Skip to main content

Latest Central Govt Jobs 2024: టెన్త్, ఇంటర్‌తోనే కేంద్ర కొలువు.. రాత పరీక్ష ఇలా..

టెన్త్, ఇంటర్‌ విద్యార్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవాలనుకునే వారికి చక్కటి అవకాశం. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
latest central government jobs after 10th and 12th   Central Government Jobs

సదరన్‌ రీజియన్‌లోని వివిధ విమానాశ్రయాల్లో జూనియర్‌/సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, ల„ý ద్వీప్‌ దీవులకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య: 119
  • ఖాళీల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్‌(ఫైర్‌ స­ర్వీస్‌)–73 పోస్టులు, జూనియర్‌ అసిస్టెంట్‌(ఆఫీస్‌)–02, సీనియర్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రానిక్స్‌)–25, సీనియర్‌ అసిస్టెంట్‌(అకౌంట్స్‌)–19 పోస్టులు.

వయసు
20.12.2023 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలు, ఎక్స్‌–సర్వీస్‌మెన్‌కు 3ఏళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.

అర్హతలు–ఎంపిక విధానం
పోస్టును అనుసరించి విద్యార్హతలు, ఎంపిక విధానాలు వేర్వేరుగా ఉన్నాయి.

చదవండి: Railway Jobs 2024: రైల్వేలో 1646 యాక్ట్‌ అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

జూనియర్‌ అసిస్టెంట్‌ (ఫైర్‌ సర్వీసెస్‌)

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు పదోతరగతితో పాటు మూడేళ్ల రెగ్యులర్‌ మెకానికల్‌/ఆటోమొబైల్‌/ఫైర్‌ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఇంటర్మీడియట్‌పాసవ్వాలి. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ కింద ఈ పోస్టులను ఎక్స్‌–సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు కేటాయించారు. హెవీ వెహికిల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. 
  • రాత పరీక్ష ఇలా.. ఎంపిక ప్రక్రియలో భాగంగా కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(సీబీటీ) నిర్వహిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. పార్ట్‌–1లో 50శాతం ప్రశ్నలు బేసిక్‌ మ్యాథమెటిక్స్, బేసిక్స్‌ సైన్స్, ఎలిమెంటరీ ఇంగ్లిష్‌/గ్రామర్‌ల నుంచి ఉంటాయి. ప్రశ్నపత్రం 10వ తరగతి స్థాయిలో ఉంటుంది. పార్ట్‌–బిలో 50శాతం ప్రశ్నలు జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూ­డ్, ఇంగ్లిష్‌ నుంచి అడుగుతారు. ప్రశ్నలు 10+2 స్థాయిలో ఉంటాయి. స్టేజ్‌–2: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీంట్లో పాసైతే డ్రైవింగ్, ఫిజికల్‌ ఎండ్యురెన్స్‌ టెస్ట్‌లు ఉంటాయి. 

జూనియర్‌ అసిస్టెంట్‌ (ఆఫీస్‌)

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎంపిక ఇలా.. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎంఎస్‌–ఆఫీస్‌లో కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు. 50 శాతం ప్రశ్నలు విద్యార్హతల సబ్జెక్ట్‌లకు సంబంధించినవి ఉంటాయి. జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లో 50శాతం ప్రశ్నలు అడుగుతారు.

సీనియర్‌ అసిస్టెంట్‌(ఎలక్ట్రానిక్స్‌)

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఎలక్ట్రానిక్స్‌/టెలికాం/రేడియో ఇంజనీరింగ్‌ డిప్లొమా, సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
  • రాత పరీక్ష.. కంప్యూటర్‌ ఆధారిత రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఇందులో అకడమిక్‌ సబ్జెక్టుల నుంచి 70శాతం ప్రశ్నలు అడుగుతారు. జనరల్‌ నాలె­డ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ నుంచి 30 శాతం ప్రశ్నలు ఇస్తారు. 

సీనియర్‌ అసిస్టెంట్‌ (అకౌంట్స్‌)

  • ఈ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల ఉద్యోగానుభవం తప్పనిసరి. ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్‌ తయారీ, టాక్సెషన్, ఆడిట్, ఫైనాన్స్, అకౌంట్స్‌ రంగాల్లో పరిజ్ఞానం ఉండాలి.
  • రాత పరీక్ష: ఈ పోస్టుల ఎంపికలో భాగంగా 100 మార్కులకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షను నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. ఎంఎస్‌ ఆఫీస్‌లో కంప్యూటర్‌ లిటరసీ టెస్ట్‌ ఉంటుంది. సీబీటీలో అర్హత సాధించినవారికి కంప్యూట­ర్‌ లిటరసీ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇది అర్హత పరీక్ష మాత్రమే. సీబీటీలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి 70 శాతం ప్రశ్నలు ఇస్తారు. మిగతా 30 శాతం ప్ర­శ్నలు జనరల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ నుంచి అడుగుతారు.

ప్రిపరేషన్‌ ఇలా
70 శాతం ప్రశ్నలు సంబంధిత అకడమిక్‌ సబ్జెక్టుల నుంచే వస్తాయి. కాబట్టి గతంలో చదివిన సబ్జెక్టులపై పట్టు సాధించడానికి ప్రయత్నించాలి. వీలైనన్నీ ఎక్కువ మాక్‌ టెస్టులు రాయాలి. జీకే, జనరల్‌ ఇంటెలిజెన్స్, జనరల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ల కోసం పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయాలి. నెగిటివ్‌ మార్కులు లేవు.

ముఖ్యసమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 26.01.2024
  • వెబ్‌సైట్‌: https://www.aai.aero/

చదవండి: NLC India Limited Recruitment 2024: ఎన్‌ఎల్‌సీలో 632 అప్రెంటిస్‌లు.. పూర్తి వివ‌రాలు ఇవే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date January 26,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories