Skip to main content

RFCL Recruitment 2024: ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో 39 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్‌.. రెగ్యులర్‌ ప్రాతిపదికన నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Career Opportunities in Chemical Industry   Apply Now for Non-Executive Roles at RFCL Ramagundam  RFCL Recruitment 2024 For Non Executive Jobs   RFCL Ramagundam Plant Job Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 39
పోస్టుల వివరాలు: అటెండెంట్‌ గ్రేడ్‌1(మెకానికల్‌)-15,అటెండెంట్‌ గ్రేడ్‌1(ఎలక్ట్రికల్‌)-15, అటెండెంట్‌ గ్రేడ్‌1(ఇన్‌స్ట్రుమెంటేషన్‌)-09.
ట్రేడులు: ఫిట్టర్, డీజిల్‌ మెకానిక్, మెకానిక్‌-హెవీ వెహికల్‌ రిపేర్‌ అండ్‌ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ మెకానిక్‌.
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. ఐటీఐలో జనరల్‌/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు కనీసం 60శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు 55 శాతం మార్కులు సాధించి ఉండాలి.
వయసు: 31.01.2024 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
బేసిక్‌ పే: నెలకు రూ.21,500 నుంచి రూ. 52,000.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, స్కిల్‌(ట్రేడ్‌)టెస్ట్, మెడికల్‌ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, కర్నూలు, నాగ్‌పూర్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 22.02.2024

వెబ్‌సైట్‌: https://www.rfcl.co.in/

చదవండి: NHAI Latest Recruitment 2024: ఎన్‌హెచ్‌ఏఐలో 60 డిప్యూటీ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification 10TH
Last Date February 22,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories