Skip to main content

NCL Recruitment 2024: ఎన్‌సీఎల్‌లో 150 ట్రైనీ సూపర్‌వైజర్‌ పోస్టులు.. రాత పరీక్ష, ప్రిపరేషన్‌ ఇలా..

ప్రభుత్వరంగ సంస్థ.. నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌సీఎల్‌) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా 150 ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టులకు భర్తీ చేయనుంది. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
150 Trainee Supervisory Positions Available   Written Test Selection Process    apply Online for NCL Trainee Supervisory Posts  Trainee Supervisor Jobs at NCL Written Exam Preparation Tips   Northern Coalfields Limited Job Advertisement

పోస్టులు– అర్హతలు

  • అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (ఈ అండ్‌ టీ) ట్రైనీ (గ్రేడ్‌–సి)–9  పోస్టులు. అర్హత: మూడేళ్ల మెట్రిక్యులేషన్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా పాసవ్వాలి.
  • అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (మెకానికల్‌) ట్రైనీ (గ్రేడ్‌–సి)–59. అర్హత: మెట్రిక్యులేషన్, మూడేళ్ల మెకానికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా పూర్తిచేయాలి.
  • అసిస్టెంట్‌ ఫోర్‌మ్యాన్‌ (ఎలక్ట్రికల్‌) ట్రైనీ (గ్రేడ్‌–సి)–82. అర్హత: మెట్రిక్యులేషన్, మూడేళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.
  • డిగ్రీ /పీజీ /డిప్లొమాలను దూరవిద్య /పార్ట్‌ టైమ్‌ ద్వారా పూర్తిచేసినవారు దరఖాస్తు చేయడానికి అనర్హులు. 
  • వయసు: 18–30 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌కు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీలకు 10–15 ఏళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం
ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) విధానంలో నిర్వహించే రాత పరీక్ష, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పోస్టులను అనుసరించి పరీక్షలను వేర్వేరుగా నిర్వహిస్తారు.

రాత పరీక్ష ఇలా

  • ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. రెండు సెక్షన్‌లుగా ప్రశ్నపత్రం ఇస్తారు.
  • పరీక్ష సమయం 90 నిమిషాలు.
  • సెక్షన్‌–ఎ: ఈ విభాగంలో టెక్నికల్‌ పరిజ్ఞానానికి సంబంధించిన 70ప్రశ్నలుంటాయి.
  • సెక్షన్‌–బి: ఇందులో జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లకు సంబంధించిన 30 ప్ర­శ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఉంటుంది.రుణాత్మక మార్కులు లేవు.  
  • ప్రశ్నపత్రం ఇంగ్లిష్,హిందీ భాషల్లో ఉంటుంది. 

అర్హత మార్కులు
అన్‌రిజర్వ్‌డ్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్షలో 50 మార్కులు, ఎస్సీ/ఎస్టీ/ఈఎస్‌ఎం/ఓబీసీ/పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 40శాతం కనీస అర్హత మార్కులుగా సాధించాల్సి ఉంటుంది.

ప్రిపరేషన్‌ ఇలా

  • సెక్షన్‌–ఎ నుంచి 70 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. ఈ ప్రశ్నలన్నీ కూడా సంబంధిత సబ్జెక్టు అంశాల నుంచే ఉంటాయి. కాబట్టి అభ్యర్థులు ఆయా సబ్జెక్టులను రివిజన్‌ చేసుకోవాలి. 
  • సెక్షన్‌–బికి సంబంధించి జనరల్‌ అవేర్‌నెస్, రీజనింగ్, వెర్బల్‌ మెంటల్‌ ఎబిలిటీ అండ్‌ క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ కోసం వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి.
  • పరీక్ష సన్నద్ధతలో భాగంగా వీలైనన్నీ ఎక్కువ మాక్‌టెస్టులు, ప్రాక్టీస్‌ టెస్టులు రాయాలి. దీనివల్ల ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో తెలుస్తుంది.

ముఖ్యసమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.02.2024
వెబ్‌సైట్‌: https://www.nclcil.in/

చదవండి: NTPC Recruitment 2024: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date February 05,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories