4374 Post in BARC Recruitment 2023: అర్హతలు, ఎంపిక విధానం ఇలా..
డైరెక్ట్ రిక్రూట్‌మెంట్- 212 పోస్టులు
- ఈ విధానంలో మొత్తం 212 పోస్టులను భర్తీ చేస్తారు. వీటిల్లో విభాగాల వారీగా చూస్తే.. టెక్నికల్ ఆఫీసర్(సి)-181, సైంటిఫిక్ అసిస్టెంట్ (బి)-07, టెక్నిషియన్(బి) 24 పోస్టులున్నాయి.
- అర్హతలు: టెక్నికల్ ఆఫీసర్-సి పోస్టులకు ఎమ్మెస్సీ, ఎం.లిబ్, బీఈ/బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సైంటిఫిక్ అసిస్టెంట్-బి: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో బీఎస్సీ(ఫుడ్ టెక్నాలజీ/హోమ్ సైన్స్/న్యూట్రిషన్) ఉత్తీర్ణులై ఉండాలి.
- టెక్నీషియన్-బి: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు పదోతరగతి ఉత్తీర్ణులవ్వాలి. సెకండ్ క్లాస్ బాయిలర్ అటెండెన్స్ సర్టిఫికేట్ ఉండాలి.
ట్రైనింగ్ స్కీమ్- 4162 పోస్టులు
- ట్రైనింగ్ స్కీమ్(స్టైపెండరీ ట్రైనీ) ద్వారా మొత్తం 4162 పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. వీటిల్లో కేటగిరీ-1లో 1216 పోస్టులు, కేటగిరీ-2లో 2946 పోస్టులున్నాయి.
- కేటగిరీ-1లో.. బయో కెమిస్ట్రీ/బయోసైన్స్/లైఫ్‌సైన్స్/బయాలజీ విభాగాల్లో 21, కెమిస్ట్రీ-169, ఫిజిక్స్-117, కంప్యూటర్‌సైన్స్-25, అగ్రికల్చర్-02, హార్టికల్చర్-06, కెమికల్-171, ఎలక్ట్రికల్-144, ఎలక్ట్రానిక్స్-98, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ -59, మెకానికల్-328, మెటలర్జీ-05, ఆర్కిటెక్చర్-02, సివిల్-62, ఆటోమొబైల్ -04, ఇండస్ట్రియల్ సేఫ్టీ 03 పోస్టులున్నాయి.
- కేటగిరీ-2లో.. ఫిట్టర్-698, టర్నర్/మెషినిస్ట్-213, వెల్డర్-99, మెకానిక్ మెషీన్ టూల్స్ మెయింటెన్స్-18, ఎలక్ట్రీషియన్-399, ఎలక్ట్రానిక్ మెకానిక్-266, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-152, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్-95, డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానికల్)-52, డ్రాఫ్ట్స్‌మ్యాన్(సివిల్)-15, మేషన్-30, ప్లంబర్-42, కార్పెంటర్-27, మెకానిక్ మోటార్ వెహికిల్-24, డీజిల్ మెకానిక్-19, ప్లాంట్ ఆపరేటర్-532, ల్యాబొరేటరీ-303, డెంటల్ టెక్నీషియన్-ౖహె జీనిస్ట్-1, డెంటల్ టెక్నీషియన్-మెకానిక్-01 ఉన్నాయి.
చదవండి: 4374 Jobs in BARC Recruitment: పోస్టుల పూర్తి వివరాలు ఇవే..
అర్హతలు: ల్యాబొరేటరీ, డెంటల్ టెక్నీషియన్-హైజీనిస్ట్, డెంటల్ టెక్నీషియన్ -మెకానిక్ పోస్టులు తప్ప.. మిగతా అన్నింటికీ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో పదోతరగతి 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. సంబంధిత విభాగాల్లో ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి.
వేతనాలు: కేటగిరీ-1 పోస్టులకు నెలకు రూ. 24,000 నుంచి రూ.26,000 స్టైపెండ్ చెల్లిస్తారు. కేటగిరీ-2 పోస్టులకు స్టైపెండ్ నెలకు రూ. 20,000 నుంచి రూ.22000 వరకూ ఉంటుంది.
ల్యాబరేటరీ-303 పోస్టులు
ఈ పోస్టులకు ఇంటర్మీడియెట్(ఫిజిక్స్, కెమిస్ట్రీ మ్యాథ్స్ సబ్జెక్టులతో) 60శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. డెంటల్ టెక్నీషియన్-ౖహె జీనిస్ట్-1 పోస్టుకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ 60శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. డెంటల్ టెక్నీషియన్-మెకానిక్-1 పోస్టుకు ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టుతో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండేళ్ల డిప్లొమా ఉండాలి.
వయసు
టెక్నికల్ ఆఫీసర్‌కు 18-35 ఏళ్లు; సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 18-22 ఏళ్లు; టెక్నీషియన్‌కు 18-25 ఏళ్లు; స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ-1కు 19-24, కేటగిరీ-2కు 18-22 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఓబీసీలకు,ఎక్స్ సర్వీస్‌మెన్ మూడేళ్ల,ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ఇలా
- ఆయా పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్ట్, అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
- టెక్నికల్ ఆఫీసర్-సి పోస్టుకు ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎక్కువమంది దరఖాస్తు చేసినట్లయితే.. ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు.
- సైంటిఫిక్ అసిస్టెంట్ -బి: కేటగిరీ-1 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులకు గంట వ్యవధిలో కంప్యూటర్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. 40 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ప్రశ్నపత్రాన్ని డిప్లొమా/బీఎస్సీ సిలబస్ ఆధారంగా రూపొందిస్తారు. స్క్రీనింగ్ టెస్ట్‌లో అర్హత సాధించినవాళ్లను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. అభ్యర్థుల తుది ఎంపిక ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగానే ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్‌లో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
- టెక్నీషియన్-బి, కేటగిరీ-2 స్టైపెండరీ ట్రెయినీ పోస్టులకు మూడు దశల్లో జరిగే పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టేజ్-1లో ప్రిలిమినరీ టెస్ట్, స్టేజ్-2లో అడ్వాన్స్‌డ్ టెస్ట్, స్టేజ్-3లో స్కిల్ టెస్ట్ ఉంటాయి.
- స్టేజ్-1 ప్రిలిమినరీ టెస్ట్: ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌ను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. మ్యాథ్స్-20, సైన్స్-20, జనరల్ అవేర్‌నెస్-10 నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. ఇందులో ప్రతిభ చూపిన వాళ్లను స్టేజ్-2లోని అడ్వాన్స్‌డ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
- స్టేజ్-2 అడ్వాన్స్‌డ్ టెస్ట్: ఈ పరీక్షలో 50 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానానికి 3 మార్కులు, ప్రతి తప్పు జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్టును తయారు చేస్తారు.
- స్టేజ్-3 స్కిల్ టెస్ట్: స్టేజ్-2లో ప్రతిభ చూపిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి.. స్కిల్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- దరఖాస్తులకు చివరి తేదీ: 22.05.2023
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అమరావతి, గుంటూరు, హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ, విశాఖపట్నం.
- వెబ్‌సైట్: https://barconlineexam.com/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | May 22,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |