Skip to main content

6329 TGT and Hostel Warden Posts: ఏకలవ్య పాఠశాలల్లో 6329 పోస్టులు.. పరీక్ష విధానం ఇలా‌..

దేశవ్యాప్తంగా నేషనల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ ఫర్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌(నెస్ట్స్‌).. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల(ఈఎంఆర్‌ఎస్‌)లో డైరెక్ట్‌ ప్రాతిపదికన టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
EMRS Recruitment 2023

మొత్తం పోస్టుల సంఖ్య: 6329
పోస్టుల వివరాలు: ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)-5660, హాస్టల్‌ వార్డెన్‌(పురుషులు)-335, హాస్టల్‌ వార్డెన్‌(మహిళలు)-334.
సబ్జెక్టులు: హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సోషల్‌ స్టడీస్, సైన్స్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, తెలుగు, ఉర్దూ, మిజో, సంస్కృతం, సంతాలి, మ్యూజిక్, ఆర్ట్, పీటీటీ(మేల్‌), పీఈటీ(ఫిమేల్‌), లైబ్రేరియన్‌.
అర్హత: టీజీటీ ఖాళీలకు సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈడీతో పాటు సీటెట్‌ ఉత్తీర్ణులై ఉండాలి. టీజీటీ పీఈటీ పోస్టులకు డిగ్రీ, బీపీఈడీ, టీజీటీ లైబ్రేరియన్‌ పోస్టులకు డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18.08.2023 నాటికి 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు టీజీటీ ఉద్యోగాలకు రూ.44,900 నుంచి 1,42,400; రూ.35,400 నుంచి రూ.1,12,400, హాస్టల్‌ వార్డెన్‌కు రూ.29,200 నుంచి రూ.92,300.

ఎంపిక విధానం: ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌-2023, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: ఓఎంఆర్‌ ఆధారిత(పెన్‌ పేపర్‌) విధానంలో ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతారు. టీజీటీ రాతపరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు), లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్టుకు 30 మార్కులు(30 ప్రశ్నలు) కేటాయించారు. హాస్టల్‌ వార్డెన్‌ రాత పరీక్షకు 120 మార్కులు(120 ప్రశ్నలు) కేటాయించారు. టీజీటీ పరీక్షకు మూడు గంటలు, హాస్టల్‌ వార్డెన్‌ పరీక్షకు రెండున్నర గంటల వ్యవధి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.08.2023

వెబ్‌సైట్‌:  http://emrs.tribal.gov.in/

చ‌ద‌వండి: MANIT Bhopal Recruitment 2023: మానిట్, భోపాల్‌లో 127 ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 18,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories