Skip to main content

12,828 Postal Jobs : పది పాసైతే చాలు.. పోస్టల్‌లో ఉద్యోగం.. పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల్లో ఉద్యోగాల భ‌ర్తీకి తపాలా శాఖ భారీ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది.
India Post Office Recruitment 12828 Special Cycle
India Post Office Recruitment 2023

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 12,828 గ్రామీణ డాక్ సేవక్(GDS) ఉద్యోగాల‌ను భర్తీ చేయనున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 118, తెలంగాణలో 96 పోస్టులు ఉన్నాయి.

అర్హ‌త‌లు ఇవే..
టెన్త్‌లో సాధించిన మార్కుల ఆదారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. అలాగే రిజర్వేషన్లు ఆధారంగా కూడా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పదవ తరగతిలో మ్యాథ్స్, ఇంగ్లీష్, స్థానిక భాష తప్పనిసరిగా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్‌ తొక్కడం రావాలి. అభ్యర్థులు జూన్‌ 11, 2023 నాటికి 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంది.

➤ 4374 Post in BARC Recruitment 2023: అర్హతలు, ఎంపిక విధానం ఇలా‌..

ఈ పోస్టుకు ఎంపికైతే..
ఈ ఉద్యోగంకు ఎంపికైనవారు బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(ఏబీపీఎం) హోదాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 

జీతం : 
☛ బీపీఎం పోస్టులకు నెలకు వేతనం రూ.12,000 - రూ.29,380 ఉంటుంది.
☛ ఏబీపీఎం పోస్టులకు రూ.10,000 - రూ.24,470 చొప్పున చెల్లిస్తారు.

➤ SSC CHSL Notification 2023: కేంద్రంలో 1600 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

చేయాల్సిన ప‌నులు ఇవే..

India Post Office Recruitment 2023, 12828 Special Cycle

బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌(BPM) :
➤ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్‌ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. 
➤ పోస్టల్‌ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్‌ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. 
➤ రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్‌ లావాదేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్‌ వ్యవహారాలూ చక్కబెట్టాలి. టీమ్‌లీడర్‌గా సంబంధిత బ్రాంచ్‌ను నడిపించాలి. పోస్టల్‌ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంటుంది.

చ‌ద‌వండి: UPSC CMS Preparation Tips: కేంద్రంలో 1261 పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, పరీక్షలో విజయానికి మార్గాలు..

అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌(ABPM) :
➤ అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టుమాస్టర్ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ విక్రయాలు, ఉత్తరాల పంపిణీ జరిగేలా చూడాలి.
➤ ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలను చక్కబెట్టాల్సి ఉంటుంది. బ్రాంచ్‌ పోస్టుమాస్టర్‌ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. 
➤ వివిధ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వంటి కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది.

➤ Railway Jobs: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, బిలాస్‌పూర్‌లో 548 అప్రెంటిస్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

ద‌ర‌ఖాస్తు ప్రారంభ తేదీ : మే 22, 2023 తేదీ నుంచి..
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ : జూన్ 11, 2023 వ‌ర‌కు

దరఖాస్తు ఫీజు : రూ.100/- (SC,ST,PH,TG లకు లేదు)

పూర్తి వివ‌రాలు వెబ్‌సైట్ : https://indiapostgdsonline.gov.in/

రాష్ట్రాల వారిగా పోస్టుల వివ‌రాలు ఇవే..

Published date : 22 May 2023 07:21PM
PDF

Photo Stories