JEE Mains 2025 Essential Strategies And Tips: జేఈఈ మెయిన్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా? పరీక్షలో టాప్ 10 ర్యాంకు సాధించడానికి ముఖ్యమైన టిప్స్
పరీక్ష వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి
మీ గదిలోనే నిజంగానే పరీక్ష రాస్తున్నట్లు వాతావరణాన్ని క్రియేట్ చేసుకోండి. మూలు టెస్ట్‌లా కాకుండా మెయిన్ ఎగ్జామ్‌లా భావించి ప్లాన్ చేయండి. ఒక టైమర్ సెట్ చేసుకొని పరీక్ష రాయండి. ఇది ఎగ్జామ్‌పై మీకున్న భయాన్ని పోగొట్టేందుకు సహాయపడుతుంది. మీ సమయపాలన, వేగం, దృష్టి వంటివాటిపై ఒక స్పష్టత వస్తుంది. దీంతో పరీక్ష సమయంలో జాగ్రత్తలు పాటించవచ్చు.
మీ పనితీరు విశ్లేషించండి
మాక్ టెస్టులు లేదా పాత పరీక్ష పేపర్లను పూర్తి చేసిన తర్వాత, మీ ఫలితాలను విశ్లేషించుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఏ సెక్షన్‌లో మీకు ప్రశ్నలు కష్టంగా అనిపిస్తున్నాయి? ఎంత సమయంలో మీరు వాటిని పరిష్కరిస్తున్నారు అనే విషయాలు తెలుస్తాయి. ఇలా ప్రతి సెక్షన్, సబ్జెక్ట్ నుంచి వచ్చే ప్రశ్నలను విశ్లేషించుకోవడం వల్ల ఓవరాల్ స్కోర్ పెంచుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవచ్చు.
Job Mela: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టెన్త్ అర్హతతో ఉద్యోగాలు, రేపే జాబ్‌మేళా
మీ బలహీనతలను గుర్తించండి
వీలైనన్ని ఎక్కువగా మాక్ టెస్టులు రాయండి. దీనివల్ల ఏ విభాగం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి? ఎంత టైం తీసుకుంటున్నారు? వంటి పలు సందేహాలపై అవగాహన వస్తుంది. దానికి తగ్గట్లు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవచ్చు.
టైం మేనేజ్‌మెంట్
ఇది మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మెరుగవుతుంది. ముఖ్యంగా మాక్ టెస్టులను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏ ప్రశ్నకు ఎంత సమయం తీసుకుంటున్నారన్నది అర్థమవుతుంది. ప్రాక్టీస్ ప్రారంభించిన తరువాత, సమయానుసారం వేగం కూడా పెరగాలి. మొదట్లో 10 నిమిషాలు పట్టే ప్రశ్నకు మీ వేగంతో 5 నిమిషాలకు చేరాలి. వేగం పెరగాలేకాని తగ్గకూడదు. ఆ విధంగా ప్లానింగ్ చేసుకోండి.
తరుచుగా అడిగే ప్రశ్నలపై దృష్టి పెట్టండి
గతంలో వచ్చిన పేపర్లను ప్రాక్టీస్ చేయడం వల్ల తరుచుగా ఏ ప్రశ్నలను ఎక్కువగా అడుగుతున్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి ఆ ప్రశ్నలపై మరింత శ్రద్ధ పెట్టొచ్చు. ఒకే ప్రశ్నను ఫార్మాట్ మార్చి ఎంత డిఫరెంట్‌గా అడుగుతున్నారన్నది గుర్తించండి. ట్ మరియు విషయాలను గుర్తించండి. ఈ ప్రశ్నలపై ఎక్కువ శ్రద్ధ పెట్టండి, ఇది మీ స్కోర్ పెంచడంలో సహాయపడుతుంది.
44,228 Postal GDS Merit List Released: పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాల ఫలితాలు విడుదల.. మెరిట్ లిస్ట్ కోసం క్లిక్ చేయండి
స్ట్రీటజీనీ మెరుగుపర్చుకోండి
మాక్ టెస్టులు రాయడం వల్ల మీ ఎగ్జామ్ స్ట్రాటజీని మరింత అంచనా వేసుకోవచ్చు. ప్రశ్నలు ఏ ఆర్టర్‌లో చేయాలో, వేటికి ఎంత సమయం కేటాయించాలి అనే వ్యూహాలను అనుసరించొచ్చు.
సబ్జెక్టుకు అనుగుణంగా మార్గాలు
ప్రతీ సబ్జెక్టుకు ప్రత్యేక అవసరాలు ఉంటాయి. వాటికి అనుగుణంగా మీరు కొత్త మార్గాలను అభివృద్ధి చేయాలి.
రివిజన్ ప్లానింగ్
పరీక్ష దగ్గర పడుతున్న సమయంలో సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేయడం తప్పనిసరి. ఇక్కడ, కీలకమైన అంశాలు, ఫార్ములాలు వంటివి మరోసారి రివైజ్ చేయగలం.
ప్రతీ రోజు సమీక్ష తప్పనిసరి
మీరు చదివిన, రాసిన, మాక్ టెస్టులు, వేగం పరిశీలనకు వారం వారం సమీక్ష ఇవ్వాలి. దీంతో మీ వేగం పెంచడం, తగ్గించడంపై స్పష్టత వస్తుంది. ఇది మీకు మరో అడుగులో సహాయపడుతుంది.
Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలివే..
మీపై మీకు నమ్మకం ఉండాలి
ప్రతి మాక్‌టెస్ట్‌లో మీ సాల్వింగ్ స్కిల్స్, ప్రశ్నల తీరును అర్థం తీసుకోవడం వల్ల మీపై మీకు మరింత నమ్మకం పెరుగుతుంది. ఏదైనా కాన్ఫిడెంట్‌గా ఉండటం ముఖ్యం. పాజిటివ్ ఆలోచనలతో ఉంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా ఈజీ అవుతుంది.
జేఈఈ మెయిన్స్–2025 షెడ్యూల్ ఇలా..
తొలి దశ మెయిన్స్...
28–10–2024 నుంచి 22–11–2024 ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
22–1–2025 నుంచి 31–1–2025 మెయిన్స్ పరీక్ష
12–2–2025 - ఫలితాల ప్రకటన
రెండో దశ మెయిన్స్
31–1–2025 నుంచి 24–2–2025 దరఖాస్తుల స్వీకరణ
1–4–2025 నుంచి 8–4–2025 మెయిన్స్ పరీక్ష
17–4–2025 - ఫలితాల ప్రకటన
Tags
- jee mains 2025 preparation method
- jee main 2025 exam preparation schedule
- daily routine and study preparation
- JEEMains2025
- NTAExams
- National Testing Agency Notification
- JEE Mains January 2025 schedule
- JEE Main 2025 Notification
- JEE Main 2025 Notification Released
- jee mains preparation
- daily routine for jee mains preparation
- jee mains preparation planning
- JEE Main 2025 Exam Latest News
- JEE Main 2025 Trending News
- National Testing Agency updates
- JEE2025
- JEE2025Preparation
- JEE2025Schedule
- JEEExams
- JEEExamSchedule
- JEEMainsDates
- JEE Main 2025 Exam Dates
- JEE Mains January 2025 schedule