Groups Preparation 2023: సొంత నోట్సు.. సక్సెస్‌కు రూటు
» గ్రూప్ 1,2,3,4 పరీక్షల గెలుపులో కీలకంగా స్టడీ నోట్స్
» ర్యాపిడ్ రివిజన్‌కు దోహదపడే చక్కటి మార్గం
» స్టడీ నోట్స్ రాసేందుకు పలు పద్ధతులు
» సెల్ఫ్ నోట్స్‌తో ఎంతో మేలంటున్న నిపుణులు
- పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు సొంతంగా స్టడీ నోట్స్ రాసుకుంటే.. పునశ్చరణకు ఉపయుక్తంగా ఉంటుంది. లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కోణంలో ఎంతో విలువైన సమయం ఆదా అవుతుంది.’–స్టడీ నోట్స్ ప్రాధాన్యతపై సబ్జెక్ట్ నిపుణుల అభిప్రాయం ఇది.
- ప్రిపరేషన్ సమయంలో నోట్స్ రాసుకుంటూ అధ్యయనం సాగించాం. దీనివల్ల ఎంతో మేలు జరిగింది. అభ్యర్థులు ఈ విధానాన్ని పాటిస్తే తమ గమ్యం దిశగా అడుగులు వేయొచ్చు’ –ఇవి విజేతలు చెబుతున్న మాటలు.
- పై అభిప్రాయాలను చూస్తే.. స్టడీ నోట్స్ అనేది పోటీ పరీక్షలు, ముఖ్యంగా గ్రూప్స్ విజయంలో ఎంత కీలకమో అర్థం అవుతుంది.
స్టడీ నోట్స్ అంటే
- స్టడీ నోట్స్ లేదా సొంత నోట్స్ అంటే ఏంటి? పోటీ పరీక్షల అభ్యర్థులకు కలిగే మొట్ట మొదటి సందేహం. వాస్తవానికి స్టడీ నోట్స్ అనేది ఏదైనా ఒక పుస్తకం చదివేటప్పుడు ముఖ్యమైన అంశాలను పాయింట్స్ రూపంలో సంక్షిప్తంగా రాసుకోవడంగా చెప్పొచ్చు. వీటిల్లో కాన్సెప్ట్‌లు, నిర్వచనాలు, సమకాలీన అంశాలను జోడించి సినాప్సిస్ రూపంలో షార్ట్ నోట్స్‌లో పొందుపర్చుకుంటారు. దీనివల్ల ఏదైనా ఒక టాపిక్ ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత మళ్లీ దాన్ని చదవాలనుకుంటే.. మొత్తం పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేకుండా.. స్టడీ నోట్స్‌ను చదివితే సరిపోతుంది. ముఖ్యమైన పాయింట్లు ఒకసారి చూసుకుంటే.. మొత్తం విషయమంతా స్ఫురణకు వస్తుంది. దీనివల్ల ఎంతో విలువైన సమయం ఆదా అవుతుందని చెబుతున్నారు.
Also read: TSPSC: గ్రూప్ 2... పేపర్–4లో ఏయే అంశాలు ఉంటాయో తెలుసా..?
క్లాస్ రూమ్ స్టడీ నోట్స్
స్టడీ నోట్స్ రూపొందించుకోవడంలో మరో ముఖ్యమైన విధానం.. క్లాస్ రూమ్ స్టడీ నోట్స్. అంటే.. అభ్యర్థులు ఒక సబ్జెక్ట్‌కు సంబంధించి క్లాస్ రూమ్‌లో లెక్చర్ వింటున్న సమయంలో.. సదరు సబ్జెక్ట్ నిపుణులు ‘ముఖ్యమైనవి’ అని పేర్కొన్న అంశాలను తమ నోట్స్‌లో రాసుకోవడం. సదరు లెక్చరర్.. ఆయా అంశాలకు సంబంధించి గణాంక సహిత బోధన సాగిస్తున్న సమయంలో.. సదరు గణాంకాలను తమకు గుర్తుండే రీతిలో స్టడీ నోట్స్‌లో రాసుకోవచ్చు. పోటీ పరీక్షల కోణంలో క్లాస్ రూమ్ స్టడీ నోట్స్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.
ప్రిపరేషన్ టైమ్‌లో స్టడీ నోట్స్
స్వీయ ప్రిపరేషన్ సాగించే అభ్యర్థులు.. పలు పుస్తకాల ద్వారా సేకరించే సమాచారం స్టడీ నోట్స్‌లో రాసుకోవచ్చు. అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించిన ప్రామాణిక పుస్తకాల్ని చదువుతున్న సమయంలో రన్నింగ్ నోట్సులా స్టడీ నోట్స్‌ను రాసుకోవడం ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. స్టడీ నోట్స్‌లో.. ఆయా టాపిక్‌లకు సంబంధించి నిర్వచనం, ఫార్ములాలు, భావనలు రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read: TSPSC: ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్‌లో ఏయే అంశాలుంటాయో తెలుసా..?
కలరింగ్ మెథడ్
అభ్యర్థులు స్టడీ నోట్స్‌లో ముఖ్యమైన అంశాలను కలర్ పెన్స్ ఉపయోగించి హైలైట్ చేసుకోవాలి. ఫలితంగా రివిజన్ సమయంలో మరింత వేగంగా ఆయా అంశాలకు సంబంధించిన విషయాలను స్ఫురణకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఈ కలర్ కోడింగ్ విధానంలో.. రెండు లేదా మూడు కలర్స్‌కే పరిమితమవడం మేలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉదాహరణకు.. ఏదైనా ఒక కీలకమైన పాయింట్‌ను గ్రీన్ కలర్‌తో, గణాంక సమాచారాన్ని రెడ్ కలర్‌తో, నిర్వచనాన్ని పింక్ కలర్‌తో.. ఇలా సంక్షిప్త నోట్స్ తయారు చేసుకోవాలి.
మైండ్ మ్యాపింగ్
స్టడీ నోట్స్ రాసే విషయంలో మరో ముఖ్యమైన విధానం.. మెండ్ మ్యాపింగ్ మెథడ్. ఈ విధానంలో.. ఆయా అంశానికి సంబంధించి విజువలైజేషన్ టెక్నిక్‌ను అనుసరించాలి. అంటే..సదరు టాపిక్‌కు సంబంధించి తమకు అనువైన రీతిలో సింబల్స్, లైన్స్, గ్రాఫ్స్‌ను రూపొందించుకోవాలి. అదే విధంగా ఏదైనా ఒక అంశాన్ని తమ నిత్య జీవితంలోని విషయాలతో ముడిపెట్టి గుర్తుంచుకునే విధానం కూడా మైడ్ మ్యాపింగ్ విధానంలోకి వస్తుంది.
Also read: TSPSC: గ్రూప్ 2 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్‌పై ఐడియా ఉందా.?
టేబుల్ ఫార్మట్
- పోటీ పరీక్షలకు స్టడీ నోట్స్ కోణంలో టేబుల్ ఫార్మట్ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా విస్తృతమైన సమాచారం ఉండే అంశాల విషయంలో ఈ విధానం అభ్యర్థులకు పునశ్చరణ, జ్ఞప్తికి ఎంతో ప్రయోజనం చేకూర్చుతుంది. ఉదాహరణకు.. ముఖ్యమైన ప్రదేశాలు లేదా సంవత్సరాల విషయంలో ఒక వరుస క్రమంలో సంవత్సరాన్ని.. దాని పక్కనే ఆ సంవత్సరంలో జరిగిన ఘటనలు క్లుప్తంగా రాసుకోవడం వంటివి చేయాలి.
- ఒక టాపిక్‌కు సంబంధించి అన్ని అంశాలు ఒకేసారి జ్ఞప్తికి తెచ్చుకునే విధానం లేదా పునశ్చరణకు ఉపయోగపడే విధానం.. ప్యాట్రన్ మెథడ్. ఈ పద్ధతిలో స్టడీ నోట్స్ రాసుకునేందుకు.. నిర్దిష్ట అంశాన్ని పేపర్ మధ్యలో ఒక వృత్తంలో రాసుకోవాలి. ఆ తర్వాత ఆ అంశానికి సంబంధించిన అనుబంధ పాయింట్లను లైన్స్‌లో రాసుకోవాలి.
Also read: Indian Polity Bit Bank: భారత రాజ్యాంగం ప్రకారం 'స్త్రీలను గౌరవించడం' అనేది?
చార్ట్‌ల రూపం
- స్టడీ నోట్స్ రాసుకునే సమయంలో అభ్యర్థులు చార్ట్‌ల రూపంలోనూ ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యాంశాలను పొందుపర్చుకోవచ్చు.ఒక పేజీలో రెండు లేదా మూడు వరుసల్లో.. ఒక టాపిక్‌కు సంబంధించిన ముఖ్యాంశాలను మొదటి వరుసలో.. దానికి సంబంధించిన కాన్సెప్ట్‌లు,ఫార్ములాలను రెండో వరుసలో.. సదరు టాపిక్‌కు సంబంధించిన తాజా పరిణామాలను మూడో వరుసలో రాసుకోవాలి. ఫలితంగా రివిజన్ సమయంలో టాపిక్ ఉద్దేశం మొదలు సమకాలీన పరిస్థితుల వరకూ.. అన్నింటినీ వేగంగా గుర్తుకు తెచ్చుకునే వీలుంటుంది.
డయాగ్రమ్స్–అబ్రివేషన్స్
స్టడీ నోట్స్ విషయంలో డయాగ్రమ్ మెథడ్ కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఒక టాపిక్‌కు సంబంధించి తమకు అనువైన, సులువుగా స్ఫురించేలా ఒక డయాగ్రమ్‌ను రూపొందించుకోవాలి. ఆ తర్వాత.. అందులో ముఖ్య భాగాల రూపంలో సదరు టాపిక్‌కు సంబంధించి ముఖ్య అంశాన్ని, దాని సబ్ టాపిక్స్‌ను రాసుకోవాలి.
