సాక్షి, అమరావతి: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీలో లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి ఈనెల 24, 25 తేదీల్లో మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. 24న ఉదయం 9.30 నుంచి 12 గంటలకు వరకు పేపర్–2, 25న ఉదయం పేపర్–1 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 17 నుంచి https://psc.ap.gov.in నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Assistant Librarian Exam Halltickets To Release News In Telugu
25న అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పరీక్ష ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఈనెల 25న మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నట్టు కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆరోజు ఉదయం పేపర్–1, మధ్యాహ్నం పేపర్–2 ఉంటుంది. అభ్యర్థులు 18 నుంచి ఏపీపీఎస్సీ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ముఖ్యసమాచారం:
అసిస్టెంట్ లైబ్రేరియన్ పరీక్ష
పరీక్ష తేది: మార్చి 24, 25 తేదీల్లో సమయం: ఉ. 9.30 నుంచి 12 గంటలకు హాల్‌టికెట్స్ విడుదల: మార్చి 17 నుంచి వివరాలకు: https://psc.ap.gov.in
అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ పరీక్ష
పరీక్ష తేది: మార్చి 25న హాల్‌టికెట్స్ విడుదల: మార్చి 18 నుంచి