APPSC DEO Recruitment 2024- సిలబస్ ఇదే,ఇలా చదివితే.. DEO ఉద్యోగం మీదే..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవలే 38 డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తులను జనవరి 9వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.
ఈ నేపథ్యంలో ఈ డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO) ఉద్యోగాలకు సిలబస్ ఎలా ఉంటుంది..? ఎలా చదివితే ఉద్యోగం సాధించవచ్చు..? బెస్ట్ బుక్స్.. మొదలైన అంశాలపై ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు Dr Moses గారిచే సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేక ఇంటర్వ్యూ..
ప్రశ్న: డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులకి సంబంధించిన ఎలాంటి అంశాలపై ఫోకస్ చేయాలి?
జవాబు: దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ ఈవో జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ పదేళ్లకు గానీ ఈ పోస్టులు భర్తీ చేసే అవకాశం లేదు. కాబట్టి ప్లాన్ ప్రకారం చదివితే జాబ్ గ్యారెంటీ.
ప్ర: మొత్తం ఎన్ని దశల్లో పరీక్ష ఉంటుంది?
జ: డిప్యూటీ ఈవో పరీక్షలో మొత్తం మూడు దశలుంటాయి. 1. స్క్రీనింగ్ టెస్టు,2. మెయిన్స్, 3. కంప్యూటర్ పరీక్ష
ప్ర: సిలబస్ ఏ విధంగా ఉంటుంది?
జ: చాలా సింపుల్. ఆంధ్రప్రదేశ్ బీఎడ్ కరిక్యులమ్‌లో ఉండే ప్రతి టాపిక్ డీఈవోలో ఉంటుంది. ఇందులో మొత్తం 2 పేపర్స్ ఉంటాయి.
ప్ర: ప్రతి పీజీ అభ్యర్థులు డీఈవో పోస్టులకు అర్హులేనా? ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?
జ: బీఎడ్ చేయడానికి అర్హత ఉన్న ప్రతి పీజీ విద్యార్థి అప్లై చేసుకోవచ్చు.
ప్ర: ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండనుంది?
జ: ఓసీ వారికి-42 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్లకు-47ఏళ్లకు మించరాదు
ప్ర: రోజుకు ఎన్ని గంటలు వెచ్చించాలి? మొత్తం ఎన్ని బుక్స్ చదవాల్సి ఉంటుంది?
జ: డీఈవో పోస్టుకు సంబంధించి మొత్తం 2 పేపర్స్ ఉంటాయి. వీటికోసం మొత్తం 30 పుస్తకాలు చదవాల్సి ఉంటుంది. బీఎడ్‌లో ఉండే ఎడ్యుకేషన్ కి సంబందించిన పుస్తకాలు చదివితే చాలు. రోజుకు 5 గంటలు కష్టపడితే డీఈవో జాబ్‌ను సులభంగా సొంతం చేసుకోవచ్చు.
ప్ర: జీఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎక్కువగా స్కోర్ చేయాలంటే ఏం చేయాలి?
జ: గ్రూప్-1, గ్రూప్-2, ఇతర రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి గతంలో వచ్చిన 10-20 ప్రశ్నపత్రాలు చదవాలి. జీఎస్‌ను వర్తమాన వ్యవహారాలకు అనుసంధానించి చదివితే మంచి మార్కులు స్కోర్ చేయొచ్చు. రెండేళ్ల నుంచి దినపత్రికలో వచ్చే కరెంట్ అఫైర్స్‌పై నాలెడ్జ్ ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రించిన 3వ తరగతి నుంచి డిగ్రీ అకాడమిక్ పుస్తకాలను టాపిక్స్ వారిగా చదవాలి. కరెంట్ ఈవెంట్స్‌పై న్యూస్ చానెల్స్‌లో వచ్చే చర్చలను పరిశీలించాలి.
ప్ర: ఎలాంటి సిలబస్‌పై ఎక్కువగా దృష్టి పెట్టాలి?
జ: ఎడ్యుకేషన్ సైకాలజీ, సోషియాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రెండ్ ఇన్ ఇడ్యుకేషన్, ఇడ్యుకేషన్ సైకాలజీతో పాటు ఏపీ ట్రెండ్స్ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎలా ఉన్నాయి అన్నది ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మరింత ఎక్కువగా దృష్టి పెట్టాలి.