AP Govt Jobs: ఏపీ గ్రామ సచివాలయాల్లో 1,896 ఉద్యోగాలు.. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక
- మొత్తం 1,896 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్
- రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక
- వేతన శ్రేణి రూ.22,460-రూ.72,810
మొత్తం 1,896 పోస్ట్‌లు
ఏపీ గ్రామ సచివాలయాల్లో పశు సంవర్థక సహాయకుల నియామక ప్రకటన ప్రకారం-రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా మొత్తం 1,896 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
డైరీ సైన్స్, డైరీయింగ్, పౌల్ట్రీసైన్స్, వెటరినరీ సైన్స్ అనుబంధ సబ్జెక్ట్‌లలో ఒకేషనల్ ఇంటర్మీడియెట్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి.
చదవండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
వయసు
జూలై 1, 2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ వర్గాలకు అయిదేళ్లు, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ వర్గాలకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఇస్తారు.
ఎంపిక విధానం
యానిమల్ హజ్బెండరీ పోస్ట్‌లకు సంబంధించి తొలుత రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా జిల్లాల వారీగా జాబితా విడుదల చేస్తారు. అనంతరం జిల్లా ఎంపిక కమిటీల ఆధ్వర్యంలో తుది జాబితా రూపొందించి.. నియామకాలు ఖరారు చేస్తారు. జిల్లా ఎంపిక కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు.
వెయిటేజీ మార్కులు
నియామక ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ సర్వీసులో పని చేస్తున్న వారికి వెయిటేజీ మార్కులు కూడా కేటాయించనున్నారు. గోపాల మిత్ర, గోపాలమిత్ర సూపర్‌వైజర్స్, 1962 వెట్స్, ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న వారికి ప్రతి ఆరు నెలల సర్వీసుకు ఒకటిన్నర మార్కులు చొప్పున గరిష్ట్రంగా 15 మార్కులు కేటాయిస్తారు.
చదవండి: Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
రాత పరీక్షకు 150 మార్కులు
యానిమల్ హజ్బెండరీ అసిస్టెంట్ పోస్ట్‌లకు రాత పరీక్షను రెండు విభాగాలుగా మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీపై 50 ప్రశ్నలు-50 మార్కులకు; పార్ట్ బీ యానిమల్ హజ్బెండరీ సంబంధిత సబ్జెక్టుపై 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్, తెలుగు మీడియంలలో ఆబ్జెక్టివ్ విధానంలో బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. నెగెటివ్ మార్కుల నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3వ వంతు తగ్గిస్తారు.
ఆకర్షణీయ వేతనం
రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా..ఆ తర్వాత డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ నిర్వహించే ఎంపిక ప్రక్రియలోనూ మెరిట్ జాబితాలో నిలిచి నియామకం ఖరారు చేసుకుంటే.. ఆకర్షణీయమైన వేతనంతో కొలువు సొంతమవుతుంది. ప్రారంభ వేతన శ్రేణి రూ.22,460-రూ.72,810గా పేర్కొన్నారు.
చదవండి: Groups Preparation Tips: 'కరెంట్ అఫైర్స్'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!
రెండేళ్ల ప్రొబేషన్
ఎంపికైన వారికి రెండేళ్ల ప్రొబేషన్ ఉంటుంది. ఈ సమయంలో నెలకు రూ.15 వేలు చొప్పున వేతనం అందిస్తారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో వేతనం అందుతుంది. ఎంపికైన వారు గ్రామ సచివాలయాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 11, 2023
- ఫీజు చెల్లింపు చివరి తేదీ: డిసెంబర్ 10, 2023
- హాల్ టికెట్ జారీ: డిసెంబర్ 27 నుంచి
- పరీక్ష తేదీ: డిసెంబర్ 31, 2023
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://apaha-recruitment.aptonline.in/
విజయం సాధించేలా
జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ
- అభ్యర్థులకు సామాజిక అంశాలపై ఉన్న అవగాహనను పరిశీలించేలా పార్ట్-ఎలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల కోసం హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై దృష్టి పెట్టాలి.
