Skip to main content

44,228 Postal GDS Merit List Released: పోస్టల్‌ జీడీఎస్‌ ఉద్యోగాల ఫలితాలు విడుదల.. మెరిట్‌ లిస్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పోస్టల్‌ శాఖలోని జీడీఎస్‌ పోస్టుల ఫలితాలు ఎట్టకేలకు వచ్చేశాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అధికారులు ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలను చెక్‌ చేసుకోవచ్చు.
44,228 Postal GDS Merit List Released
44,228 Postal GDS Merit List Released

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలోని బ్రాంచ్‌ పోస్ట్ ఆఫీసుల్లో 44,228 జీడీఎస్‌ పోస్టులను భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. వీటిల్లో ఆంధ్రప్రదేశ్‌లో 1355 పోస్టులుండగా, తెలంగాణలో 981 పోస్టులున్నాయి. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మెరిట్ లిస్ట్ ప్రకారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తపాలా శాఖ సమాచారం అందిస్తుంది.

Job Mela: రేపు జాబ్‌మేళా.. కావల్సిన అర్హతలివే..

దరఖాస్తులో అభ్యర్థి ఇచ్చిన‌ మొబైల్‌ నంబర్‌కు ఎస్‌ఎంఎస్‌, మెయిల్, పోస్టు ద్వారా సమాచారం వస్తుంది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సిస్టమ్‌ జనరేటెడ్‌ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేశారు.ఆ వివరాలను https://indiapostgdsonline.gov.in/ అనే లింక్‌ క్లిక్‌ చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థులు నవంబర్‌ 27లోగా సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.ఎంపికైన అభ్యర్థులు బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.  

Free DSC Coaching: ఉచితంగా డీఎస్సీ శిక్షణ.. చివరి తేదీ ఇదే

వేతనాలు

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం)పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.12,000–రూ.29,380 వేత­నం అందుతుంది. అలాగే అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌/డాక్‌ సేవక్‌గా నియమితులైన వారికి నెల­కు రూ.10,000–రూ.24,470 వేతనం లభిస్తుంది. 
వీటితో పాటు ఇండియన్‌ పోస్టల్‌ పేమెంట్స్‌ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్‌ రూపంలోప్రోత్సాహకం అందిస్తారు. స్వల్పమొత్తంలో హెచ్‌ఆర్‌ఏ కూడా దక్కుతుంది. వీరు రోజూవారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్‌/కంప్యూటర్‌/స్మార్ట్‌ఫోన్‌ లాంటివి పోస్టల్‌శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి.

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు కావాల్సిన ప‌త్రాలు ఇవే..

☛➤ పుట్టిన తేదీ ధ్రువీకరణ సంబంధించి పదో తరగతి మార్కుల మెమో 
☛➤ 6వ త‌ర‌గ‌తి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు 
☛➤ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన ఆన్‌లైన్‌ అప్లికేషన్‌
☛➤ దివ్యాంగులైతే దివ్యాంగ ధ్రువీకరణ పత్రం, మెడికల్‌ సర్టిఫికెట్‌
☛➤  అభ్యర్థి పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు 
☛➤  ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌,  కుల ధ్రువీకరణ పత్రం,  ఆధార్‌ కార్డు , ఆదాయ ధ్రువీకరణపత్రం

ఏపీ జీడీఎస్‌ 4వ మెరిట్‌ లిస్ట్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి


Andhra Pradesh GDS 4th Merit List PDF

Published date : 13 Nov 2024 01:14PM
PDF

Photo Stories