స్టడీ నోట్స్ రాసుకునేటప్పుడు అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం.. అబ్రివేషన్స్ రాసుకోవడం. ఉదాహరణకు.. ఐక్యరాజ్య సమితి అని రాసుకునే బదులు యూఎన్‌ఓ అని రాసుకుంటే.. సమయం ఆదా అవుతుంది. నోట్స్ కూడా గజిబిజిగా లేకుండా.. సులువుగా ఆయా అంశాలపై తమ దృష్టిని కేంద్రీకరించేలా ఉంటుంది.
Also read: TSPSC Group 2 Jobs : టీఎస్‌పీఎస్సీ గూప్–2 పోస్టులకు ఉచిత శిక్షణ.. దరఖాస్తు చేసుకోండిలా..
సాంకేతిక పదాలు
స్టడీ నోట్స్‌లో అభ్యర్థులు ముఖ్యమైన సాంకేతిక పదాలను రాసుకోవాలి. వీటినే టెక్నికల్ జార్గాన్స్ అని కూడా అంటారు. ప్రతి సబ్జెక్ట్‌కు సంబంధించి నిర్దిష్టంగా కొన్ని పదాలు ఉంటాయి. ఉదాహరణకు ఎకానమీలో.. ‘రెపో’ రేటు, రివర్స్ రెపోరేట; అదే విధంగా జాగ్రఫీలో గ్లేసియర్స్, బ్యాడ్ ల్యాండ్స్ వంటివి. వీటిని స్టడీ నోట్స్‌లో పొందుపర్చుకోవడంతోపాటు క్లుప్తంగా ఒకటి రెండు వాక్యాల్లో వాటి అర్థాన్ని, నిర్వచనాన్ని కూడా రాసుకుంటే ప్రాథమిక అవగాహన ఏర్పడుతుంది.
చదువుతున్నపుడే
ఏదైనా ఒక టాపిక్‌కు సంబంధించి ప్రామాణిక పుస్తకం చదువుతున్నప్పుడే సొంత నోట్స్‌లో రాసుకోవాలి. అలాకాకుండా చదవడం పూర్తయిన తర్వాత నోట్స్ రాయొచ్చులే అనుకుంటే.. ఆ టాపిక్ పూర్తయ్యాక మళ్లీ మొదటి నుంచి చదవాల్సి ఉంటుంది. దీంతో సమయం వృథా అవుతుంది. కొన్నిసార్లు తర్వాత రాసుకుందాం అనే ఆలోచన చేయడంతో సదరు అంశంపై స్టడీ నోట్స్ రాయలేని పరిస్థితి కూడా ఏర్చడొచ్చు.
Also read: Indian History Bitbank: సూఫీ గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు?
సినాప్సిస్‌లకే పరిమితం
అభ్యర్థులు స్టడీ నోట్స్ రాసుకునే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా.. అన్ని అంశాలను వీలైనంత క్లుప్తంగా రాసుకోవాలి. నిర్వచనాలు, భావనలను రాసుకునేటప్పుడు ఇది ఎంతో ముఖ్యం. ఆయా టాపిక్స్‌కు సంబంధించి సినాప్సిస్(సంక్షిప్త వివరణ)కు పరిమితమవ్వాలి. ముఖ్యంగా జనరల్ ఎస్సే, జనరల్ స్టడీస్, డిస్క్రిప్టివ్ కొశ్చన్ అండ్ ఆన్సర్స్ విషయంలో ఇది ఎంతో ప్రధానమని గుర్తించాలి.
నిడివితోపాటు నీట్‌గా
స్టడీ నోట్స్‌లో ప్రతి పేజీలో నిడివి బాగుండేలా, రైటింగ్ కూడా చక్కగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి పేజీలో ఒక అంశానికి, మరో అంశానికి మధ్య కొంత గ్యాప్(నిడివి) విడిచిపెడితే.. సదరు టాపిక్‌కు సంబంధించి తర్వాత దశలో ఏదైనా కొత్త విషయం చదివినప్పుడు లేదా స్ఫురించినప్పుడు.. దాని కిందనే రాసుకోవడానికి వీలవుతుంది. అదే విధంగా రైటింగ్ కూడా నీట్‌గా ఉంటే రివిజన్ సమయంలో గందరగోళానికి గురవకుండా.. వేగంగా సదరు టాపిక్స్‌ను రివిజన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ∙ఇలా.. స్టడీ నోట్స్ రాసుకుంటూ అంకితభావంతో ప్రిపరేషన్ సాగిస్తే.. పోటీ పరీక్షల్లో విజయావకాశాలు మెరుగవుతాయి.
Also read: Telangana History Bit Bank: 2006లో క్విట్ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వహించిన సంస్థ ఏది?