- హిస్టరీలో రాష్ట్ర చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలపై పట్టు సాధించాలి. ప్రాచీన చరిత్ర మొదలు ఆధునిక చరిత్ర వరకూ.. ముఖ్యమైన అంశాలపై పట్టు పెంచుకోవాలి. జాతీయోద్యమంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర గురించి అధ్యయనం చేయాలి. అదేవిధంగా భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
- జాగ్రఫీలో రాష్ట్రంలోని భౌగోళిక వనరులు, అడవులు, జీవ సంపద, వ్యవసాయ వనరుల గురించి తెలుసుకోవాలి. వీటిని తాజా పరిస్థితులతో అన్వయం చేసుకోవాలి.
- పాలిటీలో రాణించేందుకు రాజనీతి శాస్త్రం, రాజ్యాంగానికి సంబంధించి ప్రాథమిక అంశాలు, భావనలు మొదలు తాజా పరిణామాలు(రాజ్యాంగ సవరణలు, వాటి ప్రభావం) తెలుసుకోవాలి. గవర్నెన్స్, లా, ఎథిక్స్‌కు సంబంధించి సుపరిపాలన దిశగా చేపడుతున్న చర్యలు, పబ్లిక్ సర్వీస్‌లో పాటించాల్సిన విలువలు, ప్రజాసేవలో చూపించాల్సిన నిబద్ధత, అంకిత భావం వంటి విషయాలపైనా అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఎకానమీలో మౌలిక భావనలు మొదలు తాజా వృద్ధి రేట్ల వరకూ.. గణాంక సహిత సమాచారం సేకరించుకుని పరీక్షకు సన్నద్ధం కావాలి. ఇటీవల కాలంలో చేపట్టిన ప్రధాన ఆర్థిక సంస్కరణలు, వాటిద్వారా లబ్ధి చేకూరే వర్గాలు; జాతీయ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తాజాగా తీసుకొచ్చిన విధానాలపై పట్టు సాధించాలి. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లు, ఎకనామిక్ సర్వేలపై అవగాహన పొందాలి.
- సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో టెక్నాలజీ రంగంలో అమలవుతున్న కొత్త విధానాలు, ప్రధాన సంస్థలు, రాష్ట్ర స్థాయిలో ఐసీటీ విధానాలు, ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్, డీఆర్‌డీఓ, ఇంధన వనరులు, విపత్తు నిర్వహణకు అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి. దీంతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలపైనా దృష్టి సారించాలి. అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి జాతీయ, రాష్ట్ర స్థాయిలో అమలు చేస్తున్న చట్టాలు, విధానాలపై అవగాహన పొందాలి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల గురించి అవగాహన ఏర్పరచుకోవాలి.
- మెంటల్ ఎబిలిటీకి సంబంధించి టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా వెర్బల్, నాన్-వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి.
పార్ట్-బి ప్రిపరేషన్ ఇలా
యానిమల్ హజ్బెండరీ సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్నలతో ఉండే పార్ట్-బిలో రాణించేందుకు.. వెటర్నరీ అనాటమీ అండ్ ఫిజియాలజీ, లైవ్ పౌల్ట్రీ డిసీజెస్, వెటర్నరీ ఫార్మసీ, యానిమల్ రీ-ప్రొడక్షన్ అండ్ గైనకాలజీ ఫండమెంటల్స్, కృత్రిమ గర్భధారణ ప్రాథమిక అంశాలు, వెటర్నరీ మెడిసిన్ ఫండమెంటల్స్, వెటర్నరీ బయలాజికల్, వ్యాక్సీన్స్ నిర్వచనం, వెటర్నరీ ఫస్ట్ ఎయిడ్, క్లినికల్ మేనేజ్‌మెంట్, లైవ్‌స్టాక్ ఫీడింగ్ ప్రిన్సిపుల్స్ తదితర అంశాలపై దృష్టి సారించాలి.
Qualification | 12TH |
Last Date | December 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- Andhra Pradesh Animal Husbandry Department
- AP Govt jobs
- state govt jobs
- Animal Husbandry Assistant Jobs
- AP Village Secretariats
- AP AHD Recruitment 2023
- AP Animal Husbandry Assistant Exam Pattern
- Animal Husbandry Assistant Syllabus
- Andhra Pradesh Govt Jobs 2023
- Jobs in Andhra Pradesh
- sakshi education jobs notifications
- andhrapradesh
- GovernmentJobs
- APAnimalHusbandry
- JobOpportunities
- Applications
- Recruitment
- StateJobs
- OpportunityAlert
- Courses
- JobAnnouncement