Skip to main content

UPSC CDS Notification 2024: డిగ్రీ అర్హతతో 484 పోస్టులు.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

బ్యాచిలర్‌ డిగ్రీతో దేశ భద్రతలో కీలకమైన త్రివిధ దళాల్లో అడుగుపెట్టే అద్భుత అవకాశం! యూపీఎస్సీ తాజాగా కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (సీడీఎస్‌ఈ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 457 పోస్టులకు ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. ఇందులో విజయం సాధిస్తే.. భద్రతా దళాల్లో ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది. ఈ నేపథ్యంలో.. సీడీఎస్‌ఈ(1)–2024 పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్‌ అంశాలు, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
Aspiring candidate for UPSC CDSE   Opportunity to join crucial security forces  CDSE notification for defense services  Bachelor's degree holder excited about UPSC CDSE upsc cds notification 2024 and exam pattern and syllabus and preparation tips
  • సీడీఎస్‌ (1)–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసిన యూపీఎస్సీ
  • త్రివిధ దళాల్లో మొత్తం 457 పోస్ట్‌లు భర్తీకి ఎంపిక ప్రక్రియ
  • బ్యాచిలర్‌ డిగ్రీ, బీటెక్‌ అర్హతలతో పోటీ పడే అవకాశం
  • ఎంపికైతే శిక్షణ సమయంలోనే నెలకు రూ.56,100 స్టయిఫండ్‌

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌.. త్రివిధ దళాల్లోని నాలుగు విభాగాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి నిర్వహించే పరీక్ష. ఈ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ ప్రతి ఏటా రెండుసార్లు నిర్వహిస్తుంది. తాజాగా 2024 సంవత్సరానికి సంబంధించి  సీడీఎస్‌ఈ(1)–2024కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

మొత్తం పోస్టులు 457
సీడీఎస్‌ఈ (1)–2024 ద్వారా త్రివిధ దళాలకు చెందిన నాలుగు అకాడమీల్లోని అయిదు విభాగాల్లో 457 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఇందులో ఇండియన్‌ మిలటరీ అకాడమీ(డెహ్రాడూన్‌): 100 పోస్టు­లు, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ(ఎజిమలా): 32 పోస్టులు, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ(హైదరాబాద్‌): 32 పోస్టులు, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(పురుషులు): 275 పోస్టులు, ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ(చెన్నై)(మహిళలు): 18 పోస్టులు ఉన్నాయి.

చదవండి: UPSC Job Notification: యూపీఎస్సీలో 78 గ్రేడ్‌-3 స్పెషలిస్ట్‌ పోస్టులు.. చివ‌రి తేదీ ఇదే..

అర్హతలు

  • సీడీఎస్‌ఈకి ఆయా అకాడమీల ఆధారంగా వేర్వేరు అర్హతలను పేర్కొన్నారు. అన్ని అకాడమీలకు అవివాహిత పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థులు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మాత్రమే అర్హులు. 
  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
    వయసు: జనవరి 2, 2001 – జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
  • నేవల్‌ అకాడమీ: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్‌/బీఈ ఉత్తీర్ణత ఉండాలి. వయసు: జనవరి 2, 2001 – జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
  • ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 10+2 స్థాయిలో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ చదివుండాలి.
    వయసు: 2025, జనవరి 1 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. డీజీసీఏ జారీచేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కలిగి ఉన్నవారికి రెండేళ్ల సడలింపు లభిస్తుంది. 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ: అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
    వయసు: జనవరి 2, 2000 – జనవరి 1, 2006 మధ్య జన్మించి ఉండాలి.
  • చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. ఇప్పటి వరకు పూర్తయిన పరీక్షల్లో ఎలాంటి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టులు ఉండకూడదు.

రెండు దశల్లో ఎంపిక
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ద్వారా త్రివిధ దళాల్లో ఆఫీసర్‌ కేడర్‌ పోస్ట్‌ల భర్తీకి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. మొదట యూపీఎస్‌సీ.. సీడీఎస్‌ రాత పరీక్ష నిర్వహిస్తుంది. ఇందులో నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించి మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి.. మలిదశలో ఆయా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌లు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి.

