Skip to main content

6,329 Teaching & Non-Teaching Posts: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులు.. రాత పరీక్షలో రాణించేలా

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువు కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని..ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో.. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో 5,660 టీజీటీ పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రత్యేకత, భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..
6,329 teaching & non-teaching posts in govt schools
  • టీచింగ్,నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో 6,329 కొలువులు
  • టీజీటీ హోదాలో మొత్తం 5,660 పోస్ట్‌లు
  • కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సంస్థలు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం 740 పాఠశాలలు ఉండగా.. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 28, తెలంగాణలో 23 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు.. పూర్తిగా గురుకుల విధానంలో విద్యాబోధన సాగుతోంది. 

మొత్తం 6,329 పోస్ట్‌లు

తాజా నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) 5,660 పోస్ట్‌లు, నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ల విభాగంలో 669 హాస్టల్‌ వార్డెన్‌ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడతారు.

చ‌ద‌వండి: TS TET Notification 2023: తెలంగాణ టెట్‌–2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు..

వేతనాలు

  • టీజీటీ(తృతీయ భాష) వేతన శ్రేణి–రూ.44,900–రూ.1,42,400. 
  • టీజీటీ(ఇతర విభాగాలు) వేతన శ్రేణి–రూ.35,400–రూ.1,12,400. 
  • హాస్టల్‌ వార్డెన్స్‌ వేతన శ్రేణి రూ.29,200–రూ,92,300.

అర్హతలు

  • అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న సబ్జెక్ట్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీలో బీఈడీ పాసై ఉండాలి. 
  • థర్డ్‌ లాంగ్వేజ్‌ పోస్ట్‌ల అభ్యర్థులు మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీలో సదరు భాషను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా మూడేళ్ల పాటు చదివుండాలి. –సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • ఎన్‌సీటీఈ నిర్వహించే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి బీఈడీ అర్హత నిబంధన అవసరం ఉండదు.
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యూజిక్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఆర్ట్‌ టీచర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌/క్రాఫ్ట్‌లో ఉత్తీర్ణత లేదా రీజనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో బీఈడీ పాసవ్వాలి.
  • టీజీటీ–పీఈటీ: బీపీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • లైబ్రేరియన్‌: ర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణులవ్వా­లి. లేదా బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా లైబ్రరీ సైన్స్‌లో ఏడాది వ్యవధిలోని డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  • హాస్టల్‌ వార్డెన్‌: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎస్‌సీటీఈ నిర్వహించే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

వయసు

  • అన్ని పోస్ట్‌లకు 18.08.2023 నాటికి వయసు 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌ల భర్తీకి జాతీయ స్థాయిలో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌(ఈఎస్‌ఈఈ)ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

చ‌ద‌వండి: Army Public School Recruitment 2023: ఆర్మీ వేల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీల్లో టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులు..

120 మార్కులకు టీజీటీ పరీక్ష

టీజీటీ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షను నాలుగు విభాగాలుగా మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–2 రీజనింగ్‌ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–3 ఐసీటీ నాలెడ్జ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–4 టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–5 సంబంధిత సబ్జెక్ట్‌ 80 ప్రశ్నలు–80మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. టీజీటీ పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

హాస్టల్‌ వార్డెన్‌ రాత పరీక్ష

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో భర్తీ చేయనున్న హాస్టల్‌ వార్డెన్‌ పోస్ట్‌లకు పత్యేక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆరు విభాగాల్లో 120 మార్కులకు ఉంటుంది. పార్ట్‌–1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–2 రీజనింగ్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలు–20 మార్కులు; పార్ట్‌–3 ఐసీటీ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు–20 మార్కులు; పార్ట్‌–4 పోస్కో, బాలల భద్రతకు సంబంధించిన చట్టాలు 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–5 అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు; పార్ట్‌–6 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ(హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) 30 ప్రశ్నలు–30 మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.

లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌

  • టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు అయిదు విభాగాల్లో పరీక్షతోపాటు.. ప్రత్యేకంగా లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ను 30 మార్కులకు నిర్వహిస్తారు. అ­భ్యర్థులు తాము పరీక్షకు హాజరవుతున్న మాధ్యమానికి సంబంధించిన భాషలో ఈ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలు, హిందీ నుంచి 10 ప్రశ్నలు, ఎంచుకున్న లాంగ్వేజ్‌ నుంచి 10 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. 
  • లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌లో భాగంగా మొత్తం 18 భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశముంది. బెంగాలీ, డోంగ్రి, గారో, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, ఖాసీ, మళయాళం, మణిపురి, మరాఠి, మిజో, నేపాలి, ఒడియా, సంథాలి, తెలుగు, ఉర్దూ బాషల్లో ఏదో ఒక భాషను రీజనల్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.
  • టీజీటీ పోస్ట్‌లకు సంబంధించి లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ను కేవలం అర్హత విభాగంగానే పేర్కొన్నారు. ఇందులో ఇంగ్లిష్, హిందీ, రీజనల్‌ లాంగ్వేజ్‌ మూడు భాషల్లోనూ 40 శాతం మార్కులు చొప్పున పొందాల్సి ఉంటుంది. అప్పుడే మిగతా విభాగాలను మూల్యాంకన చేస్తారు.

నెగెటివ్‌ మార్కులు

టీజీటీతోపాటు హాస్టల్‌ వార్డెన్‌.. ఈ రెండు పరీక్షలు ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా పెన్‌–పేపర్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కు తగ్గిస్తారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18.08.2023
  • ఈఎస్‌ఈఈ పరీక్ష తేదీ: నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://emrs.tribal.gov.in/

చ‌ద‌వండి: 6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా‌..


రాత పరీక్షలో రాణించేలా
జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం స్టాక్‌ జీకేతో పాటు కరెంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన జాతీయ–అంతర్జాతీయ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ తాజా సంస్కరణలు/విధానాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ

పజిల్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, వెర్బల్‌ రీజనింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సీక్వెన్సెస్, సిరీస్, డైరెక్షన్స్, అసెర్షన్‌ అండ్‌ రీజన్, వెన్‌ డయాగ్రమ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగం కోసం టీచింగ్‌ విధానాలు, భావన లు,లక్ష్యాలు, ప్రాథమిక అవసరాలు, అభ్యాసకు ల ధర్మాలు, టీచింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు, టీచింగ్‌ మెథడ్స్, టీచింగ్‌ ఎయిడ్స్, మూల్యాంకన విధానాలపై అవగాహన పెంచుకోవాలి.

ఐసీటీ నాలెడ్జ్‌

ఈ విభాగం కోసం కంప్యూటర్‌ సిస్టమ్‌ ప్రాథమిక భావనలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ బేసిక్స్, ఎంఎస్‌ ఆఫీస్, కీ–బోర్డ్‌ షాట్‌ కర్ట్స్, కంప్యూటర్‌కు సంబంధించిన పదజాలం, అబ్రివేషన్లు, కంప్యూటర్‌ నెటవర్క్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి.

సబ్జెక్ట్‌ మెథడాలజీ

పార్ట్‌–5గా ఉండే డొమైన్‌ నాలెడ్జ్‌లో.. సబ్జెక్ట్‌ మెథడాలజీ నుంచి 65 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో తాము చదివిన సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తే..ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

పెడగాజీపైనా

పార్ట్‌–5లోనే యాక్టివిటీ బేస్డ్‌ పెడగాజీ, కేస్‌ ఆధారిత ప్రశ్నలు 10 అడుగుతారు. అభ్యర్థులు.. విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. ముఖ్యంగా నూతన విద్యా విధానం–2020పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

లైబ్రేరియన్‌ రాత పరీక్ష

లైబ్రేరియన్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షలో రాణించేందుకు.. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ఫౌండేషన్, నాలెడ్జ్‌ ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బేసిక్స్, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్స్‌/ ఇన్‌స్టిట్యూషన్స్, ఇన్ఫర్మేషన్‌ సోర్సెస్, సర్వీసెస్, లైబ్రరీ యూజర్స్‌కు సంబంధించి అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

Qualification GRADUATE
Last Date August 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories