Skip to main content

IB ACIO Notification 2023: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో 995 పోస్టులు.. పరీక్ష విధానం ఇదే..

ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
IB ACIO Notification 2023 for 995 Vacancies   Intelligence Bureau  National Recruitment   Drive for IB Vacancies  Apply Now for Assistant Central Intelligence Officer Positions

మొత్తం పోస్టుల సంఖ్య: 995
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమానం ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 15.12.2023 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400.

ఎంపిక విధానం: టైర్‌–1 రాతపరీక్ష, టైర్‌–2 పరీక్ష, టైర్‌–3/ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

పరీక్ష విధానం: టైర్‌–1 రాతపరీక్ష ఆబ్జెక్టివ్, టైర్‌–2 పరీక్ష డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. టైర్‌–1 పరీక్షలో కరెంట్‌ అఫైర్స్, జనరల్‌ స్టడీస్, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌/లాజికల్‌ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్ష  వ్యవధి ఒక గంట. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. టైర్‌–2 పరీక్షలో ఎస్సే, ఇంగ్లిష్, కాంప్రహెన్షన్, ప్రిసైజ్‌ రైటింగ్‌ ఉంటుంది. 50 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి ఒక గంట. 100 మార్కులతో టైర్‌–3/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 15.12.2023
దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 19.12.2023

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en or https://www.ncs.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాలు.. రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక

Qualification GRADUATE
Last Date December 15,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories