మీరు ఎంత స‌మ‌యం కేటాయిస్తున్నారో మాక్ టెస్ట్‌ల‌తోనే తెలుసుకోవ‌చ్చు. ఎన్డీఏ వెబ్‌సైట్‌లో మాక్‌ టెస్టులు అందుబాటులో ఉంటాయి.

5. దూరంగా: గెస్‌ మార్కులకు ఎంతదూరంగా ఉంటే అంత మంచిది. ప‌రీక్షలు పూర్తి చేసుకునే వ‌ర‌కు విద్యార్థులు కొన్ని స‌ర‌దాల‌కు దూరంగా ఉండాలి. వారి సెల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు వీడియో గేమ్స్ వంటివి ఎంత దూరంగా ఉంటే అంత మంచింది. చిరుతిళ్ల‌కు కూడా దూరంగా ఉండ‌డం ఉత్త‌మం. ప‌రీక్ష‌కు ద‌గ్గ‌ర‌వుతున్న స‌మ‌యంలో ఆరోగ్యాన్ని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 20 Jan 2025 10:57AM

Photo Stories