Skip to main content

Navodaya Vidyalaya Samiti Recruitment: నవోదయ విద్యాలయ సమితిలో 1925 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Navodaya Vidyalaya Samiti

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నోయిడా–ఉత్తరప్రదేశ్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి.. దేశవ్యాప్తంగా ఉన్న సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 1925
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ కమిషనర్, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్, ఆడిట్‌ అసిస్టెంట్, జూనియర్‌ ట్రాన్స్‌లేషన్‌ ఆఫీసర్, జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌), స్టెనోగ్రాఫర్స్, కంప్యూటర్‌ ఆపరేటర్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్, మహిళా నర్స్, క్యాటరింగ్‌ అసిస్టెంట్, జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్, ల్యాబ్‌ అటెండెంట్, మెస్‌ హెల్పర్‌ తదితరాలు.

అర్హతలు
అసిస్టెంట్‌ కమిషనర్‌(గ్రూప్స్‌–ఏ): మాస్టర్స్‌ డిగ్రీ హ్యూమానిటీస్‌/సైన్స్‌/కామర్స్‌ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 5ఏళ్లు పని అనుభవం ఉండాలి. 
వయసు: 45ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్‌ కమిషనర్‌(అడ్మిన్‌) (గ్రూప్‌ ఏ): గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 45 ఏళ్లకు మించకూడదు. 

మహిళా స్టాఫ్‌ నర్సు(గ్రూప్‌ బీ): ఇంటర్మీడియట్‌/తత్సమానం/బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 35 ఏళ్లు మించకూడదు.

అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌(గ్రూప్‌ సీ): డిగ్రీ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆడిట్‌ అసిస్టెంట్‌(గ్రూప్‌ సీ): బీకామ్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

జూనియర్‌ ట్రాన్స్‌లేషనల్‌ ఆఫీసర్‌(గ్రూప్‌ బీ): డిప్లొమా/పీజీ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

జూనియర్‌ ఇంజనీర్‌(సివిల్‌) (గ్రూప్‌ సీ): డిప్లొమా/డిగ్రీ(సివిల్‌ ఇంజినీరింగ్‌)ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

స్టెనోగ్రాఫర్‌(గ్రూప్‌ సీ): ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులవ్వాలి. షార్ట్‌హ్యాండ్‌ పరిజ్ఞానం ఉండాలి. 
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి

కంప్యూటర్‌ ఆపరేటర్‌(గ్రూప్‌ సీ): డిగ్రీ/కంప్యూటర్‌ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

క్యాటరింగ్‌ అసిస్టెంట్‌(గ్రూప్‌ సీ): ఇంటర్మీడియట్, డిప్లొమా(కేటరింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(గ్రూప్‌ సీ): సీనియర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. టైప్‌ రైటింగ్‌ నాలెడ్జ్‌ ఉండాలి. 
వయసు: 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి.

ఎలక్ట్రీషియన్‌ కమ్‌ ప్లంబర్‌(గ్రూప్‌ సీ): పదో తరగతి,ఐటీఐ (ఎలక్ట్రీషియన్‌ /వైర్‌మ్యాన్‌/ప్లంబింగ్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

ల్యాబ్‌ అటెండెంట్‌(గ్రూప్‌ సీ): పదో తరగతి/12వ తరగతి(సైన్స్‌), డిప్లొమా (లేబొరేటరీ టెక్నిక్‌) ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

మెస్‌ హెల్పర్‌(గ్రూప్‌ సీ): మెట్రిక్యులేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(గ్రూప్‌ సీ): పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలి. 
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

వయో పరిమితి సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ/దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.

వేతనం: పోస్టును అనుసరించి నెలకు రూ.18,000 నుంచి రూ.2,09,200 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ ), ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 10.02.2022
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: 09.03.2022 నుంచి 11.03.20222

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in

చ‌ద‌వండి: Constable Jobs: ప‌దో త‌ర‌గ‌తి అర్హతతో 2788 కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. నెలకు రూ.69,100 జీతం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 10,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories