NTPC Recruitment 2024: 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు.. స్క్రీనింగ్ టెస్ట్‌లో రాణించేలా..
- 223 పోస్ట్‌ల భర్తీకి ఎన్‌టీపీసీ నోటిఫికేషన్
- ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఉద్యోగాలు
- ఎంపికైతే నెలకు రూ.55 వేల వేతనం
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) దేశంలోనే అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థగా గుర్తింపు పొందింది. మహారత్న పీఎస్‌యూ హోదాను సైతం సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా పలు ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పిన ఎన్‌టీపీసీ.. వాటిలో అవసరమైన మానవ వనరుల నియామకానికి నోటిఫికేషన్లు ఇస్తోంది. సాధారణంగా గేట్ స్కోర్ ఆధారంగా ఎంట్రీ లెవల్‌లో ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. తాజాగా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
మొత్తం 223 పోస్ట్‌లు
ఎన్‌టీపీసీ తాజా నోటిఫికేషన్ ద్వారా ఆపరేషన్స్ విభాగంలో 223 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్స్) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఓపెన్ కేటగిరీలో 98 పోస్టులు; ఈడబ్ల్యూఎస్‌లో 22; ఓబీసీ కేటగిరీలో 40; ఎస్‌సీ అభ్యర్థులకు 39; ఎస్‌టీ కేటగిరీలో 24 పోస్ట్‌లు ఉన్నాయి.
చదవండి: NTPC Recruitment 2024: ఎన్‌టీపీసీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
అర్హతలు
- ఎలక్ట్రికల్/మెకానికల్ బ్రాంచ్‌లతో బీటెక్ ఉత్తీర్ణత ఉండాలి. బీటెక్ తర్వాత ఏదైనా పవర్ ప్లాంట్‌లో కనీసం ఏడాది పని అనుభవం తప్పనిసరి.
- వయసు: 2024, ఫిబ్రవరి 8 నాటికి 35 ఏళ్లకు మించకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ వర్గాలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
పని అనుభవం తప్పనిసరి
ఎన్‌టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్ట్‌లకు పని అనుభవం తప్పనిసరి. 100 మెగావాట్లు అంతకంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం ఉన్న పవర్ ప్లాంట్‌లలో.. ఆపరేషన్ లేదా మెయింటనెన్స్ విభాగాల్లో కనీసం ఏడాది పని అనుభవం పొంది ఉండాలని స్పష్టం చేశారు.
మూడేళ్ల వ్యవధి
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్స్(ఆపరేషన్స్) పోస్ట్‌లను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎన్‌టీపీసీ తొలుత మూడేళ్ల కాల వ్యవధికి నియామకాలు ఖరారు చేస్తుంది. ఆ తర్వాత మరో రెండేళ్లు పొడిగించే అవకాశం ఉంది. అంటే.. ఈ పోస్ట్‌లకు ఎంపికైన వారు గరిష్టంగా అయిదేళ్లపాటు ఎన్‌టీపీసీలో పని చేసే వీలుంది.
రూ.55 వేల వేతనం
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్ట్‌లకు ఎంపికైన వారికి నెలకు రూ.55 వేల వేతనం లభిస్తుంది. దీంతోపాటు ఇంటి అద్దె భత్యం, నైట్ షిఫ్ట్ అలవెన్స్, ఉద్యోగికి, అతని కుటుంబానికి వైద్య సదుపాయాలను సైతం అందిస్తారు.
విధులు ఇవే
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ (ఆపరేషన్స్) పోస్ట్‌లలో నియమితులైన వారు.. ఎన్‌టీపీసీకి చెందిన పవర్ స్టేషన్స్, ప్రాజెక్ట్స్‌లలో.. మెయింటనెన్స్, ఆపరేషన్స్ విభాగాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ప్లాంట్ ఆపరేషన్స్ పర్యవేక్షణ, నియంత్రణ; భద్రత, నాణ్యత ప్రక్రియలను నిర్వహించడం, సమస్యలను పరిష్కరించడం, ప్లాంట్ రికార్డ్స్, రిపోర్ట్స్ నిర్వహణ వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
స్క్రీనింగ్ టెస్ట్ ఇలా
నోటిఫికేషన్‌లో మెరిట్ ప్రాతిపదికన నియామకాలు ఖరారు చేస్తామని పేర్కొంటూనే.. తప్పనిసరి అయితే స్క్రీనింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూలను సైతం నిర్వహిస్తామని ఎన్‌టీపీసీ పేర్కొంది. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్‌లో రెండు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. టెక్నికల్ సబ్జెక్ట్ విభాగం నుంచి 120 ప్రశ్నలు; ఆప్టిట్యూడ్ టెస్ట్ విభాగం నుంచి 30 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 150 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. పరీక్షకు లభించే వ్యవధి 2 గంటలు.
పర్సనల్ ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో చోటు సాధించిన వారికి మలిదశలో పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో అభ్యర్థుల పని అనుభవం, అకడమిక్ నేపథ్యం, సబ్జెక్ట్ నాలెడ్జ్ వంటి అంశాలను పరిశీలిస్తారు.
వెయిటేజీ విధానం
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్(ఆపరేషన్స్) పోస్ట్‌లకు అభ్యర్థులను ఖరారు చేసే క్రమంలో.. వెయిటేజీ విధానాన్ని అనుసరిస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులకు 85 శాతం; పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 15 శాతం వెయిటేజీ ఇచ్చి.. దానికి అనుగుణంగా అభ్యర్థులు పొందిన మార్కులతో తుది జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి నియామకాలు ఖరారు చేస్తారు.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: ఫిబ్రవరి 8, 2024
- కాల్ లెటర్స్: మార్చి రెండు లేదా మూడో వారంలో
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://careers.ntpc.co.in/, https://www.ntpc.co.in/
స్క్రీనింగ్ టెస్ట్‌లో రాణించేలా
ఎన్‌టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల గత నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించడం అనివార్యంగా మారుతోంది. కాబట్టి అభ్యర్థులు దరఖాస్తు దశ నుంచే స్క్రీనింగ్ టెస్ట్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సబ్జెక్ట్ వారీగా దృష్టి సారించాల్సిన అంశాలు..
- మెకానికల్ ఇంజనీరింగ్: ఈ విభాగంలో థర్మల్ ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, మెషీన్ డిజైన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్స్ మెషినరీ, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్ అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్: బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ బ్యాటరీస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, డీసీ మెషీన్స్, మెజరింగ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఏసీ మెషిన్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ ఇన్‌స్టాలేషన్ అండ్ ఎస్టిమేషన్, యుటిలైజేషన్ అండ్ ట్రాక్షన్, పవర్ ఎలక్ట్రానిక్స్‌కు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణ అవగాహన పొందాలి.
- ఆప్టిట్యూడ్ టెస్ట్: అప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి జనరల్ అవేర్‌నెస్, రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి.
- జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి గ్రాఫ్స్, డేటా అనాలిసిస్ అంశాలను ప్రాక్టీస్ చేయాలి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో బేసిక్ మ్యాథమెటిక్స్‌తోపాటు,అర్థమెటిక్ అంశాలపై పట్టు సాధించాలి.
- జనరల్ ఇంగ్లిష్, వొకాబ్యులరీలో రాణించేందుకు బేసిక్ గ్రామర్ అంశాలు, రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
అన్వయ దృక్పథం
స్క్రీనింగ్ టెస్ట్‌కు అప్లికేషన్ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్ సాగించాలి. ముఖ్యంగా.. టెక్నికల్ సబ్జెక్ట్ విషయంలో అభ్యర్థులు తమ బ్రాంచ్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లకు బీటెక్ స్థాయి పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం కూడా పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. ప్రిపరేషన్‌ను అప్లికేషన్ అప్రోచ్‌తో సాగిస్తే.. ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. అదే విధంగా ఎన్‌టీపీసీ నిర్వహించిన గత పరీక్షల ప్రశ్న పత్రాలను సాల్వ్ చేయడం, వాటిని మూల్యాంకన చేసుకోవడం పరీక్షలో విజయానికి దోహదం చేస్తుంది.
చదవండి: Railway Latest Notification 2024: ఆర్‌ఆర్‌బీలో 5,696 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | February 08,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- NTPC Recruitment 2024
- PSU Jobs
- Assistant Executive Jobs
- NTPC
- Assistant Executive Jobs at NTPC
- GATE score
- Screening Test
- Personal interview
- Mechanical Engineering
- Electrical Engineering
- Aptitude Test
- Quantitative Aptitude Practice Test
- General English
- National Thermal Power Corporation Ltd
- latest notifications
- latest job notifications 2024
- latest employment notification
- sakshi education latest job notifications