చదవండి: UPSC Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(1), 2024 నోటిఫికేషన్‌ విడుదల

రాత పరీక్ష విధానం

  • సీడీఎస్‌ఈ రాత పరీక్ష రెండు విధాలుగా ఉంటుంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ అభ్యర్థులకు 300 మార్కులకు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ అభ్యర్థులకు 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రాత పరీక్షలో నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కు కోత విధిస్తారు. 
  • ఇండియన్‌ మిలటరీ, నేవల్, ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ పరీక్షలో.. ఇంగ్లిష్‌ వంద మార్కులకు (పరీక్ష సమయం 2గంటలు), జనరల్‌ నాలెడ్జ్‌ వంద మార్కులకు (పరీక్ష సమయం 2గంటలు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ (పరీక్ష సమయం 2గంటలు) ఉంటాయి. 
  • ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ పరీక్షలో.. ఇంగ్లిష్‌ వంద మార్కులకు (పరీక్ష సమయం 2గంటలు), జనరల్‌ నాలెడ్జ్‌ వంద మార్కులకు (పరీక్ష సమయం 2 గంటలు) ఉంటాయి.

 
ఎస్‌ఎస్‌బీ ఎంపిక ప్రక్రియ
రాత పరీక్షలో విజయం సాధించిన వారికి మలిదశలో ఆయా సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. దీనికి కేటాయించిన మార్కులు 300. ఈ ఎంపిక ప్రక్రియలో భాగంగా పలు రకాల పరీక్షలు, చివరగా పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. వీటి ద్వారా ఆఫీసర్‌ ఉద్యోగాలకు సరిపోయే నైపుణ్యాలున్న అభ్యర్థులను ఖరారు చేస్తారు. స్టేజ్‌–1లో స్క్రీనింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తే స్టేజ్‌–2కు అనుమతిస్తారు. స్టేజ్‌–1లో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌) టెస్ట్‌లు, స్టేజ్‌–2లో సైకాలజీ టెస్ట్‌లు, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్కులు, ఇంటర్వ్యూలు, కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. తర్వాత వర్డ్‌ అసోసియేషన్‌ టెస్ట్‌ (డబ్ల్యూఏటీ), సిట్యుయేషన్‌ రియాక్షన్‌ టెస్ట్‌ (ఎస్‌ఆర్‌టీ)ల ద్వారా విద్యార్థుల సమయస్ఫూర్తిని పరీక్షిస్తారు. చివరగా సెల్ఫ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌(ఎస్‌డీ)లో.. అభ్యర్థి తన కుటుంబం, స్నేహితులు, కాలేజీ, ఉపాధ్యాయుల గురించి రాయాలి. ఈ టెస్టుల తర్వాత రెండు రోజుల పాటు 9 రకాల గ్రూప్‌ టాస్క్‌లు నిర్వహిస్తారు.

చివరగా ఇంటర్వ్యూ
సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ ఎంపిక ప్రక్రియలో ఫిజికల్‌ టెస్ట్‌లు పూర్తయ్యాక చివరగా..బోర్డ్‌ ప్రెసిడెంట్‌ లేదా సీనియర్‌ సభ్యుడి ఆధ్వర్యంలో పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.చివరగా కాన్ఫరెన్స్‌ ఉంటుంది. ప్యానెల్‌ ముందు అభ్యర్థులు వేర్వేరుగా హాజరవ్వాలి. ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ వారికి పీఏబీటీ ఉంటుంది. వీటిలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్‌ లిస్ట్‌ రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సాధించుకు­న్న విద్యార్థులకు మరోసారి శారీరక, వైద్య పరీక్షలు నిర్వహించి.. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ టెస్టుల్లో ప్రతిభ ఆధారంగా ఫైనల్‌ మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు.

శిక్షణ.. స్టయిఫండ్‌

  • అన్ని దశల ఎంపిక ప్రక్రియలో విజయం సాధించి ఆయా విభాగాల్లో శిక్షణకు ఎంపికైన వారిని జెంటిల్‌మెన్‌ క్యాడెట్, లేడీ క్యాడెట్స్‌గా పిలుస్తారు. ఇలా శిక్షణ సమయంలో వీరికి నెలకు రూ.56,100 స్టైపెండ్‌ అందిస్తారు.
  • ఇండియన్‌ మిలటరీ అకాడమీ (డెహ్రాడూన్‌)లో 18 నెలలు; నేవల్‌ అకాడమీలో సుమారు 17 నెలలు; ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో 18 నెలలు; ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో 11 నెలలు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయ్యాక త్రివిధ దళాల్లో లెఫ్ట్‌నెంట్‌ హోదాలో ప్రవేశించవచ్చు. నేవీలో మాత్రం ప్రారంభంలో సబ్‌–లెఫ్ట్‌నెంట్‌ హోదా లభిస్తుంది. ఎయిర్‌ఫోర్స్‌లో శిక్షణ పొందిన వారు ప్రారంభంలో ఫ్లయింగ్‌ ఆఫీసర్‌గా విధులు చేపడతారు. ఇలా ఆయా హోదాల్లో ఆయా విభాగాల్లో అడుగుపెట్టిన వారు కొన్ని నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు.

చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 2024, జనవరి 9
  • దరఖాస్తు సవరణ: 2024 జనవరి 10–16
  • రాత పరీక్ష తేదీ: 2024, ఏప్రిల్‌ 21
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, అనంతపురం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
  • వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/, https://www.upsc.gov.in/

మెరుగైన స్కోర్‌ సాధించేలా
ఇంగ్లిష్‌
ఈ విభాగంలో ఇంగ్లిష్‌ భాషపై పట్టును, ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరిశీలిస్తారు. యాంటానిమ్స్, సినానిమ్స్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్, ఆర్డరింగ్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, ప్యాసేజ్‌లు, సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, క్టోజ్‌ టెస్టు, ఫిల్‌ అప్స్, అనాలజీస్‌ సెక్షన్ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. సెంటెన్స్‌ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్‌ ద ఎర్రర్స్‌ విభాగాల్లో మార్కులు సాధించేందుకు గ్రామర్‌ రూల్స్‌ తెలుసుకోవాలి. అలాగే ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ కోసం సాధ్యమైనంత ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి.

జనరల్‌ నాలెడ్జ్‌
అభ్యర్థుల్లో సామాజిక అంశాల పట్ల ఉన్న అవగాహనను పరీక్షించే విభాగమిది. ఇందులో కరెంట్‌ అఫైర్స్, జాగ్రఫీ, హిస్టరీ, ఇండియన్‌ పాలిటీ, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ తదితర అన్ని సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. డిఫెన్స్‌ కు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు, ప్రా­ముఖ్యం ఉన్న అంశాలు,అవార్డులు, జాయింట్‌ మిలిటరీ ఎక్సర్‌సైజెస్‌–అందులో పాల్గొన్న దేశా­లు, ఆయా ఉమ్మడి సైనిక విన్యాసాల పేర్లు మొదలైన వాటిని తెలుసుకోవడం మేలు. కరెంట్‌ అఫైర్స్‌ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్నారు.

ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌
ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీకి మినహా మిగతా పోస్టులకు మ్యాథమెటిక్స్‌ విభాగం ఉంటుంది. మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున ఉంటుంది. పదో తరగతి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి. టైమ్‌ అండ్‌ డిస్టెన్స్, స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రాబబిలిటీ, వాల్యూమ్‌ అండ్‌ సర్ఫేస్‌ ఏరియా, లీనియర్‌ అండ్‌ క్వాడ్రటిక్‌ ఈక్వేషన్స్, ట్రిగనోమెట్రీ, ఫ్యాక్టరైజేషన్‌ తదితర చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 09,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories